కొత్తగా వ్యాపారం ప్రారంభించేటప్పుడు మీ వద్ద తగినంత మూలధనం లేకపోతే మొదట్లో ఆర్థికంగా రిస్క్ అనిపించవచ్చు. కానీ ఇప్పుడు నేనొక మంచి శుభవార్తను మీ ముందుకు తీసుకొచ్చా. అదేంటంటే ప్రారంభంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి లేకుండా విజయవంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడం పూర్తిగా సాధ్యమే. పరిమిత నిధులతో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన, కొన్ని ముఖ్యమైన దశలను మీరు తెలుసుకోబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మరి. అవేంటో మీరు కూడా తెలుసుకొని ఆచరణలో పెట్టండి.
1. Start with a Low-Cost Business Idea :
ప్రతి వ్యాపారానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి తక్కువ ఖర్చుతో కూడిన వ్యాపారాన్ని ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రానీయకుండా వ్యాపారాన్ని విజయవంతం చేయవచ్చు. ఇప్పుడు మీకు తక్కువ పెట్టుబడితో కూడుకున్న కొన్ని బిజినెస్ ఐడియాస్ ఇవ్వడం జరిగింది. వీటిలో ఏదైనా ఐడియా నచ్చితే మీరు కూడా ఉపయోగించుకోండి.
Service-Based Businesses : గ్రాఫిక్ డిజైనింగ్, కన్సల్టింగ్, ఫ్రీలాన్సింగ్ లేదా సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ వంటి స్కిల్స్ ప్రారంభంలో పెట్టుబడి తక్కువ. కాబట్టి వీటిలో ఎదో ఒక స్కిల్ మీకు ఉండి, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించుకొని మంచి లాభదాయకమైన వ్యాపారంగా మార్చుకోవచ్చు.
Drop shipping : ఇక్కడ మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కేవలం మధ్యవర్తిగా మాత్రమే ఉంటారు. కస్టమర్ ఎప్పుడైతే ప్రొడక్ట్ ఆర్డర్ చేస్తాడో అప్పుడే మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. డైరెక్ట్ గా ప్రొడక్ట్ అనేది సెల్లర్ నుంచి కస్టమర్ కి వెళ్తుంది. ఇక్కడ మన పని ఏంటంటే ఒక ఆన్లైన్ స్టోర్ ని క్రియేట్ చేస్కొని, సరైన ప్రొడక్ట్ ని సరైన కస్టమర్ కి చూపించడం. ఇది పూర్తిగా ఆన్లైన్ లో జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. అలాగే లాభాలు కూడా పొందుతున్నారు.
Online Courses or Digital Products : ఏ రంగంలోనైనా మీకు మంచి పరిజ్ఞానం ఉన్నట్టయితే కోర్సులు, ఈ-బుక్స్ లేదా టెంప్లేట్స్‌ను క్రియేట్ చేయండి. ఒకసారి క్రియేట్ చేసిన డిజిటల్ ప్రొడక్ట్స్ ని ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా ఎన్నిసార్లైనా అమ్మవచ్చు.
Affiliate Marketing and Blogging : కంటెంట్ సృష్టించడంలో మీకు నైపుణ్యం ఉన్నట్టయితే, బ్లాగ్ లేదా సోషల్ మీడియా పేజీ ప్రారంభించండి. దాని ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ చేసి మంచి ఆదాయం పొందవచ్చు. ఇది మీరు ఫ్రీగానే ప్రారంభించవచ్చు. ఉదాహరణకు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్లాట్ ఫారంలలో ఫ్రీగానే మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఆపై ప్రొడక్ట్స్ యొక్క అఫిలియేట్ లింక్స్ షేర్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు.
2. Use Free or Low-Cost Tools :
మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు మేనేజ్ చేయడానికి అనేకమైన ఉచిత టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని:
Website Creation : WordPress లేదా Wix వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి తక్కువ అమౌంట్ తో చాలా సులభంగా వెబ్‌సైట్‌ను సృష్టించుకోవచ్చు. దీంట్లో ఎలాంటి కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. అన్నీ డ్రాగ్ అండ్ డ్రాప్ రోపంలో ఉంటాయి.
Software Design : Canva మరియు ఇతర ఫ్రీ డిజైన్ టూల్స్ వాడుకొని, గ్రాఫిక్స్ ను చాలా సులభంగా క్రియేట్ చేయవచ్చు. ఎలాంటి అనుభవం కలిగిన డిజైనర్‌ను నియమించకుండా ప్రొఫెషనల్-లుక్ లో గ్రాఫిక్స్‌ను సృష్టించవచ్చు.
Marketing Tools : Mailchimp, Buffer వంటి ఇమెయిల్ మార్కెటింగ్ ఫ్రీ టూల్స్ ఉపయోగించుకుని మీ వ్యాపారాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాల ఫ్రీ టూల్స్ మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిని మీ వ్యాపారానికి తగ్గట్టు ఎలా వాడాలో తెలిస్తే చాలు.
Project Management : Trello, Asana మరియు Google Workspace వంటి టూల్స్ మీ వ్యాపారాన్ని ఒక క్రమంగా మరియు సమర్థవంతంగా మేనేజ్ చేయడానికి సహాయపడతాయి.
ఈ రకమైన ఫ్రీ టూల్స్ తో మీరు మీ వ్యాపారాన్ని ఆన్లైన్ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లవచ్చు. అలాగే మీ బ్రాండ్ విలువను పెంచుకోవచ్చు.
3. Test Your Idea Before Fully Launching : ఏమీ తెలీకుండానే డబ్బుని పెట్టుబడి పెట్టడం కంటే ముందు మీ ఐడియా ని ఒకసారి పరీక్షించుకోండి. అదెలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Run a pre-sale campaign : ప్రారంభంలో మీ ప్రొడక్ట్ లేదా సర్వీస్ అందరికీ తెలియాలంటే చాలా కష్టం. కాబట్టి కస్టమర్స్ కి ఆసక్తి పెంపొందించడానికి, మీ ప్రొడక్ట్ పై మంచి మంచి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ ప్రకటించండి. అప్పుడు అందరికీ మీ ప్రొడక్ట్ ఏంటో తెలుస్తుంది. దాంతో మీ ప్రొడక్ట్ లో ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా అనేది మీకు అర్థం అవుతుంది. అలాగే మొదట్లో మీ వ్యాపారానికి కొంత మూలధనం చేకూరుతుంది.
Create a Minimum Viable Product (MVP) : ఉన్న డబ్బంతా ఖర్చుపెట్టి ఎదో ఒక ప్రొడక్ట్ ని తయారుచేస్తే, అది కస్టమర్స్ కి నచ్చకపోతే మీకు చాలా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మొదట్లో మీ ప్రొడక్ట్ లేదా సర్వీస్ ని ఉన్న మూలధనం తో ప్రారంభించండి. ఆ తర్వాత ప్రొడక్ట్ లో లోపాలను సరిచేసి మళ్లీ మార్కెట్ లోకి వదలండి. అప్పుడు మీ ప్రొడక్ట్ అందరికీ నచ్చే అవకాశం ఉంటుంది.
Use Social Media : Instagram, Twitter మరియు LinkedIn, Youtube వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి, ఫ్రీగా మీ కస్టమర్లతో ఇంటరాక్ట్ అవ్వండి. మీ ప్రొడక్ట్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో సలహా తీసుకోండి. అప్పుడు మీ కంపెనీకి మరియు కస్టమర్స్ కి చాలా మంచి సంబంధాలు ఏర్పడతాయి. దాంతో వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
4. Build a Network and Tap into Free Resources : కొత్త వ్యాపారానికి శక్తివంతమైనది బలమైన నెట్‌వర్క్ కలిగి ఉండటం. కాబట్టి అలాంటి నెట్వర్క్ ని ఎలా పెంపొందించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Join Online Communities : LinkedIn, Reddit వంటి వేదికలలో దాదాపు ప్రతి పరిశ్రమకు సంబంధించిన గ్రూపులు ఉన్నాయి. మీ బిజినెస్ కు సంబందించిన కమ్యూనిటీలలో చేరడం ద్వారా, మీ యొక్క కస్టమర్స్, మెంటర్స్ మరియు ఇన్వెస్టర్లను కలుసుకోవచ్చు.
Use Free Educational Resources : Coursera, Udemy మరియు YouTube వంటి వెబ్ సైట్ లలో చాలా రకాల కోర్సులను మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఇంకా క్వాలిటీ కోర్సులు కావాలంటే సరసమైన ధరలలో దొరుకుతాయి.
Finds Mentors : అనేక విజయవంతమైన వ్యాపార యజమానులు కొత్తవారికి స్కిల్స్ నేర్పించడానికి సిద్ధంగా ఉంటారు. LinkedIn వంటి ఆన్లైన్ వెబ్సైట్ లలో బిజినెస్ ప్రొఫెషనల్స్ ని కలుసుకోవచ్చు. లేదా స్థానికంగా జరిగే నెట్‌వర్కింగ్ ఈవెంట్లకు హాజరుకండి. మెంటర్ ఉండటం వల్ల మీ తప్పిదాలను నివారించి విలువైన సూచనలను ఇవ్వడానికి సహాయపడతాడు.
5. Market Your Business For Free : మార్కెటింగ్ అనేది ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి చేయాల్సిన అవసరం లేదు. అతి తక్కువ ఖర్చుతో కూడా చేసుకోవచ్చు. నేటి డిజిటల్ యుగంలో కొన్ని మార్గాల్లో వెళ్తే ఫ్రీగా కూడా చేసుకోవచ్చు. ఆ మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Social Media Marketing : Facebook, Instagram మరియు LinkedIn వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి ప్రేక్షకులకు దగ్గర అవ్వండి. మీ వ్యాపారానికి సంబంధించిన విలువైన కంటెంట్‌ను వాళ్ళతో పంచుకొని ఫాలోవర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వండి. ఎక్కువ ఫాలోయర్స్ ఉంటే మీ వ్యాపారాన్ని ఫ్రీగా మార్కెటింగ్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది.
Content Marketing : బ్లాగ్, పోడ్కాస్ట్ లేదా యూట్యూబ్ ఛానల్‌ను సృష్టించి, మీ ప్రేక్షకులకు అవసరమైన విలువైన కంటెంట్‌ను అందించండి. అప్పుడు వాళ్ళే మీపై నమ్మకాన్ని ఏర్పరచుకొని, మీకు ఫ్రీగా మార్కెటింగ్ చేస్తారు.
Collaborate with Other Small Businesses : ఇతర వ్యాపారాలతో భాగస్వామ్యం అవ్వడం వలన మన వ్యాపారం మరింత వృద్ధి చెందే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు మీరు గ్రాఫిక్ డిజైనర్ అయితే కాపీరైటర్ తో భాగస్వామ్యం ఏర్పరచుకొని డీల్ కుదుర్చుకోవచ్చు. దాంతో మీ సర్వీసెస్ ని వేరేవాళ్లకు అందించి మరింత లాభం పొందవచ్చు.
Enhance Your Product or Service : మీరు అందించే ప్రొడక్ట్ క్వాలిటీగా లేకపోతే ఆ క్వాలిటీ పెంచడానికి డబ్బుని పెట్టుబడి పెట్టండి. ప్రొడక్ట్ క్వాలిటీ పెరిగితే లాభాలు కూడా పెరుగుతాయి.
6. Reinvest Earnings to Scale Gradually : ఒక్కసారి మీ వ్యాపారంలో డబ్బు రావడం మొదలుపెడితే వచ్చిన డబ్బుని విచ్చల విడిగా ఖర్చుపెట్టవద్దు. దానికి బదులుగా మీ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని తిరిగి అక్కడే పెట్టుబడి పెట్టండి. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి.
Invest in Marketing : మీ ఆదాయంలోని కొంత భాగాన్ని పెయిడ్ ప్రకటనలు లేదా ప్రీమియం టూల్స్ పై కేటాయించండి. అది మీ వ్యాపార పరిధిని మరియు సామర్థ్యాన్ని అమాంతంగా పెంచుతుంది.
Upgrade Tools and Technology : వ్యాపారం పెరిగేకొద్దీ మెరుగైన టూల్స్ పై పెట్టుబడులు పెట్టడం వల్ల కార్యకలాపాలను క్రమబద్ధీకరించి, కంపెనీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
తక్కువ మూలధనంతో వ్యాపారాన్ని ప్రారంభించడం ఎలాగో మీకు ఇప్పుడు తెలిసింది కదా. అలాగే ఫ్రీగా కూడా ప్రారంభించవచ్చు. అదెలా అంటే పైన చెప్పిన ప్రతి ఒక్క వాక్యాన్ని చదవడమే కాకుండా దానిని ఆచరణలో పెట్టడం వల్ల ఇది సాధ్యం అవుతుంది. అందులో ఉన్న మెళకువలు ఏంటో తెలుసుకోవాలి. పైన చెప్పిన వాటిలో ముఖ్యంగా తక్కువ-ధర వ్యాపార నమూనాను ఎంచుకోవడం, ఫ్రీ టూల్స్ ను ఉపయోగించుకోవడం, మీ ఐడియా ను నిర్దారించుకోవడం, నెట్‌వర్క్‌ను నిర్మించుకోవడం మరియు తెలివిగా తిరిగి పెట్టుబడి పెట్టడం ద్వారా మీ వ్యాపార పునాదులను ధృడంగా నిర్మించుకోవచ్చు. ఇప్పుడున్న ప్రతి పెద్ద కంపెనీ యొక్క వ్యాపారం ఒకానొక సమయంలో చిన్నగానే మొదలైంది. అందుకే వ్యాపారాన్ని ప్రారంభించి ముందుకు తీసుకెళ్లాలన్న పట్టుదల మరియు క్రియేటివిటీ, మెళకువలు తెలుసుకోవాలి.
About InsideBusiness.in