నేటి డిజిటల్ యుగంలో సైడ్ హసిల్స్ అనేవి ఆప్షన్ కాదు, ఇదొక అవసరం. ఎందుకంటే మీరు చేసే ఫుల్ టైం జాబ్ కి అదనంగా ఆదాయం సంపాదించే అవకాశం. మీరు విద్యార్థి అయినా, ఉద్యోగిగా ఉన్నా, లేక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకునే వారైనా సైడ్ హసిల్స్ ద్వారా అదనపు ఆదాయం సంపాదించవచ్చు. అప్పుడప్పుడు మీ ఫుల్ టైమ్ జాబ్ కంటే ఎక్కువగా ఆదాయం సంపాదించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు, దాంతో కొన్ని రోజుల్లోనే పూర్తి బిజినెస్‌గా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనం 10 Best Side Hustles in 2025 లో ట్రెండ్ అవుతూ, ఫ్యూచర్ లో చాలా వృద్ధి చెందే అవకాశం ఉన్న సైడ్ హసిల్స్ గురించి తెలుసుకుందాం.
Why Start a Side Hustle with ₹0?
ఒకప్పుడు చిన్న వ్యాపారం లేదా సైడ్ హసిల్ మొదలుపెట్టాలంటే డబ్బు ఖచ్చితంగా కావాలి. కానీ నేడు డిజిటల్ టూల్స్, AI, ఫ్రీలాన్సింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల చాలా ఈజీ అయిందని చెప్పుకోవచ్చు.
Benefits:
- ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు
- నేర్చుకుంటూ సంపాదించవచ్చు
- మీ ఫుల్ టీమ్ జాబ్ తో పాటు అదనపు ఆదాయం సంపాదించవచ్చు.
- మీకు నచ్చిన టైమ్ ఫ్లెక్సిబిలిటీలో వర్క్ చేయవచ్చు.
10 Best Side Hustles in 2025
1. Freelance Writing
మీకు రైటింగ్ స్కిల్ ఉన్నట్లయితే, కంపెనీస్ బ్లాగ్స్ రాస్తూ, యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ రాస్తూ ఎర్న్ చేయొచ్చు. ఎలా స్టార్ట్ చేయాలంటే Medium, Quora, LinkedIn ప్లాట్ఫారం లలో స్టోరీస్ రాయండి. మంచి మంచి కంటెంట్ పోస్ట్ చేసిన తర్వాత, ఆ వర్క్ ని మీ పోర్టుఫోలియో కింద చూపించుకోవచ్చు. ఆ తర్వాత Fiverr, Upwork, Internshala వంటి ప్లాట్ఫారంలో ప్రొఫైల్ క్రియేట్ చేయండి. అందులో మీ పోర్టుఫోలియో చూయించండి. అందులో చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. వాటికి అప్లై చేసి ప్రాజెక్ట్స్ తెచ్చుకోండి. ChatGPT వంటి AI టూల్ సహాయంతో అతి తక్కువ సమయంలో కంటెంట్ సిద్ధం చేసుకోండి. ఇక ఫ్రీలాన్స్ రైటర్ కి వచ్చే ఆదాయం ₹5,000 – ₹50,000/నెలకు ఉంటుంది.
2. Social Media Management
ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి ప్లాట్‌ఫారమ్‌లు మేనేజ్ చేయడం చిన్న చిన్న బిజినెస్‌లకు చాలా అవసరం. ఎలా మొదలుపెట్టాలంటే మొదట్లో 2-3 బిజినెస్‌లకు ఫ్రీగా సర్వీస్ చేసి పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేయండి. Canva, Buffer వంటి టూల్స్ ఉపయోగించి డిజైన్ చేయండి. LinkedIn, WhatsApp గ్రూప్స్‌లో మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోండి. సోషల్ మీడియా మేనేజ్మెంట్ కి వచ్చే ఆదాయం ₹10,000 – ₹60,000/నెలకు ఉంటుంది.
3. Affiliate Marketing
ఇతరుల ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి ప్రతి అమ్మకంపై కమిషన్ పొందవచ్చు. దీనికి ఎలాంటి స్టోర్ అవసరం లేదు. ఎలా మొదలుపెట్టాలంటే Amazon, Flipkart లేదా niche బ్రాండ్స్‌కి జాయిన్ అవ్వండి. ఆపై Medium, Blogger లేదా Instagram ద్వారా లింక్ షేర్ చేయండి. ఆ లింక్ ద్వారా ఎవరైనా ప్రొడక్ట్ తీసుకుంటే మీకు కమీషన్ వస్తుంది. అఫిలియేట్ మార్కెటర్ కి వచ్చే ఆదాయం ₹1,000 – ₹50,000+/నెలకు ఉంటుంది.
4. Content Creation
యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం స్పష్టమైన విషయాలపై షార్ట్ వీడియోలు తయారు చేయండి. ఫైనాన్స్, కెరీర్, మోటివేషన్, బిజినెస్ ఐడియాస్ వంటి టాపిక్స్ చాలా బాగుంటాయి. ఎలా మొదలుపెట్టాలంటే, మీ ఫోన్‌తో వీడియోలు తీసి CapCutతో ఎడిట్ చేయండి. ఒక టాపిక్ పై ఫోకస్ చేయండి. YouTube, Sponsorships ద్వారా మానిటైజ్ చేయండి. కంటెంట్ క్రియేటర్స్ కి వచ్చే ఆదాయం మొదట్లో తక్కువగానే ఉంటుంది. కానీ గ్రో అయితే ₹1 లక్ష+ పైగానే వచ్చే అవకాశం ఉంటుంది.
5. Online Tutoring or Coaching
మీరు ఏదైనా సబ్జెక్ట్ లో expert అయితే, ఆ స్కిల్ ఇతరులకు నేర్పిస్తూ ఆదాయం పొందవచ్చు. ఎలా మొదలుపెట్టాలంటే Vedantu, UrbanPro, Chegg వంటి సైట్లలో రిజిస్టర్ అవ్వండి. సబ్జెక్ట్ నేర్పించడానికి Google Meet లేదా Zoom వాడండి. ఇంకా Telegram లేదా WhatsApp గ్రూప్‌ల్లో క్లాస్‌లు ఇవ్వండి. వీరికి వచ్చే ఆదాయం ₹500 – ₹1,000/ఘంటకు ఉంటుంది.
6. Resume Writing / LinkedIn Services
కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టూడెంట్స్ జాబ్ సెర్చ్ చేస్తుంటారు. వారికి ప్రొఫెషనల్ రెజ్యూమ్‌లు, లింక్‌డ్‌ఇన్ ప్రొఫైల్స్ అవసరం. కాబట్టి వారికి ప్రొఫెషనల్ రెజ్యుమ్ తయారుచేసిస్తే మంచి ఆదాయం పొందవచ్చు. ఎలా మొదలుపెట్టాలంటే Canva, Google Docs తో డిజైనింగ్, పర్ఫెక్ట్ రెజ్యూమ్ తయారుచేయండి. LinkedIn & Telegram గ్రూప్స్‌లో సర్వీసెస్ ప్రమోట్ చేయండి. వీరికి వచ్చే ఆదాయం ₹500 – ₹2,000/ఒక్క రెజ్యూమ్‌కు ఉంటుంది.
7. Virtual Assistant (VA) Services
ఇమెయిల్‌లు, షెడ్యూల్స్, డేటా ఎంట్రీ వంటి పనుల్లో ఇతరులకు సహాయం చేయడం. ఎలా మొదలుపెట్టాలంటే LinkedIn, Upworkలో ప్రొఫైల్ క్రియేట్ చేయండి. అక్కడ నుంచి ప్రాజెక్ట్స్ తెచుకోవచ్చు. వీటికి తోడు Trello, Google Workspace వంటి టూల్స్ నేర్చుకోండి. చాలా ఉపయోగపడతాయి. వీరికి వచ్చే ఆదాయం ₹8,000 – ₹50,000/నెలకు ఉంటుంది.
8. Print-on-Demand Dropshipping
మీరు డిజైన్ చేయడంలో expert అయితే, మీ డిజైన్లతో టీషర్ట్లు, మగ్స్ వంటి ప్రోడక్ట్స్ అమ్మండి. ఇక్కడ ఎలాంటి స్టాక్ అవసరం లేదు. ఎలా మొదలుపెట్టాలంటే Printrove, Blinkstore వంటి ప్లాట్‌ఫారమ్‌లలో అకౌంట్ ఓపెన్ చేయండి. Canva టూల్ తో డిజైన్లు క్రియేట్ చేయండి. Instagramలో మీ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయండి. వీరికి వచ్చే ఆదాయం ₹1,000 – ₹30,000/నెలకు ఉంటుంది.
9. Voice-Over or Podcast Editing
మీ యొక్క వాయిస్ స్పష్టంగా ఉంటే, వీడియోలు లేదా పోడ్కాస్ట్‌లకు వాయిస్ ఓవర్ ఇచ్చి మనీ ఎర్న్ చేయొచ్చు. ఎలా మొదలుపెట్టాలంటే Audacity సాఫ్ట్వేర్ తో రికార్డ్ చేసి డెమో షేర్ చేయండి. Freelancing సైట్లలో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి ప్రాజెక్ట్స్ పొందండి. వీరికి అందే ఆదాయం ₹500 – ₹5,000/ప్రాజెక్ట్ ఉంటుంది.
10. Online Surveys & User Testing
చిన్న చిన్న సర్వేలు చేయడం ద్వారా రెగ్యులర్ ఆదాయం పొందవచ్చు.ఎలా మొదలుపెట్టాలంటే Swagbucks, UserTesting, Toluna వంటి సైట్లలో రిజిస్టర్ అవ్వండి. అక్కడి నుంచి వర్క్ తెచ్చుకోండి. సర్వేలు పూర్తిచేసి పాయింట్లు సంపాదించండి. వాటిని మనీ రూపంలో కన్వర్ట్ చేసుకోండి. వీరికి వచ్చే ఆదాయం ₹1,000 – ₹5,000/నెలకు ఉంటుంది.
Bonus: Free Tools
పైన చెప్పిన ప్రతి ఒక్క సైడ్ హసిల్ కి ఇప్పుడు చెప్పే టూల్స్ అవసరం అవుతాయి. ఇవన్నీ మీకు ఫ్రీగానే లభిస్తాయి. వాటిని ఎలా వాడి, డబ్బులు సంపాదించాలో తెలిస్తే చాలు.
- Canva– డిజైన్ కోసం
- ChatGPT / Notion AI – కంటెంట్, ఐడియాలు
- CapCut / VN Editor – వీడియో ఎడిటింగ్
- Google Sites / Blogger – ఉచితంగా వెబ్‌సైట్ లేదా బ్లాగ్
- Trello / Notion – ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్
Comprehensive Financial Management for Wealth Building – 10 Steps for You
Avoid These Common Mistakes:
- ఒకేసారి అన్ని పనులు మొదలుపెట్టకండి.
- మొదట్లో ఫ్రీ/తక్కువ మనీ ఛార్జ్ చేయండి.
- ఒక niche లో consistency ఉండాలి.
- పర్సనల్ బ్రాండ్‌ను క్రియేట్ చేయండి.
జీరో బడ్జెట్ తో స్టార్ట్ చేసే ఆదాయ మార్గాలు తెలుసుకున్నాం. మీకు కావాల్సిన ఐడియాను ఎంచుకుని, 30 రోజులు కంటిన్యూగా పని చేయండి. ఫలితాలు మీకే తెలుస్తాయి. ఈ ఆర్టికల్ లో మనం మాట్లాడుకున్న 10 Best Side Hustles in 2025 మీకు సరైన దారిని చూపిస్తాయని అనుకుంటున్నా. కాకపోతే స్కిల్ నేర్చుకున్న తర్వాతే మొదలుపెట్టండి. లేకపోతే ఈ కాంపిటీషన్ లో నెగ్గుకు రావడం చాలా కష్టం. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోండి.
Join us on Telegram Group.