ఇప్పుడున్న డిజిటల్ యుగంలో సంపాదించడం అంటే కేవలం 9-5 జాబ్ చేసి సంపాదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చదువుకుంటూ సంపాదించవచ్చు. Earn While You Learn అనే ఆలోచన ఇప్పటి కొత్త ఆర్థిక వ్యవస్థలో చాలా శక్తివంతమైనదిగా మారింది. మీరు కాలేజీలో ఉన్న విద్యార్థి అయినా గాని, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్న యువత అయినా, లేదా మీ అభిరుచిని డబ్బుగా మార్చాలనుకునే ఎవరైనా సరే, ఈ ఆర్టికల్ మీకు పూర్తి రోడ్ మ్యాప్ ఇస్తుంది. మనం జీవిస్తున్న ఈ యుగంలో డిజిటల్ వృద్ధి, నైపుణ్యాల ఆధారంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో కూడిన ఒక వేగవంతమైన ప్రపంచం.
ఇలాంటి పరిస్థితుల్లో, సంపాదించాలంటే చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం వేచి చూడాల్సిన అవసరం అసలే లేదు. ఇప్పుడు మనం చూసే నూతన ధోరణి Earn While Learn — అంటే చదువుకుంటూనే డబ్బు సంపాదించడం అని అర్థం. ఈ భావన ఇప్పుడు యువతలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఇది కేవలం అదనపు ఆదాయ మార్గమే కాదు, మీ కెరీర్‌కు సుదీర్ఘ ప్రాథమిక మెట్టు కూడా అవుతుంది. కాలేజీలో చదువుతున్న విద్యార్థులనుంచి, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలనుకునే యువతవరకు ఈ విధానం అందరికీ వరంగా మారుతోంది అని చెప్పవచ్చు.
What Does Earn While You Learn Mean?
చదువుకుంటూ సంపాదించు(Earn While You Learn) అంటే మీరు చదువుకుంటున్న సమయంలో కూడా డబ్బు సంపాదించడం. ఎలా అంటే ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకుంటూ, ఫ్రీలాన్స్ పనులు చేయడం, పార్ట్ టైం ఉద్యోగాలు లేదా మీ శైలిలో కంటెంట్ క్రియేట్ చేయడం వంటి అన్ని రకాలైన సంపాదనలు ఇందులో ఉంటాయి. అంటే, మీరు చదువుతో పాటు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కూడా పొందగలుగుతారు.
Why It Matters in Today’s World
ప్రపంచం వేగంగా మారుతోంది. అందువల్ల పాత కాలం డిగ్రీలు మాత్రమే సరిపోతాయనేది తప్పు. ఈ రోజుల్లో ఉద్యోగాలు అనేవి స్కిల్స్ ఉంటేనే వస్తున్నాయి. విద్యకు చాలా ఖరీదు పెరిగింది. గిగ్ ఆర్థిక వ్యవస్థ (Gig Economy) కారణంగా చదువుకుంటూ ఉండగా సంపాదించడం చాలా ఇంపార్టెంట్ అయింది. లింక్డ్ఇన్, అప్వర్క్ లాంటి ప్లాట్‌ఫారమ్స్, యువతలో ఫ్రీలాన్స్ అవకాశాలు 25% పెరిగినట్లు తెలిపాయి. YouTube, Udemy, Fiverr వంటి వేదికలు డబ్బు సంపాదించే మార్గాలను తెలపడంతో, నేర్చుకుంటూ ఉండగా కూడా సంపాదించటం సాధ్యం అయింది.
Benefits of Earning While Studying
చదువుకుంటూ సంపాదించడం(Earn While You Learn) వల్ల ఆర్థిక స్వాతంత్య్రం మీకుంటుంది. అలాగే తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. టైమ్ మేనేజ్మెంట్ తో పాటు, క్రమశిక్షణ నేర్చుకుంటారు. రియల్ లైఫ్ అనుభవం తో మీ రిజ్యూమే ఇంప్రూవ్ అవుతుంది. మీ బలాలు మరియు కెరీర్ దిశ గురించి స్పష్టత ఏర్పడుతుంది. అలాగే వ్యాపార మైండ్‌సెట్ అభివృద్ధి అవుతుంది. ఇంకా మీలో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు డబ్బు మాత్రమే సంపాదించరు, అనుభవం, పరిచయాలు మరియు మీ పోర్ట్‌ఫోలియో కూడా పెంచుకుంటారు.
Who Can Earn While They Learn?
ఎవరు చదువుకుంటూ సంపాదించాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కాబట్టి మీరు కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు అయ్యుండచ్చు. 16 సంవత్సరాల పైబడిన హైస్కూల్ విద్యార్థులు అయ్యుండచ్చు. ఆన్‌లైన్ కోర్సులు చేస్తున్న అభ్యర్థులు మరియు పార్ట్ టైం నేర్చుకునే హోమ్ మేకర్స్ కావచ్చు. కెరీర్ మార్పు కోసం రీస్కిల్లింగ్ చేస్తున్న యువత కావచ్చు. పార్ట్ టైం చదువుతున్న యువ ఉద్యోగులు కావచ్చు. వీరిలో ఎవరైనా పర్లేదు మీరు చదువుతున్నంతవరకు మీరు సంపాదించవచ్చు.
Best Ways to Earn While You Learn
1. Freelancing :
మీకున్న స్కిల్స్ ని Fiverr, Upwork, Freelancer, Toptal వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రీలాన్సింగ్ లో పాపులర్ స్కిల్స్ ఏంటో చూద్దాం. కాకపోతే వీటిలో మీకు ప్రాజెక్ట్స్ రావడం కొంచెం కష్టం. కానీ మీ ప్రొఫైల్ మరియు పోర్ట్‌ఫోలియో బలంగా తయారు చేసుకోండి. చిన్న చిన్న ప్రాజెక్ట్‌లు చేస్తూ నమ్మకాన్ని పొందండి, తరువాత మీ రేట్లు పెంచుకోండి. ఇలా చదువుకుంటూ సంపాదించడం అనేది ఒక మంచి కెరీర్ వైపు దారి అని చెప్పుకోవచ్చు. అందుకే ఈరోజుల్లో Earn While You Learn చాలా పాపులర్ అవుతుంది.
- గ్రాఫిక్ డిజైనింగ్
- వెబ్ డెవలప్‌మెంట్
- వీడియో ఎడిటింగ్
- కంటెంట్ రైటింగ్
- డిజిటల్ మార్కెటింగ్
- డేటా ఎంట్రీ
- వర్చువల్ అసిస్టెంట్
- Online Tutoring
మీరు గనుక ఏదైనా సబ్జెక్ట్ లో నిపుణుడైతే, ఆ సబ్జెక్ట్ ని ఇతరులకు బోధించండి. నాకు తెలిసిన కొంతమంది విద్యార్థులు రోజుకు 2-3 గంటలు ట్యూటరింగ్ చేసి నెలకు ₹10,000 నుంచి ₹50,000 సంపాదిస్తున్నారు. YouTube, Zoom ద్వారా కూడా ట్యూటరింగ్ చేయవచ్చు
Best Platforms: Chegg, Vedantu, Preply, Wyzant
Topics: Maths, Science, Languages, Coding.
2. Content Creation :
కంటెంట్ క్రియేట్ చేస్తూ, దానితో డబ్బు సంపాదించండి. ఎలా అంటే కెరీర్ గైడెన్స్, స్టడీ టిప్స్, ఫైనాన్స్, ఫిట్నెస్, ట్రావెల్ లేదా ప్రొడక్టివిటీకి సంబంధించిన కంటెంట్ క్రియేట్ చేస్తూ ఆడియన్స్ ని పెంచుకోండి.
- YouTube: అడ్స్, స్పాన్సర్‌షిప్స్, అఫిలియేట్ లింక్స్ ఎర్న్ చేయవచ్చు.
- Instagram: బ్రాండ్ ప్రమోషన్స్, డిజిటల్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తూ మనీ ఎర్న్ చేయొచ్చు.
- Blogging: SEO ద్వారా ట్రాఫిక్, అఫిలియేట్ సేల్స్ లేదా అడ్స్ ద్వారా సంపాదించవచ్చు.
- Podcast: స్పాన్సర్‌షిప్స్, కోర్సుల ప్రమోషన్ చేస్తూ సంపాదించవచ్చు.
3. Affiliate Marketing :
ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసి, ప్రతి సేల్ పై కమిషన్ పొందండి. సరిగ్గా చేస్తే ఇది పాసివ్ ఇన్కమ్‌గా మారుతుంది. YouTube, బ్లాగ్ లేదా Instagram ద్వారా ప్రమోట్ చేయండి. హై-టికెట్ లేదా రికరింగ్ కమిషన్ ప్రోగ్రామ్స్ ఎంచుకోండి.
Best Platforms: Amazon Associates, ClickBank, Digistore24
4. Part-Time Jobs :
ఇక్కడ ముఖ్యంగా మీ చదువుని ఆపేయకూడదు. ముఖమైన పార్ట్ టైమ్ జాబ్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
- డేటా ఎంట్రీ
- స్టోర్ అసిస్టెంట్
- ఆన్‌లైన్ కస్టమర్ సపోర్ట్
- డెలివరీ ఏజెంట్ (Swiggy/Zomato)
- ఈవెంట్ వాలంటీరింగ్
5. Internships & Apprenticeships :
కొన్ని రకాల ఇంటర్న్‌షిప్స్ స్టైపెండ్లు ఇస్తున్నాయి మరియు రిమోట్ అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. అవి ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
- Internshala, AngelList, LinkedIn ద్వారా అప్లై చేయండి.
- కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోండి.
- స్టైఫండ్ ₹5,000 నుంచి ₹25,000 నెలకు ఉంటుంది.
6. Selling Digital Products :
ఒకసారి తయారుచేసిన ప్రొడక్ట్ ని ఎల్లప్పుడూ అమ్మవచ్చు. Gumroad, Payhip, Etsy (డిజిటల్ ప్లానర్స్/టెంప్లేట్స్) వంటి ప్లాట్‌ఫారమ్స్ ఉపయోగించండి. డిజిటల్ ప్రొడక్ట్స్ లో ఏవేవి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- eBooks
- Notion Templates
- Resume Templates
- Canva Designs
- Online Courses
- Remote Customer Support
స్టార్టప్‌లు పార్ట్ టైమ్ లేదా రిమోట్ కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు ఇస్తున్నాయి.
చాట్/ఇమెయిల్ ద్వారా కస్టమర్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం.
Zendesk, Intercom, Freshdesk వంటి టూల్స్ ఉపయోగించడం.
ఆదాయం నెలకు ₹ 15,000 నుంచి ₹ 30,000 వరకు ఉంటుంది.
Balancing Work and Studies
ఇక్కడ టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. కాబట్టి స్పష్టమైన షెడ్యూల్ తయారుచేయండి. అందుకోసం గూగుల్ క్యాలెండర్, Notion వంటివి ఉపయోగించండి. పరీక్షలు మరియు ముఖ్యమైన చదువులపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టండి. పరీక్ష సమయాల్లో పనిని తగ్గించండి. ఎందుకంటే చదువు అనేది చాలా ముఖ్యం. ఒక పని మీద పూర్తిగా శ్రద్ద పెట్టండి. ఉదాహరణకు చదువు లేదా పని. మీకు తగినంత సామర్థ్యం కంటే ఎక్కువ పని తీసుకోకండి.
Best Tools & Platforms for Success
టైమ్ మేనేజ్మెంట్ కోసం ఈ క్రింది టూల్స్ ఉపయోగించండి.
- Notion
- Todoist
- Google Calendar
లెర్నింగ్ కోసం ఈ క్రింది ప్లాట్ఫారం ఉపయోగించండి.
- Coursera
- Skillshare
- Udemy
- YouTube
- edX
డబ్బు సంపాదించడానికి ఈ క్రింది ప్లాట్ఫారం ఉపయోగించండి.
- Fiverr / Upwork (ఫ్రీలాన్స్)
- Chegg / Preply (ట్యూటరింగ్)
- Gumroad (ఉత్పత్తుల అమ్మకం)
- Medium (రాయడం)
- Teachable (కోర్సులు)
ప్రొడక్టివిటీ కోసం ఈ క్రింది టూల్స్ వాడండి.
- Grammarly
- Canva
- ChatGPT
- Trello / Asana (టాస్క్ ట్రాకింగ్)
Real-Life Success Stories
స్నేహ అనే 21 సంవత్సరాల అమ్మాయి కాలేజీలో ఉండగా Fiverr లో గ్రాఫిక్ డిజైనింగ్ చేసి నెలకు ₹50,000 సంపాదిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత రిమోట్ ఉద్యోగం కూడా పొందింది.
అర్జున్ అనే 19 సంవత్సరాల అబ్బాయి కోడింగ్ ట్యుటోరియల్స్ వీడియోలు YouTube లో పెట్టి 50,000 Subscribers కి చేరుకున్నాడు. ఇప్పుడు అతను అడ్స్, స్పాన్సర్‌షిప్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు.
Common Mistakes & How to Avoid Them
అనుమానం పెంచుకోవడం వల్ల అవుతుందా కాదా అని అలాగే ఉండటం. అందువల్ల మీరు మొదలు పెట్టకపోవడం జరుగుతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే చిన్న చిన్న స్టెప్స్ తో ప్రారంభించండి. అలాగే టైమ్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల గజిబిజిగా ఉంటుంది. అందుకే కచ్చితమైన షెడ్యూల్ పాటించండి. పని మరియు చదువు మధ్య అసమతుల్యత ఏర్పడటం. అందుకే సమయాన్ని సమర్థవంతంగా బ్లాక్ చేయండి. చదువుకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా పెద్ద సమస్య అవుతుంది. అందువల్ల మీరు విద్యను ప్రథమ స్థానంలో ఉంచండి. Earn While You Learn అనేది చదువుకుంటూ సంపాదించడం. అలా అని చదువుని పక్కన పెట్టేయడం కాదు. చదువుతోపాటు మీకున్న ఫ్రీ టైమ్ లో సంపాదించడం.
Step-by-Step Action Plan
- మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంది, ఎలాంటి స్కిల్స్ ఉన్నాయనేది గుర్తించండి.
- వర్క్ టైం మరియు స్టడీ టైమ్ షెడ్యూల్ తయారుచేసుకోండి.
- ఒక సులభమైన ఆన్‌లైన్ వేదిక ఎంచుకుని మొదలు పెట్టండి
- రోజూ కనీసం 1 గంట పని చేయండి.
- ఎప్పటికప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేయండి, మంచి రేటింగ్స్ పొందండి.
- కొత్త కొత్త ప్రొఫెషనల్స్ తో కనెక్ట్ అవ్వండి, నెట్‌వర్క్ ని పెంచుకోండి.
- ఎప్పటికప్పుడు మీ స్కిల్స్ అప్‌డేట్ చేసుకోండి.
- పర్సనల్ బ్రాండ్ ని సృష్టించండి (సోషల్ మీడియా)
- ఖచ్చితంగా వర్క్-లైఫ్ బలన్స్ పాటించండి.
- సంపాదించిన ఆదాయాన్ని ఆదా చేయండి.
Powerful Steps to Create a LinkedIn Profile
Final Thoughts
మీరు చదువుకుంటూ డబ్బు సంపాదించడం అనేది కేవలం ఒక ఆప్షన్ కానే కాదు ఇది ఒక అవసరం. ఇది ఆర్థిక స్వాతంత్ర్యానికి, కెరీర్ వృద్ధికి, మీ జీవితంలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి గేటు. Earn while you learn అనే ఆలోచన ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చదువుకి అయ్యే ఖర్చులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కాబట్టి విద్యార్థులు చదువునే ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్థికంగా ఈజీగా ఉండే మార్గాలు అవసరం అవుతున్నాయి. గిగ్ ఆర్థిక వ్యవస్థ (Gig Economy) విస్తరిస్తోంది. మామూలు ఉద్యోగాలు కాకుండా, పార్ట్ టైమ్, ఫ్రీలాన్స్, రిమోట్ పనుల ద్వారా సంపాదించగలగడం సులభమవుతోంది. నేటి టెక్నాలజీ అందించిన అవకాశాల వలన — ల్యాప్‌టాప్, ఇంటర్నెట్, స్కిల్ ఉన్నవాడికే పని, అన్న స్థితి ఏర్పడింది. సమయాన్ని ప్రోడక్టివ్‌గా వాడుకోవాలని భావించే యువతలో, ఈ ఆలోచన ఒక గేమ్-చేంజర్‌గా మారుతోంది.
FAQs :
1. What is the right age to start earning while studying?
16 సంవత్సరాల వయస్సు నుంచే మీరు సంపాదించడం ప్రారంభించవచ్చు. మీరు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదువుతున్న సమయంలో చిన్న చిన్న పనులు చేయడం ద్వారా ఆదాయం పొందొచ్చు.
2. How can I start freelancing as a student?
ముందుగా మీరు Fiverr, Upwork, Freelancer వంటి ఫ్రీలాన్స్ వెబ్‌సైట్లలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. స్కిల్స్ పై ఆధారపడిన చిన్న ప్రాజెక్టులు తీసుకుని, నెమ్మదిగా నమ్మకం పెంచుకుంటూ వెళ్ళండి.
3. Will earning part-time affect my studies? మీరు గనుక సరైన టీమ్ మేనేజ్మెంట్ ఉంటే చదువుపై ఎలాంటి ప్రభావం ఉండదు. రోజులో కొన్ని గంటలు మాత్రమే పని చేస్తే, చదువుకూ, పనికీ సమతుల్యత సాధించవచ్చు.
4. Do I need a degree or qualifications to start earning online?
ఎలాంటి డిగ్రీ అవసరం లేదు. మీరు చేయగలిగే పని మీద నైపుణ్యం ఉంటే చాలు. డిజిటల్ మార్కెటింగ్, డిజైన్, కంటెంట్ రైటింగ్, కోడింగ్ లాంటి స్కిల్ల్స్‌తో మీరు ఉద్యోగాలు లేకుండా సంపాదించవచ్చు.
5. What are the easiest ways for students to earn money online?
కంటెంట్ రైటింగ్, ఆన్‌లైన్ ట్యూషన్స్, డేటా ఎంట్రీ, యూట్యూబ్ వీడియోలు, అఫిలియేట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ మొదలైనవి స్టార్ట్ చేయడానికి సులభమైన మార్గాలు.
6. Can I earn while studying without investment?
అవుననే చెప్పవచ్చు. ఫ్రీలాన్స్, బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్, అఫిలియేట్ మార్కెటింగ్ వంటివి పెట్టుబడి లేకుండా ప్రారంభించవచ్చు. కొంత సమయం, శ్రమ పెట్టగలిగితే చాలు.
7. What is earn while you learn?
సింపుల్ గా చెప్పాలంటే, Earn while you Learn అనేది చదువుకుంటూ సంపాదించడం. అలా అని చదువుని పక్కన పెట్టేయడం కాదు. చదువుతోపాటు సంపాదించడం.
Join us on Telegram Group.