Kumar Mangalam Birla’s Business Lessons for Entrepreneurs

Kumar Mangalam Birla గారు, ఆదిత్య బిర్లా గ్రూపు కంపెనీ ఛైర్మన్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి వ్యాపారవేత్తల్లో ఇతనొకరు. అలాగే అత్యంత ప్రభావితమైన లీడర్ కూడా. ఆయనకున్న నాయకత్వ లక్షణం, అందరికంటే విభిన్నంగా ఆలోచించే తెలివి, ఎలాంటి ఛాలెంజ్ నైనా ఎదుర్కొనే సామర్థ్యం వల్ల, కొత్త వ్యాపారవేత్తలకు ఎన్నో పాఠాలను అందిస్తుంది. ఆయన తెలివితో Aditya Birla Group కంపెనీ మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో కూడా కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయితే ఆయన అద్భుతమైన ప్రయాణంలోని కొన్ని ముఖ్యమైన వ్యాపార పాఠాలను మనం నేర్చుకుందాం. వాటిని మన జీవితంలో కూడా అమలు చేయడానికి ప్రయత్నిద్దాం.

Kumar Mangalam Birla Biography:

Kumar Mangalam Birla, 1967 జూన్ 14 న రాజస్థాన్ రాష్ట్రంలోని మార్వాడీలు అయినటువంటి బిర్లా కుటుంబంలో జన్మించాడు. తండ్రి Aditya Vikram Birla మరియు తల్లి Rajashree Birla. ఈయన University of Mumbai లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత London Business School లో CA పూర్తి చేయడం జరిగింది. కుమార్ మంగళం బిర్లా తన తండ్రి ఆదిత్య విక్రమ్ బిర్లా చనిపోవడం వల్ల 28 వ ఏట కంపెనీ బాధ్యతలు చేపట్టడం జరిగింది.

Kumar Mangalam Birla Net Worth in Rupees : అప్పటి తన కంపెనీ టర్నోవర్ 2 బిలియన్ డాలర్స్ ఉండేది. ఇప్పుడైతే ఈ కంపెనీ టర్నోవర్ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంది. Aditya Birla Group లో లిస్ట్ అయిన ముఖ్యమైన కంపెనీస్ ఏంటంటే, UltraTech Cement, Hindalco, Novelis, Grasim, Aditya Birla Capital, Aditya Birla Fashion and Retail, Vodafone Idea ఉన్నాయి. ఈ Aditya Birla Company ఇంత గొప్ప స్థాయికి వెళ్ళడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Innovation:

మన Business అనేది అందరికంటే ముందుగా ఉండాలంటే కొత్త ఆలోచనలను అమలు చేయాలని, Kumar Mangalam Birla గారు ఎప్పుడూ చెప్తూనే వుంటారు. 1995 వ సంవత్సరంలో కుమార్ మంగళం బిర్లా గారు Aditya Birla Group కి చైర్మన్ గా బాధ్యత తీసుకున్నారు. అప్పుడు ఆయన ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీని ఆధునికీకరించడానికి మరియు ఇతర సెక్టార్లలో విస్తరించడానికి, ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నాడు. తన కంపెనీతో ఎలాంటి సంబంధాలు లేని రంగాలలో Aditya Birla Group ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఎలాంటి వెనుకంజా వేయలేదు. ఉదాహరణకు టెలికాం, సిమెంట్ మరియు ఫైనాన్సియల్ సర్వీసెస్ సెక్టార్లలో అడుగుపెట్టి తన కంపెనీ ప్రాముఖ్యతను పెంచారు. అందుకే ఇప్పుడు ఈ కంపెనీ ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళింది. Innovation అనేది కేవలం కొత్త ప్రొడక్ట్స్ ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు, కొత్త బిజినెస్ మోడల్ ని రూపొందించడం లేదా కొత్త సెక్టార్లలోకి ప్రవేశించడం కూడా. వ్యాపారవేత్తలు లాభం కోసం మాత్రమే కాకుండా లాంగ్-టర్మ్ వృద్ధి కోసం కొత్త కొత్త ప్రాంతాల్లో అడుగుపెట్టి మన బిజినెస్ ని విస్తరింపజేయాలి. అలాగే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగల్గాలి.

Focus on Long Term Vision:

షార్ట్ టర్మ్ లాభాలు కాకుండా లాంగ్ టర్మ్ లాభాలపై దృష్టిపెట్టాలని Kumar Mangalam Birla నమ్ముతారు. ఆయన ఆధీనంలో ఈ Aditya Birla Group కీలకమైన పెట్టుబడులు పెట్టింది. అలాగే అధిక కొనుగోళ్లు చేసి భవిష్యత్ ప్రణాళికను ముందుగానే వేసుకుంది. ఉదాహరణకు భారతదేశ టెలికమ్యూనికేషన్ రంగానికి చెందిన కంపెనీ Idea Cellular లో మెజారిటీ వాటా వీళ్లదే. భారదేశం భవిష్యత్ లో టెలీకమ్యూనికేషన్ రంగంలో చాలా వృద్ధి చెందుతుందని ముందుగానే పసిగట్టారు. Business పెట్టిన వెంటనే లాభాలు రావాలంటే కష్టం. విజయవంతమైన వ్యాపారవేత్తలు దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని, లాంగ్ టర్మ్ లో మంచి లాభాలు వస్తాయని ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడే లాభాలు వస్తాయని చేయరు. తక్షణ లాభాలపై కాకుండా సహనంతో మీ భవిష్యత్ లక్ష్యం పై దృష్టి పెట్టండి.

Adaptability to Market Changes:

కుమార్ మంగలమ్ బిర్లా నుండి మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం అనుకూలంగా మార్చుకునే శక్తి. వ్యాపార ప్రపంచం అనేది నిరంతరం మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పోటీ సమాజంలో కొత్త కొత్త ట్రెండ్స్ మరియు కొత్త కొత్త ఛాలెంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి. Aditya Birla Group ని టెలికామ్, రిటైల్ రంగాలలో మార్కెట్ లో వచ్చే మార్పులకు తట్టుకుని నిలబడే శక్తి కేవలం Kumar Mangalam Birla గారికి మాత్రమే ఉంది. కాబట్టి ఆదిత్య బిర్లా గ్రూప్ విజయం వెనుక కుమార్ మంగళం బిర్లా గారి హస్తం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన భవిష్యత్ వ్యూహం అలాంటిది. ఇక్కడ కొత్తగా వచ్చే వ్యాపారవేత్తలకు తెలియాల్సింది ఏంటంటే బిజినెస్ లో వచ్చే మార్పులు తట్టుకోని నిలబడాలి. అలాగే టెక్నాలజీ పరంగా, ఇప్పుడున్న పోటీ మరియు ఆర్థికంగా ఏర్పడే ఆటుపోట్లను స్వీకరించి తమ తమ స్ట్రాటజీ ని అమలుచేయాలి.

Build a Strong Corporate Culture:

కంపెనీ విజయం కోసం మంచి వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యం. Kumar Mangalam Birla గారిని చూస్తే గౌరవం, మంచిగా పనిచేసుకునే కంపెనీ వాతావరణం మరియు ప్రతి ఒక్కరి అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుంది. ఇలా కంపెనీ ఎదుగుదలతో పాటు ఎంప్లాయిస్ ని మంచిగా చూసుకుంటే, వారే ఆ కంపెనీని నీతి, నిజాయితీతో ముందుకు తీసుకెళ్తారు. ఇలాంటి వాతావరణం సృష్టించగలిగితే ఎలాంటి సమస్యనైనా సులభంగా ఎదుర్కోగలుగుతారు. కంపనీ కూడా వెనుకంజ వేయాల్సిన అవసరం ఉండదు. పైన చెప్పినట్టు బిజినెస్ అంటే కేవలం లాభాలు మాత్రమే కాకుండా అందులో పనిచేసే సిబ్బందిని కూడా గౌరవించి, వాళ్ళను మంచిగా ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఇలాంటి వాతావరణం ఉంటే ఏ బిజినెస్ అయినా మంచిగా వృద్ధి చెందుతుంది. ఒక్కసారి బిజినెస్ విలువైనదిగా ఉద్యోగులు భావిస్తే, వారే తమ పూర్తి శక్తిని ఉపయోగించి కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్తారు.

Social Responsibility:

Kumar Mangalam Birla గారు బిజినెస్ లో వచ్చే లాభాలపై మాత్రమే దృష్టిపెట్టలేదు. సమాజానికి ఎలా తిరిగి ఇవ్వాలని కూడా ఆలోచించాడు. Corporate Social Responsibility(CSR) అనే అంకితభావంతో Aditya Birla Group కంపెనీ తరచుగా Education, Rural development and healthcare రంగాలలో చాలా పెట్టుబడులు పెట్టింది. వ్యాపారంలో లాభాలు పొందడమే కాకుండా సమాజంపై కూడా ప్రభావం చూపించాలనేది ఆయన అభిప్రాయం. ప్రతి ఒక్క బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా సామాజిక బాధ్యత అనేది ఉండాలి. వ్యాపారవేత్తలు తమ తమ వ్యాపారాల్లో CSR అమలుచేస్తే వాళ్లకు మంచి చేకూరడమే కాకుండా, కంపెనీకి మంచి పేరు వస్తుంది. దాంతో ఆ కంపెనీ ఇంకా ఎత్తుకు చేరుకుంటుంది.

Growth Through Diversification:

కుమార్ మంగళం బిర్లా యొక్క వ్యూహం ఏంటంటే తమ కంపెనీ ని అన్ని రంగాల్లో విస్తరిస్తే శక్తివంతమైన కంపెనీ గా అవతరిస్తుంది. కాబట్టి ఆయన ఆధీనంలో Aditya Birla Group అనేది రిటైల్, టెలికామ్ మరియు ఫైనాన్సియల్ సర్వీసెస్ వంటి రంగాలలో విస్తరించింది. తమ కంపెనీని ఇలా అన్ని రంగాలలో విస్తరించడం వల్ల ఆర్థిక సంక్షోభ సమయంలో స్థిరంగా ఉండుటకు సహాయపడింది. ఎందుకంటే, ఒక రంగంలో వచ్చే లాభాలు ఇంకొక రంగంలో ఏర్పడే నష్టాలను తగ్గించడానికి సహాయ పడుతుంది. కొత్త వ్యాపారవేత్తలకు Diversification అనేది శక్తివంతమైన స్ట్రాటజీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక రంగంలో నష్టం ఏర్పడితే ఇంకొక రంగంలో లాభం పొందొచ్చు. మీ ప్రొడక్ట్ అయినా లేక సర్వీస్ అయినా వివిధ ప్రదేశాలకు విస్తరింపజేయాలి. అప్పుడే కంపెనీ రిస్క్ అనేది తగ్గి ఎక్కువ వృద్ధిచెందే అవకాశం ఉంటుంది.

Overcoming Obstacles:

అందరిలాగే వ్యాపారవేత్తల మాదిరి Kumar Mangalam Birla గారు కూడా తన కెరీర్ లో చాలా సవాళ్ళను ఎదుర్కోవడం జరిగింది. అది ఆర్థిక సంక్షోభం కావచ్చు, మార్కెట్ పడిపోవడం కావచ్చు లేదా అంత పెద్దమొత్తంలో కంపెనీ మేనేజ్ కావచ్చు. ఇవి కాకుండా, ఆయన ఎలాంటి అడ్డంకులనైనా ఎదుర్కొని ముందుకు సాగేవారు. కష్టాన్ని అధిగమించగల సామర్థ్యమే అతని విజయానికి కీలకమైన అంశం. విజయానికి చేరే దారి కొన్ని సందర్భాల్లో మాత్రమే సులభంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు ఛాలెంజెస్ ఉండాలి, అలాగే ఎదురుదెబ్బలు తగలాలి. అప్పుడే దాన్ని ఎదుర్కొనే శక్తిని పొందుతాము. దాంతో ఇంకొకసారి అలాంటి దెబ్బలు తగలకుండా ముందే తగిన జాగ్రత్తలు ధైర్యంగా తీసుకుంటాం. ఎలాంటి సందర్భం ఏర్పడినా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగాలి.

Kumar Mangalam Birla, తన జీవిత ప్రయాణం ద్వారా వ్యాపారవేత్తలకు ఎన్నో ముఖ్యమైన పాఠాలను అందించారు. ఆయన చేసిన కొత్త కొత్త ఆవిష్కరణలు. భవిష్యత్ గురించి దూరదృష్టి. ఎలాంటి వాతావరణాన్నైనా అనుకూలంగా ఏర్పరచుకోవడం. Aditya Birla Group కంపెనీ Corporate Social Responsibility ని కలిగి ఉండటం. అలాగే విభిన్న రంగాలలో ప్రవేశించడం. ఇంకా ఛాలెంజీలను ఎదుర్కోవడం వంటివి వ్యాపారవేత్తలకు ఎంతగానే ఉపయోగపడతాయి. అందుకే Kumar Mangalam Birla Net Worth in Rupees 100 డాలర్లకు పైగా చేరుకుంది. అలా మీ వ్యాపారంలో విజయాన్ని పొందవచ్చు.

ఈ పాఠాలను అనుసరించి, వ్యాపారవేత్తలు తమ తమ వ్యాపారాలను పెంచుకోవడమే కాదు, కుమార్ మంగలమ్ బిర్లా వంటి ఒక వారసత్వాన్ని కూడా నిర్మించగలుగుతారు.

Join us on Telegram Group.

2 thoughts on “Kumar Mangalam Birla’s Business Lessons for Entrepreneurs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *