డబ్బులు సంపాదించడం రాత్రికి రాత్రి జరిగిపోయేది కాదు. సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక అలవాటు. కాబట్టి ఇదొక నిరంతర ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. అందుకే మేము 10 పాయింట్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాం. వీటి వల్ల ఫైనాన్సిల్ ఫ్రీడమ్ మరియు ఫైనాన్సియల్ గా సెక్యూర్ అవుతారు. ఇది మీకు ఆర్థికంగా చాలా బాగా సహాయపడుతుంది.
1. Set Clear Financial Goals: సంపదను సృష్టించడానికి అసలు మీరు ఎం చేస్తున్నారనేది తెలియాలి. ఇంటి కోసం దాచిపెడుతున్నారా? రిటైర్మెంట్ కోసం దాచిపెడుతున్నారా? లేదా ఫైనాన్సిల్ ఫ్రీడమ్ పొందడానికి దాచిపెడుతున్నారా? అనేది స్పష్టంగా నిర్ణయించుకోవాలి. ముందు మీ ఫైనాన్సిల్ గోల్స్ ని పేపర్ పై రాసుకోండి. అందరూ ఒకదాంట్లో దాచిపెడుతున్నారని మీరు కూడా అలా చేయకండి. కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉదాహరణకు లక్ష రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ కోసం దాచడం. లేదా మీరు రిటైర్మెంట్ అయ్యే వరకు నెలకు ఒక వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి.
ఇది కేవలం మీకు అర్థం కావడానికి మాత్రమే తీసుకున్నా. మీరు మీ స్థోమతను బట్టి ఎక్కువ లేదా తక్కువ చూసుకోండి. ఇప్పుడున్న చాలామంది యంగ్ ప్రొఫెషనల్స్ ఫైనాన్సిల్ ఫ్రీడమ్ ని లక్ష్యంగా పెట్టుకొని తమ పని ఎలా ఉండాలో నిర్ణయించుకుంటున్నారు. ఎలాంటి వర్క్ చేస్తే ఫైనాన్సియల్ ఫ్రీడమ్ తొందరగా వస్తుంది? అలాగే ఇంతకుముందే చేస్తున్న పనిలో ఫైనాన్సిల్ ఫ్రీడమ్ పొందాలంటే ఏం చేయాలనేది ముందుగానే నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఖచ్చితమైన మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దోహదం చేస్తుంది.
2. Create and Stick to a Budget: ఇదెందుకు అవసరం అంటే మీ బడ్జెట్ ఎలాంటి పనులకు ఉపయోగిస్తున్నారు. అలా ఉపయోగించిన బడ్జెట్ మళ్లీ తిరిగి వస్తుందా లేక ఖర్చయిపోతుందా అనేది తెలుస్తుంది. కాబట్టి ఒక బడ్జెట్ ప్లాన్ రూపొందించుకొని అవసరం అనుకుంటేనే దానికి తగ్గట్టు కేటాయించండి. లేకపోతే వదిలేయండి. మీరు చేసే ప్రతి ఖర్చుని కూడా నిజంగా అవసరమా లేక పెద్దగా అవసరం లేదా అనేది తెలుసుకొని నిర్ణయాలు తీసుకోండి. ఇలా ఖర్చులు తగ్గించి బడ్జెట్ ని లిమిట్ లో వాడుకోవడం వల్ల మంచి ఫైనాన్సిల్ ఫ్రీడమ్ పొందడానికి ఆస్కారం వుంటుంది. Good Budget, Mint, YNAB లాంటి టూల్స్ ని ఉపయోగించుకొని బడ్జెట్ ఎలా కేటాయించాలో తెలుసుకోండి. ఇవి మీ ఖర్చులను ట్రాక్ చేస్తూ మిమ్మల్ని లక్ష్యానికి చేరుకునేలా చేస్తాయి.
3. Build an Emergency Fund: జీవితం అనేది ఊహించలేనిది. అందుకే అత్యవసర నిధి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా మనకు అత్యవసంగా డబ్బు అవసరం అయితే ఎవ్వరూ ఇవ్వరు. ఉదాహరణకు మనకో లేక మనవాళ్లకో ఆక్సిడెంట్ జరిగితే అప్పటికప్పుడు ఎవరూ డబ్బులు ఇవ్వకపోతే చాలా కష్టం. ఒకవేళ ఎమర్జెన్సీ ఫండ్ ఉన్నట్టయితే అప్పటికప్పుడు డబ్బులు తీసుకెళ్లి హాస్పిటల్ బిల్ లేదా ఖర్చులకు ఉపయోగిస్తాం. అలా జాగ్రత్తగా వాటిని అత్యవసర సమయానికి వాడుకుంటాం. దీనినే ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. దీన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే, చిన్నగా వారం వారం కొంత డబ్బుని అత్యవసర నిధికోసం దాచి పెట్టండి.
లేదా నెల నెలా కొంచెం డబ్బుని ఆరు నెలలు అలా దాచిపెట్టండి. మీరు చేస్తున్న పనిలో వచ్చిన మొత్తం డబ్బులో కొంత భాగాన్ని మాత్రమే తీసుకోండి. ఎందుకంటే మిగతా ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్ లాంటివి ఉంటాయి కదా. మీకొకటి గుర్తుందో లేదో, COVID-19 మహమ్మారి వచ్చిన సమయంలో అత్యవసర నిధి ఉన్నవారు, ఆర్థికంగా మరియు అప్పుల గురించి ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోలేదు. అదే అత్యవసర నిధి లేనివారు చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. నాకు ఆ సమయంలో ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలని బాగా అర్థం అయ్యింది.
4. Control Your Debt: అప్పులు అనేవి మన స్థోమతకు తగట్టు ఉండాలి. లేకపోతే మనం సంపాదించిన డబ్బంతా వాటి వడ్డీలకే సరిపోతాయి. ఒకవేళ ఎక్కువ అప్పులు ఉన్నా వాటిని మంచిగా మేనేజ్ చేయాలి. లేకపోతే మన ఫైనాన్సిల్ ఫ్రీడమ్ కి అడ్డుతగిలే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగా ఎక్కువ వడ్డీ ఉండే అప్పులను క్లియర్ చేసుకోవాలి. ఆ తర్వాత తక్కువ వడ్డీ ఉండే అప్పులను తగ్గించుకుంటూ పోవాలి. అలాగే కొత్త అప్పులకు దూరంగా ఉండండి. అప్పుడే ఫైనాన్సిల్ ఫ్రీడమ్ పొందుటకు దగ్గర అవుతారు.
5. Invest Early and Consistently: ఇప్పుడు కాంపౌండ్ ఇంటరెస్ట్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు కాంపౌండ్ ఇంటరెస్ట్ రూపంలో డబల్, ట్రిపుల్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎంత ఎక్కువ సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ డబ్బు మనం పొందుతాము. ఉదాహరణకు ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఇక్కడ రిస్క్ తక్కువ కాబట్టి రిటర్న్స్ కూడా కొంచెం నార్మల్ గానే వస్తాయి. మొత్తానికి మీ వయస్సు తక్కువ ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. అలాగే దాన్ని వయస్సు పెరిగే కొద్దీ నిలకడగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. అప్పుడే మీ సంపద అంచెలంచెలుగా పెరుగుతూ వెళ్తుంది.
6. Save for Retirement: ఇప్పుడు మీరు డబ్బుని పొదుపు చేయడం ప్రారంభిస్తే ఏదైనా సమస్య వల్ల మీ పని ఆగిపోయినా కూడా సౌకర్యవంతమైన జీవనశైలిని గడపవచ్చు. ఒకవేళ మీరు రిటైర్మెంట్ అయితే అప్పుడు ప్లాన్ ప్రకారం దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. లేదంటే వచ్చిన తక్కువ డబ్బుని తీసుకోవచ్చు. ఈ తక్కువ డబ్బు మీ జీవనశైలికి ఏమాత్రం సరిపోదు. అందుకే రిటైర్మెంట్ ప్లాన్ కి అనుగుణంగా పొదుపు చేస్తే, చివరికి చాలా డబ్బు మీ చేతికి వస్తుంది. దాంతో మంచి జీవితాన్ని గడపవచ్చు. ఇప్పట్లో చాలామంది ముందుగానే ఫైనాన్సిల్ ఫ్రీడమ్ పొంది, తొందరగా రిటైర్ అవుతున్నారు. అందుకే మీరు కూడా ఆన్లైన్ లో చాలా టూల్స్ ఉన్నాయి. వాటిని వాడుకొని మీ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి.
7. Review and Adjust Regularly: ఫైనాన్సియల్ గోల్స్ అనేవి అప్పుడప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు చూసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా అంటే నెలకోసారి లేదా సంవత్సరానికి ఒకసారి చెక్ చేస్కోవాలి. దాని ప్రకారం మీ డబ్బులని, ఖర్చులను సర్దుబాటు చేస్కోవాలి. చాలామంది హెల్త్ చెకప్ చేయించుకుంటారు కానీ వెల్త్ చెకప్ చేయించుకోరు. అసలు వెల్త్ చెకప్ అంటే ఏంటో మీకు తెలుసా? తెలీదు కదా! వెల్త్ చెకప్ అంటే మీరు ఎలాంటి ఫైనాన్సిల్ స్థితిలో ఉన్నావనేది తెలియజేస్తుంది. మీరు పేదవారా? లేక ధనికులా? అనేది పూర్తి సమాచారం కలిగిన రిపోర్ట్.
8. Live Below Your Means: మీరు సంపాదించిన డబ్బు కంటే తక్కువ ఖర్చు చేయడం వల్ల savings, investment and debts repayment చేయడానికి ఇంకా డబ్బు మిగులుతుంది కాబట్టి. మీరు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నట్టయితే ఎక్కువ జీవనశైలిని మార్చుకోకుండా సాధారణంగానే ఉండండి. అంతేగానీ ఏవర్నో ఇంప్రెస్ చేయడానికి మీ జీవనశైలిని మార్చుకోకండి. మీకు విలువ ఇచ్చే దానిపై మాత్రమే ఫోకస్ చేయండి. ఉదాహరణకు “The Millionaire Next Door” అనే థియరీ మనకొక మంచి విషయాన్ని తెలియజేస్తుంది. అదేంటంటే అధిక ఆదాయాన్ని సంపాదించడం, విలాసవంతమైన జీవితాన్ని గడపడం, అసలైన ఫైనాన్సిల్ సక్సెస్ కాదు. క్రమశిక్షణతో కూడిన ఫైనాన్సిల్ డెసిషన్స్ తీసుకోవడం, పొదుపుగా ఉన్నదాంట్లో జీవించడం మరియు తెలివిగా పెట్టుబడి పెట్టడం ఎలానో నేర్పిస్తుంది.
9. Stay Educated About Personal Finance: ఆర్థిక జ్ఞానం అనేది మిమ్మల్ని తెలివిగా నిర్ణయాలు తీసుకోవడానికి మరియు సాధారణ తప్పులను నివారించడానికి సహాయపడుతుంది. ఆర్థిక జ్ఞానాన్ని ఎలా పొందాలంటే బ్లాగ్స్ చదవండి, పాడ్‌క్యాస్ట్‌లను వినండి లేదా ఆన్‌లైన్ కోర్సులను తీసుకొని నేర్చుకోండి. ప్రతి నెల ఒక కొత్త ఆర్థిక అంశం గురించి తెలుసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోండి. యూట్యూబ్ వంటి ప్లాట్ ఫారమ్ లలో ప్రేక్షకుల కోసం ఆర్థిక సలహాలు ఇచ్చే చాలా ఛానెల్స్ ఫ్రీగానే ఉన్నాయి.
10. Give Back: ఎంత డబ్బు సంపాదించినా దాంట్లో కొంచెం డబ్బు తిరిగి స్వచ్చంద సేవా సంస్థలకు దానం చేయడం వల్ల మానవ బంధాలనేవి పెరుగుతాయి. దాంతో మనకు సంతృప్తిగా ఉంటుంది. ఉదాహరణకు వేలకోట్లు సంపాదించిన Ratan Tata గారు తన సంపాదనలో 60%-70% పైగా విరాళాలు ఇచ్చారు. అంటే దాదాపు 9,000 కోట్లు విరాళం ఇవ్వడం జరిగింది. ఇంతకంటే గొప్ప పని ఇంకేముంటుంది. ఎందుకంటే ఎంత సంపాదించినా ఆత్మ సంతృప్తికి మించిన పని ఇంకోటి లేదు. అందుకే తిరిగి ఇవ్వాలనేది.
నిలకడగా క్రమశిక్షణతో ఉంటేనే సంపదను నిర్మించుకోగలం. పైన చెప్పిన 10 అలవాట్లను పాటించడం వల్ల, ఫైనాన్సిల్ గా సెక్యూర్ మరియు స్వేచ్ఛగా ఉంటారు. ఎలాంటి వాతావరణంనైనా స్వీకరిస్తే సౌలభ్యంగా లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అందుకే ఫైనాన్సిల్ ఫ్రీడమ్ ను పొందేందుకు ఇప్పుడే దారులు సృష్టించుకోండి.
Join us on Telegram Group.