Top Reasons Why Your Resume Isn’t Working in 2025

మీరు చాలా జాబ్స్‌కు అప్లై చేస్తున్నా, ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రావట్లేదా? అయితే మీ రెజ్యూమ్ రిక్రూటర్ చూడకముందే తిరస్కరించబడుతోంది. ఈ సీక్రెట్ విషయం చాలా మందికి తెలీదు. ఎందుకంటే ఈ 2025 సంవత్సరంలో కంపెనీలు వేల సంఖ్యలో రెజ్యూమేలను పొందుతున్నాయి. అందుకే ఈ పోటీ ప్రపంచంలో సాధారణ రెజ్యూమే సరిపోదు. కాబట్టి Why Your Resume Isn’t Working అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో మీరు తెలుసుకోబోయేది, రెజ్యూమే ఎందుకు పని చేయట్లేదు? ఈ సంవత్సరం లో సరైన అప్డేటెడ్ రెజ్యూమే ఎలా తయారుచేయాలి? ఇంటర్వ్యూ కాల్స్ రావడానికి ఏం మార్పులు చేయాలి?

1. Why Your Resume Isn’t Working in 2025

It’s Not ATS-Friendly: పెద్ద కంపెనీలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ATS అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాయి. ATS అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్. రెజ్యూమేలో ఇంపార్టెంట్ కీవర్డ్స్ లేకపోతే, వెంటనే ఈ సాఫ్ట్వేర్ రెజెక్ట్ చేసేస్తుంది. అలాగే రెజ్యూమె సరైన ఫార్మాట్ లో లేకున్నా కూడా రెజెక్ట్ చేసేస్తుంది. అందుకే టేబుల్స్, ఇమేజెస్, డిజైన్స్ లేకుండా క్లియర్ & సింపుల్ ఫార్మాట్ వాడండి. అలాగే జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉపయోగించండి. ఆ రెజ్యుమె ని వర్డ్ డాక్యుమెంట్ లేదా PDFగా సేవ్ చేయండి.

Outdated Resume Design: మీరు ఎప్పుడో క్రియేట్ చేసిన రెజ్యూమే ఇప్పటికీ వాడుతుంటే, అది డస్ట్ బిన్ లోకి వెళ్తుంది. కాబట్టి ఇప్పట్లో రిక్రూటర్లు క్లీన్, ప్రొఫెషనల్ లుకింగ్ రెజ్యూమేలను మాత్రమే చూస్తారు. Canva, Zety, Novoresume లాంటి tools వాడి కొత్త రెజ్యుమె templates తీసుకోండి. కస్టమైజ్ అంటే చేంజ్ చేసుకునే విధంగా సింపుల్ ఫార్మాట్ ఎంచుకోండి.

No Personalization for the Job Role: ఒకే రెజ్యూమేను 100 కంపెనీలకు పంపితే, ఏ కంపెనీకి ఆ రెజ్యుమె సరిపోదు. చివరికి రిజెక్ట్ మాత్రమే అవుతుంది. ప్రతి జాబ్‌ డిస్క్రిప్షన్ కి తగినట్లుగా కస్టమైజ్ చేయండి. ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్స్, టూల్స్ రెజ్యూమేలో ఉండాలి.

Lack of Quantifiable Achievements: మీరు ఏం చేసారనేదే కాదు, ఏం సాధించారో కూడా చూపించాలి. ఉదాహరణకు Sales handled అని కాకుండా → 3 నెలల్లో ₹15 లక్షల వరకు సేల్స్ చేశాను అనేది బాగుంటుంది. అలాగే Managed team అని కాకుండా → 5 మెంబెర్స్ ఉన్న టీమ్‌ను సక్సెస్ఫుల్ గా లీడ్ చేశాను అనేది ఇంకా బాగుంటుంది.

Missing Keywords from Job Listings: జాబ్ పోస్టింగ్‌లో ఉన్న keywords (ఉదాహారణకు: MS Excel, Communication, Project Management) రెజ్యూమేలో లేకపోతే, దాన్ని ATS సిస్టమ్ పట్టించుకోదు. దాంతో మీ రెజ్యూమె రెజెక్ట్ అవుతుంది. కాబట్టి జాబ్ డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి. అందులో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్స్ మీ రెజ్యూమేలో ఉండేలా జోడించండి.

2. What Works in Resumes in 2025


ప్రొఫెషనల్ సమ్మరీ: 3–4 లైన్లలో మీ ప్రొఫైల్ & లక్ష్యం గురించి వివరించండి.
Achievements based Content: కేవలం ఇది చేశాను అని కాకుండా, అది ఎంతవరకు రిజల్ట్ ఇచ్చాను అని చూపించండి.


Tools & Skills: Excel, Canva, ChatGPT, Notion వంటి టూల్స్ మీ స్కిల్స్ సెక్షన్‌లో చూపించండి.
Soft Skills రుజువు చేయండి: Team player అని మెన్షన్ చేస్తే, దానికి ఉదాహరణ కూడా ఇవ్వండి.
Objective సెక్షన్ వాడొద్దు: దాని బదులుగా స్ట్రాంగ్ summary ని వాడండి.

3. Step-by-Step Guide to Fixing Your Resume

Choose the Right Template: ATS-Friendly Template ఎంచుకోండి. Canva, Zety లాంటి టూల్స్ ఉపయోగించి మీకు కావలసిన విధంగా టెంప్లేట్ క్రియేట్ చేసుకోండి.

Write a Killer Professional Summary: ఉదా: Excel & Data Analysisలో 3 సంవత్సరాల అనుభవం ఉన్న ఫైనాన్స్ అనలిస్ట్, ₹10 లక్షల కోస్ట్ సేవింగ్ సాధించాడు అని మెన్షన్ చేయండి.

Rewrite Experience with Action Verbs + Metrics: ఉదాహరణకు Handled clients అని చెప్పకుండా, 15 క్లయింట్లతో ప్రాజెక్ట్‌లను 30% వేగంగా పూర్తిచేశాను అని మెన్షన్ చేస్తే చాలా బాగా ఉంటుంది.
Customize for Each Job: ప్రతి జాబ్‌ స్కిల్స్ కి తగ్గట్టుగా కస్టమైజ్ చేయండి. ఒకే రెజ్యూమే ప్రతి చోట వాడొద్దు.
Use Keywords Naturally: జాబ్‌లో ఉన్న Keywords ని మీ రెజ్యూమె లో ఉండేలా చూసుకోండి. అలాగే జాబ్ పోస్ట్‌లో ఉన్న పదాలు కూడా వాడండి (ఉదా: Leadership, CRM Tools, Forecasting).

4. AI-Optimized Resume

AI టూల్స్ ఉపయోగించి ATS సిస్టమ్‌ల కోసం కస్టమ్ చేసిన రెజ్యూమేలు ఎక్కువ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ పొందుతున్నాయి. ఉపయోగపడే టూల్స్: Rezi, Jobscan, Resume Worded – ఇవి AI ఆధారంగా మీ రెజ్యూమేను స్కోర్ చేసి, సెలెక్ట్ అయ్యేలా చేస్తాయి.

5 Career Paths with Fastest Growth in 2025

FAQs
Q1: Resume ఎన్ని పేజీలు ఉండాలి?
A: ఫ్రెషర్స్‌కి ఒక పేజీ సరిపోతుంది. అనుభవం ఉంటే 2 పేజీలు సరిపోతాయి.
Q2: కంపల్సరీ Photo ఉండాలా?
A: ప్రస్తుతానికి ఇండియాలో అయితే అవసరం లేదు. కానీ కొంతమంది ప్రొఫెషనల్ లుకింగ్ ఫోటో జోడిస్తే బాగుంటుంది.
Q3: Objective section అవసరమా?
A: అవసరం లేదు. ఇప్పుడు summary section అనేది trendలో ఉంది.
Q4: Resume check చేయించుకోవచ్చా?
A: చేయించుకోవచ్చు. మీరు Resume Worded, Jobscan లాంటి tools ద్వారా score చెక్ చేసుకోవచ్చు.

జాబ్ ల కోసం రోజురోజుకూ పోటీ పెరుగుతోంది. కానీ అందరికంటే ఒక అడుగు ముందుండాలంటే, మీ రెజ్యూమేనే ముందుగా ఇంప్రూవ్ చేయాలి. ఒక మంచి రెజ్యూమే = మంచి ఫస్ట్ ఇంప్రెషన్ + ఇంటర్వ్యూకు అవకాశాలు. మీ రెజ్యూమే చదివిన రిక్రూటర్ 6 సెకన్లలో మీ గురించి నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి ఈ 6 సెకన్లలో మీ టాలెంట్, అనుభవం, స్కిల్స్ చూపించే విధంగా మీ రెజ్యూమే ఉండాలి. ఇప్పుడే మీ పాత రెజ్యూమే తీసుకొని, ఈ ఆర్టికల్‌లో చెప్పిన సూచనలతో అప్‌డేట్ చేయండి. మరెందుకు ఆలస్యం మీ నెక్స్ట్ ఇంటర్వ్యూకు రైడీ అవండి.

చివరగా ఈరోజుల్లో ఉద్యోగం సంపాదించడానికి రెజ్యూమే చాలా కీలకం. కాబట్టి సాధారణ, పాత ఫార్మాట్ వాడుతూ ఇంటర్వ్యూలు ఆశించకండి. ఇప్పుడు వరకు మీరు ఈ ఆర్టికల్ లో నేర్చుకున్న గైడ్ తో మీ రెజ్యూమేను మార్చుకుంటే, ఉద్యోగం మీకు పక్కా వస్తుంది. Why Your Resume Isn’t Working అనే క్వశ్చన్ కి సరైన ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్ ద్వారా పూర్తిగా తెలుసుకున్నారని భావిస్తున్నాను. పైన చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీకు అవసరం లేకున్నా మీ ఫ్రెండ్స్ కి అయినా ఒక మంచి అవకాశం ఇచ్చినట్టవుతుంది.

Join us on Telegram Group.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *