10 Powerful Steps to Create a LinkedIn Profile

ప్రెజెంట్ ఉన్న డిజిటల్ యుగంలో ప్రతి ఉద్యోగి, ఫ్రీలాన్సర్, వ్యాపారవేత్త, అనేటువంటి వాళ్ళు ప్రొఫెషనల్ LinkedIn ను సరైన రీతిలో ఉపయోగించాలి. ఎందుకంటే, ఇది కేవలం ఉద్యోగ అవకాశాలకు మాత్రమే కాకుండా, మన టాలెంట్ ను ప్రపంచానికి చూపించే వేదిక కూడా అని చెప్పవచ్చు. అందుకే ఈ ఆర్టికల్ ద్వారా మీకు ప్రతి పార్ట్ గురించి స్పష్టంగా, ఆచరణాత్మకంగా వివరించబోతున్నాం. మీరు కొత్తవారైనా సరే, LinkedIn ను ఇప్పటికే వాడుతున్న వారైనా సరే – ఈ వ్యాసం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఉద్యోగానికో, వ్యాపార సంబంధాలకో, లేదా మీ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఆశయంతో ఉన్నా – మీ LinkedIn ప్రొఫైల్ ఓ బలమైన బ్రాండ్‌లా ఉండాలి. ఈ డిజిటల్ యుగంలో, మీరు మాట్లాడకుండానే! మీ ప్రొఫైల్ మాట్లాడాలి. మరి అలాంటి ప్రొఫైల్‌ని ఎలా తయారు చేసుకోవాలి? అందుకే మేము మీ కోసం తీసుకొచ్చాం – 10 Powerful Steps to Create a LinkedIn Profile అనే పవర్ ప్యాక్డ్ గైడ్. ఇది కేవలం స్టెప్స్ మాత్రమే కాకుండా, మీరు తక్షణమే అమలు చేయగల టిప్స్‌తో, ప్రొఫైల్‌ని ఓ మాగ్నెట్‌లా మార్చే సీక్రెట్స్‌తో నిండి ఉంది. మొదటిసారి LinkedIn వాడుతున్నా, లేక ఇప్పటికే ఉన్న ప్రొఫైల్‌ని కొత్తగా మార్చాలన్నా – ఇది మీ కోసం!

Powerful Steps to Create a LinkedIn Profile

1. Profile Picture: ఒక్క ఫోటో వేల పదాల మాటలు చెప్పగలదని అంటారు. అందుకే LinkedIn లో మీరు పెట్టే ఫోటో, మీ ప్రొఫెషనల్ గుర్తింపుగా మారుతుంది. క్లీన్, పర్ఫెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. మొహం స్పష్టంగా కనిపించాలి (మీ ముఖం ఫోటోలో 60% వరకు కనిపించాలి). కెమెరాను చూస్తూ స్మైల్ తో ఉండాలి, ఇలా ఉండటం వల్ల అవతలి వారికి మనమీద నమ్మకాన్ని కలిగిస్తుంది. షూస్ లేదా సెల్ఫీలు కాకుండా ఫోటో ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఉదాహరణకు ఫోటో తీసే ముందు మీ డ్రెస్, హెయిర్ స్టైల్, లైట్ ఇఫెక్ట్స్ చూసుకోవడం మంచిది.

2. Headline: హెడ్‌లైన్ అనేది మీ పేరు క్రింద కనిపించే చిన్న సెంటెన్స్. ఇది చూసిన వెంటనే, కొంత మందికి మీ ప్రొఫైల్‌నే ఓపెన్ చేయాలి అనిపించేలా ఉండాలి. మీ headline అనేది Designation + Expertise + Value కలగలిపి ఉండాలి. ఉదాహరణకు Content Marketer Helping Startups Grow | SEO & Growth Hacking Expert. మీ సర్వీస్ లేదా నాలెడ్జ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో స్పష్టంగా చెప్పండి. మీరు ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నా, ఫ్రీలాన్స్ అవకాశాలకోసం ఎదురు చూస్తున్నా – హెడ్‌లైన్‌తోనే ఆకర్షించగలగాలి.

3. Summary Section: About సెక్షన్ అంటే LinkedInలో మీ గురించి వివరించే విభాగం. ఇది చదివినవారు మీ వృత్తి ప్రయాణాన్ని అర్థం చేసుకోవాలి. మొదటగా మీ పరిచయం, అసలు మీరు ఎవరు, ఎక్కడ పనిచేస్తున్నారు? అనేది వివరించాలి. ఆ తర్వాత మీ స్కిల్స్ & సక్సెస్, ఏ రకమైన పనులు చేశారు, ఏ ఏ ఫలితాలు సాధించారు? అనేది కూడా వివరించాలి. ఇక తర్వాత మీరు ఆఫర్ చేయగల సర్వీసెస్ & మీ లక్ష్యం గురించి వివరించాలి. ఉదాహరణకు నేను 6 సంవత్సరాల అనుభవం ఉన్న డిజిటల్ మార్కెటర్‌ను. నాకు SEO, కంటెంట్ మార్కెటింగ్, బ్రాండ్ డెవలప్‌మెంట్ మీద లోతైన పరిజ్ఞానం ఉంది. నేను చాలా స్టార్ట్‌ప్ కంపెనీలకు ట్రాఫిక్ పెరిగి, లీడ్ జనరేషన్ జరిగేలా చేశాను. నిజానికి మీరు సాధించిన సక్సెస్ ని చూపండి. అప్పుడే నమ్మకాన్ని పెంచుతుంది.

4. Experience Section: ఇక్కడ మీరు చేసిన జాబ్స్ లిస్ట్ కంటే, ఆ ఉద్యోగంలో ఏ రకమైన విలువ చేర్చారో చెప్పాలి. మీరు చేసిన ప్రతి జాబ్ లో మీ పాత్రను 3–5 బుల్లెట్ పాయింట్లతో వివరించండి. ఎలా అంటే Action + Result ఫార్మాట్ ని వాడండి. ఉదాహరణకు Executed SEO strategy leading to 60% increase in organic traffic in 4 months. ఇలా ఉంటే చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. మీ ఓల్డ్ ప్రాజెక్టులకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ఉంటే, దానిని మీడియా లింక్‌గా జత చేయండి.

5. Skills & Endorsements: LinkedInలో 50 స్కిల్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. కానీ వాటిలో టాప్ 3 స్కిల్స్ కి ఇంపార్టెన్స్ ఎక్కువ. నిజంగా మీకున్న స్కిల్స్ మాత్రమే యాడ్ చేయండి. ప్రతి స్కిల్ కోసం మీరు పనిచేసినవారి నుంచి endorsements తీసుకోండి. వాటిని మీరు ఎలా ఉపయోగించారు అనే దానిపై ప్రూఫ్ చూపించండి. ఎలా అంటే ప్రాజెక్ట్‌లు, వాటి ఫలితాలు లాంటివి. ఉదాహరణకు Strategic Planning, Social Media Ads, Performance Marketing లాంటి స్కిల్స్.

6. Recommendations: ఇది మీపై ఇతరులు ఇచ్చే రాతల అభిప్రాయం అని చెప్పవచ్చు. ఎలా కలెక్ట్ చేయాలంటే మీతో పని చేసిన సీనియర్స్, టీం మెంబర్లు, క్లయింట్స్ లాంటి వారిని అడగండి. అలాగే మీరు కూడా వారికోసం ఒక మంచి recommendation రాయండి. Recommendation రాసే ముందు, వారు మీతో పని చేసిన సందర్భాన్ని గుర్తుచేసేలా అడగండి. ఉదాహరణకు ఒకే recommendation కాకుండా – వివిధ రకాల ప్రాజెక్టుల నుంచి అనేకమైనవి ఉండాలి.

7. Custom URL: ఇక్కడ మీరు ఇంపార్టెంట్ వర్క్స్, ప్రాజెక్టులు, లింక్స్, ఆర్టికల్స్ ని చూపించవచ్చు. ఎలాంటివి అంటే బ్లాగ్ లింక్స్, వీడియోల లింక్స్, వెబ్‌సైటు లింకులు వంటివి. ఇంకా ప్రెజెంటేషన్లు, సర్టిఫికెట్లు వంటివి యాడ్ చేయవచ్చు. అలాగే మీరు మాట్లాడిన webinars, interviews వంటివి కూడా యాడ్ చేయవచ్చు. ఇక్కడ మీరు చెప్పడం మాత్రమే కాదు, ఆ వర్క్ చూపించాలి.

8. Featured Section: మీ LinkedIn URL ను మీరు స్వయంగా మార్చుకోవచ్చు. ఉదాహరణకు linkedin.com/in/abcd123 కి బదులుగా linkedin.com/in/ramdigitalmarketer అని మార్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, మిమ్మల్ని సులువుగా గుర్తుపట్టేస్తారు. ఈ లింక్ ని వెబ్‌సైట్లలో షేర్ చేయడం కూడా ప్రొఫెషనల్‌గా ఉంటుంది.

9. Networking and Engagement: మీ ప్రొఫైల్ ఎంత బాగున్నా, మీరు నెట్‌వర్క్ బిల్డ్ చేయకపోతే పెద్దగా ఉపయోగం ఉండదు. రోజుకు కనీసం 3–5 కొత్త కనెక్షన్లు పంపండి (పర్సనలైజ్డ్ నోటుతో). ఇతరుల పోస్ట్‌లకు స్పందించండి, షేర్ చేయండి. మీ ఇండస్ట్రీ లో ఉన్న గ్రూప్స్‌లో చేరండి, చర్చల్లో పాల్గొనండి. ఇలా చేయడం వల్ల మీకు నెట్వర్క్ పెరుగుతుంది.

10. Content Posting: మీరు ఎలాగైతే ఎదగాలనుకుంటున్నారో, అదే విషయాలపై కంటెంట్ రాయండి. మీరు చేసిన పనుల గురించి, మీ అభిప్రాయాలు, ట్రెండ్స్ గురించి LinkedInలో షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఆడియన్స్ పెరుగుతారు. అప్పుడు మీరు ఒక బ్రాండ్ అవుతారు.

Top 5 Career Paths with Fastest Growth in 2025

కంటెంట్ ఎలాంటి టాపిక్స్ మీద రాయాలంటే, నా క్లయింట్‌కు Organic Traffic ఎలా పెరిగింది? అని క్వాలిటీ కంటెంట్ పోస్ట్ చేయండి. ఇంకా Top 5 Tools for Social Media in 2024. నేను నా ఫెయిల్యూర్ నుండి నేర్చుకున్న 3 పాఠాలు. 10 Powerful Steps to Create a LinkedIn Profile ఇలాంటి కంటెంట్ ఐడియాస్ పై ఆర్టికల్ రాయండి. వారానికి కనీసం 1 పోస్ట్ అయినా షేర్ చేయండి. అప్పుడే consistency అనేది ఉంటుంది.

చివరగా మీ LinkedIn ప్రొఫైల్‌ను ఒక బ్రాండ్‌గా తయారు చేయండి. ప్రతి ఒక్కరూ LinkedInలో ఉండొచ్చు. కానీ, అట్ట్రాక్టీవ్ గా, ట్రస్టెడ్ ప్రొఫైల్ ఉండటం వల్లే అవకాశాలు వస్తాయి. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్న చెక్‌లిస్ట్‌ని ఫాలో అవుతూ, రోజు రోజుకు ఇంప్రూవ్ చేసుకుంటూపోతే – మీరు మంచి ప్రొఫెషనల్ బ్రాండ్‌గా ఎదగవచ్చు. మీరు ఇప్పుడు చేయవలసింది – ఈ చెక్‌లిస్ట్ ప్రింట్ చేసుకోండి లేదా సేవ్ చేసుకోండి. ప్రతిరోజూ ఒక్కో అంశాన్ని అప్‌డేట్ చేయండి. ప్రొఫైల్ పూర్తిగా సిద్ధం అయిన తర్వాత, స్నేహితులను, మెంటర్లను అడిగి ఫీడ్‌బ్యాక్ తీసుకోండి.

Join us on Telegram Group.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *