భారతదేశంలోని అత్యంత గౌరవనీయ పారిశ్రామికవేత్తలలో ఒకరిగా రతన్ టాటా గారు ప్రసిద్ధి చెందారు. రతన్ టాటా గారు ఎంతో ప్రత్యేకమైన దూరదృష్టి కలవారు. అందుకే ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచస్థాయిలో వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించింది.
అలాగే నైతిక విలువలు మరియు వినూత్నమైన ఆవిష్కరణలతో ఎప్పుడూ ముందే ఉండేవారు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న Ratan Tata నుంచి పారిశ్రామికవేత్తలు ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
Ratan Tata Biography:
భారతదేశంలో ఉన్న అతి ప్రాచీన మరియు అతి పెద్ద సంస్థ ఈ టాటా గ్రూప్. ఈ టాటా గ్రూప్ ని 1868 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. Tata Group ను స్థాపించిన Jamsetji Tata ముని మనవడు Ratan Tata గారు.
రతన్ టాటా గారు 28 డిసెంబర్ 1937 సంవత్సరంలో భారదేశంలోని అత్యంత ధనిక కుటుంబంలో ముంబైలో జన్మించారు.
రతన్ టాటా 10 ఏళ్ళు ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. కానీ వాళ్ళ నానమ్మ రతన్ టాటా ను, తల్లిదండ్రుల విడాకుల ప్రభావం అతనిపై పడకుండా మంచి విలువలతో పెంచారు.
చదువు విషయానికి వస్తే రతన్ టాటా గారు అమెరికా లో ఆర్కిటెక్చర్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆయనకు అక్కడే లాస్ ఏంజెల్స్ లో ఉద్యోగం దొరికింది. ఆ తర్వాత 1961 లో టాటా కంపెనీ లో చేరాడు.
అలా 1991 లో అదే కంపెనీకి వారసుడిగా ఎంపికయ్యాడు. ఒకప్పుడు తన ప్రారంభంలో 10 వేల కోట్లు విలువున్న కంపెనీని, ఈరోజు దాదాపుగా 33 లక్షల కోట్లకు పైగా చేర్చాడు.
చివరగా రతన్ టాటా గారు 9 అక్టోబర్ 2024 లో దాదాపు 86 ఏళ్ల వయస్సులో తీవ్రమైన ఆరోగ్య సమస్యల వల్ల ముంబై లోని Breach Candy Hospital చేరాడు. వయస్సు సంబంధిత సమస్యల వల్ల రాత్రి కన్నుమూశారు.
ఎంతో గొప్ప మానవతా విలువలు కలిగిన రతన్ టాటా గారు ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. అవేంటో పూర్తిగా తెసులుకుందాం.
Visionary Thinking with Long Term Focus:
రతన్ టాటా గారు లాభాలను మాత్రమే ఆశించకుండా, ఒక పటిష్టమైన వారసత్వాన్ని నిర్మించడంపై దృష్టి పెట్టారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ మరియు టెట్లీ టీ వంటి అంతర్జాతీయ బ్రాండ్లను కొనుగోలు చేయడం వంటివి జరిగింది. దాంతో టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా స్థిర పరచడంలో అందరి దృష్టినీ ఆకర్షించింది.
అప్పుడు ఆయన లాంగ్ టర్మ్ విజన్ అనేది తెలిసింది. Ratan Tata గారిని చూసి మనం కూడా వెంటనే వచ్చే లాభాలపై కాకుండా, దీర్ఘకాలంలో స్థిరంగా నిలబడే వ్యాపారాన్ని నిర్మించాలి. లాంగ్ టర్మ్ లో మన వ్యాపారాన్ని ఎలా మలచుకోవాలో ప్రణాళిక వేసుకోండి.
Take Calculated Risks:
నష్టాల్లో ఉన్న అంతర్జాతీయ బ్రాండ్ లను Tata Group కొనుగోలు చేయడం వల్ల, రతన్ టాటా తీసుకున్న నిర్ణయం తప్పని అందరూ భావించారు. కానీ నేడు ఆ బ్రాండ్స్ చాలా వృద్ధి చెంది ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించాయి. అందుకే ఆయన భవిష్యత్ వ్యూహం వల్ల లాభదాయకమైన వ్యాపారంగా ఎదిగింది.
ఉదాహరణకు 2008 సంవత్సరం ఆర్థిక సంక్షోభం సమయంలో కొనుగోలు చేసిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ ఎంతో లాభాలను తెచ్చి, మంచి బ్రాండ్ గా నిలిచింది. భవిష్యత్ లో రాబోయే సమస్యలను ముందుగానే పసిగట్టి, ధైర్యంగా ముందుకు సాగండి. మరీ ఎక్కువ రిస్క్ తీసుకుంటే నష్టాల్లో మునిగిపోతారు. కాబట్టి మీరు లెక్కకు తగ్గట్టుగా రిస్క్ తీసుకోండి.
Commitment to Innovation:
ఈ పోటీ ప్రపంచంలో మన వ్యాపారం వృద్ధి చెందాలంటే కస్టమర్ అవసరానికి తగ్గట్టుగా ఉండాలని Ratan Tata గారు నమ్ముతారు. Tata Nano Project అనేది అంత పెద్ద సక్సెస్ ఇవ్వనప్పటికీ, సామాన్య ప్రజల కోసం సులభమైన రవాణా సాధనాన్ని అందించాలనే తన సంకల్పం గొప్పది.
ఇలాంటి విధానం మార్కెట్ పై రతన్ టాటా గారికి ఉన్న లోతైన అవగాహనను ప్రదర్శిస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కస్టమర్ యొక్క అవసరాలను తీర్చడానికి వినూత్నమైన పద్దతిని రూపొందించాలి. అలాగే మీ వ్యాపారంలో క్రియేటివ్ స్కిల్స్ పెంచుకొని వాటిని అమలు చేయడానికి ప్రయత్నించండి.
Integrity and Ethical Leadership:
నీతి, నిజాయితీగా వ్యాపారం చేయడంలో Ratan Tata గారు ఎప్పటికీ కట్టుబడి ఉంటారు. ఎలాంటి ఛాలెంజింగ్ పరిస్థితుల్లో నైనా రతన్ టాటా గారు న్యాయంగా, నిజాయితీగా మరియు స్పష్టంగా ఉంటారు.
లాభాలు పొందడం కంటే నైతిక విలువలు కలిగి ఉండటం ముఖ్యం. వ్యాపారంలో నమ్మకం మరియు కీర్తి అనేవి అమూల్యమైన ఆస్తులు. ఒకరిపై ఒకరికి విశ్వాసం మరియు మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉండే సంస్కృతిని నిర్మించాలి. ఇది మన భాద్యతలా తీసుకోవాలి.
Empathy and Humility:
రతన్ టాటా గారు వ్యాపారంలో ఎంతో గొప్ప లీడర్ అయినప్పటికీ, అందరితోనూ వినయంగా ఒక సాధారణ మనిషి మాదిరి ఉంటాడు. ఉద్యోగుల సమస్యలను తన సమస్యలుగా భావించి, అందరితో మమేకమై వాటిని పరిష్కరిస్తాడు. ఈ వ్యక్తిత్వమే Ratan Tata గారికి ఎంతో అపారమైన గౌరవాన్ని సంపాదించి పెట్టింది. ఉదాహరణకు 2008 సంవత్సరంలో ముంబై లోని తాజ్ హోటల్ పై జరిగిన టెర్రర్ అటాక్ లో, రతన్ టాటా గారు చేసిన మంచి అంతా ఇంతా కాదు.
ఈ అటాక్ లో 11 మంది హోటల్ యాజమాన్యంతో పాటు, మిగతా 66 మంది చనిపోయారు. అయినప్పటికీ అక్కడ Terror Attack జరిగిన వెంటనే Ratan Tata గారు క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేశారు. చనిపోయిన వ్యక్తుల వాళ్ళ కుటుంబాలను టాటా గారు జీతం ఇచ్చి మరీ పోషిస్తున్నాడు.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కస్టమర్స్, ఉద్యోగులు మరియు వాటాదారుల పట్ల నిజమైన శ్రద్ధ వహించండి. వాళ్ళతో వినయంగా ఉండటం వల్ల బలమైన సంబంధాలను ఏర్పరుస్తుంది.
Building a Legacy Through Philanthropy:
రతన్ టాటా గారు ఎల్లప్పుడూ సమాజానికి తిరిగి అవ్వాలనే ఆలోచనతోనే ఉంటారు. అందుకే Tata Group కంపెనీలలో వచ్చే లాభాల్లో 65% పైగా చారిటబుల్ ట్రస్ట్ కి వెళతాయి. అలాగే Education, HealthCare, Rural Development కి సంబంధించిన కార్యక్రమాలకు కూడా వెళతాయి. మీ సక్సెస్ తో సమాజంలో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. మీ వ్యాపార లక్ష్యాలను సామాజిక బాధ్యతతో కలుపుకొని పోవడం వల్ల శాశ్వతమైన వారసత్వాన్ని క్రియేట్ చేసిన వారవుతారు.
Face the Challenges:
రతన్ టాటా గారు తన కెరీర్ లో Tata Nano వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టినప్పుడు, ఎన్నో విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. అయినా కూడా తన కలల్ని నిజం చేసుకునే పట్టుదల మాత్రం విడువలేదు. కాబట్టి మనకు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో ముందుకెళ్లండి. మీరు ఎదుర్కొనే సవాళ్ళను అవకాశాలుగా మలచుకొని ముందుకెళ్లండి. ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొనే సమయంలో మీరు చాలా నేర్చుకుంటారు.
మొదట్లో వ్యాపారం చేయడానికి కూడా పనికి రాడని అన్నారు. కానీ నేడు Ratan Tata Net Worth in Rupees 33 లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యంగా మార్చాడు. రతన్ టాటా గారి నాయకత్వ లక్షణం, దూరదృష్టితో కూడిన ఆలోచన, నీతి నిజాయితీతో, సామాజిక సంక్షేమానికి కావాల్సిన అద్భుతమైన ఫలాలను అందించే వ్యక్తి. ఇంకా చెప్పాలంటే మంచితనంలో ఆయనను మించిన వ్యక్తి లేడు. యువ పారిశ్రామికవేత్తలకు ఆయన జీవిత ప్రయాణం ఒక మాస్టర్ క్లాస్ గా ఉపయోగపడుతుంది. Ratan Tata Leadership Qualities ఎంతో గొప్పగా ఉంటాయి కాబట్టే నేడు ఆయనను దేవుడిలా తలుస్తారు.
ఎందుకంటే మీ వ్యాపారం విజయం పొందడమే కాకుండా, అర్థవంతంగా ఉంటుంది. ఈ విషయాలను మీరు పాటించడం వల్ల కొత్త కొత్త వ్యాపార ఆలోచనలతో, కస్టమర్స్ కి నమ్మకం కలిగి, ప్రపంచానికి మన వంతు సహాయం చేయవచ్చు. అందుకే Business స్టార్ట్ చేసే ముందు మెళకువలు తెలుసుకోవాలి. ఇలాంటివి చేయడం వల్ల పారిశ్రామికవేత్తలు దశాబ్దాల తరబడి గుర్తుండిపోయే సంస్థలను నిర్మించవచ్చు.
follow us on Facebook
Leave a Reply