Nature of Business Easy Path to Great Results

ఒక వ్యాపారం ఎలా పనిచేస్తుంది? దాని లక్ష్యాలు ఏమిటి? ఆ బిజినెస్ ప్రోడక్ట్స్ అందిస్తుందా? లేక సర్వీసెస్ అందిస్తుందా? ఇవన్నీ కలిపిన పూర్తి సమాచారాన్ని బిజినెస్ యొక్క స్వభావం (Nature of Business) అంటారు. ఇది ప్రధానంగా వారు ఏ రకమైన వ్యాపారం చేస్తున్నారు? దాని ఆవశ్యకత ఏంటి? పనితీరు ఎంటనేది కూడా వివరిస్తుంది. ఈ ఆర్టికల్‌లో, మీరు బిజినెస్ స్వభావం గురించి పూర్తిగా నేర్చుకుంటారు – దాని భాగాలు, రకాలు మరియు ఎలాంటి బిజినెస్ ప్రారంభించాలో నిర్ణయించుకోవడంలో ఇది ఎలా సహాయపడతుందో కూడా తెలుసుకుంటారు.

What Is the Nature of Business?

బిజినెస్ స్వభావం అంటే ఒక వ్యాపారం యొక్క ప్రాధమిక లక్ష్యం, పని తీరు, స్ట్రక్చర్ మరియు ఇది పనిచేస్తున్న పరిశ్రమ రకంలను సూచిస్తుంది. ఇది ఈ క్రింది అంశాలపై ఆధారపడి ఉంటుంది:

  • Purpose (Profit/Non-Profit)
  • Activities
  • Legal Structure (Sole Proprietor, Pvt Ltd, etc.)
  • Industry Classification (Agriculture, Services, Manufacturing, etc.)
  • Products or Services

Components of the Nature of Business

ఒక వ్యాపారం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే, దాని లక్ష్యం, చేసే కార్యకలాపాలు, నిర్మాణం, రంగం మరియు ఆఫర్ చేసే ఉత్పత్తులు లేదా సేవల వివరాలను తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ భాగాలను ఒక్కొక్కటిగా తెలుగులో వివరంగా చూద్దాం.

1. Purpose and Objectives: ఒక వ్యాపారం ఎందుకు స్టార్ట్ చేయబడుతుంది? దాని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

  • Profit-Oriented : చాలా వ్యాపారాలు అధిక లాభాలను సంపాదించేందుకు స్టార్ట్ చేస్తారు.
  • Non-Profit Objectives : కొన్ని రకాల సంస్థలు సామాజిక సేవలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో సర్వీసెస్ అందించడం కోసం పనిచేస్తాయి.
  • Hybrid Objectives : కొన్నింటిలో లాభం మరియు సర్వీస్ రెండు లక్ష్యాలుగా ఉంటాయి.

ఉదాహరణకు ఒక Social Enterprise స్వల్ప లాభంతో పాటు సమాజానికి ఉపయోగపడే సేవలు కూడా చేస్తుంది.

2. Core Activities: స్ట్రాటజిక్ వేలో వ్యాపారం నడవడానికి అవసరమైన ముఖ్యమైన కార్యకలాపాలు ఇవే.

  • Production : ముడిసరుకుల నుంచి సరుకులు తయారుచేయడం.
  • Distribution : తయారైన ప్రొడక్ట్స్ ని వినియోగదారులకు అందించడం.
  • Marketing : బ్రాండ్ ప్రమోషన్, ప్రచారం చేయడం.
  • Sales : ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ని విక్రయించడం.
  • Customer Service : కస్టమర్‌కి మనం అందించే సర్వీస్ గురించి సహాయం చేయడం.

3. Legal Structure: ఒక వ్యాపార సంస్థ ఏ రకంగా నడుస్తోంది అన్నది దాని చట్టబద్ధ నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది.

  • Sole Proprietorship : ఒక్క వ్యక్తి ఆధీనంలో నడుస్తుంది.
  • Partnership : ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసిన వ్యాపారం.
  • Corporation : షేర్‌హోల్డర్లకి చెందిన ఒక చట్టబద్ధ సంస్థ.
  • LLC : లిమిటెడ్ లయబిలిటీ కలిగిన సంస్థ, ఇది పార్ట్‌నర్‌షిప్ & కార్పొరేట్ మోడళ్ల కలయికగా ఉంటుంది.

4. Industry Classification: ప్రతి వ్యాపారం ఒక నిర్దిష్ట రంగానికి చెందినదే. వాటిని నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు.

  • Primary Sector : వ్యవసాయం, గనులు, మత్స్య సంపత్తి.
  • Secondary Sector : ఉత్పత్తి, కట్టడ నిర్మాణం.
  • Tertiary Sector : రిటైల్, ఫైనాన్స్, హాస్పిటాలిటీ వంటి సేవా రంగం.
  • Quaternary Sector : ఐటీ, రీసెర్చ్, డిజిటల్ సర్వీసెస్.

5. Products or Services Offered: ఇందులో రెండు రకాల వ్యాపార ఆఫరింగ్‌లు ఉంటాయి:

  • Tangible Products : అంటే చేతితో టచ్ చేయగల ప్రొడక్ట్స్. మాల్స్‌లో లేదా షాపులలో కనిపించే వస్తువులు. ఉదాహారణకు బట్టలు, మొబైల్స్, etc.
  • Intangible Services : అంటే చేతితో టచ్ చేయలేనివి. వీటిని టచ్ చేయలేం కానీ అధిక విలువ కలిగిన సర్వీసెస్. ఉదాహారణకు కన్సల్టింగ్, ఎడ్యుకేషన్, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్.

సులభంగా అర్థం అయ్యేలా చెప్పాలంటే, బిజినెస్ యొక్క స్వభావం అనే పదం వ్యాపారం చేసే విధానం, దాని ఉద్దేశ్యం, నిర్వహణ నిర్మాణం, మార్కెట్ రంగం, మరియు అందించే సేవలపై ఆధారపడి ఉంటుంది. ఇది బిజినెస్ ఎలా పనిచేస్తుందో, దాని లక్ష్యం ఏమిటో, మరియు మార్కెట్‌లో దాని స్థానం ఏమిటో అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

Types of Business Activities

వ్యాపారం అంటే కేవలం వస్తువులను అమ్మడం మాత్రమే కాదు. వ్యాపారాన్ని నడిపించేందుకు ఎన్నో రకాల కార్యకలాపాలు జరుగుతాయి. వాటిని ప్రధానంగా ఈ క్రింది రకాలుగా విభజించవచ్చు.

1. Manufacturing Activities : ఈ రకం వ్యాపారాలు ముడి పదార్థాలను తీసుకొని, వాటిని వినియోగదారులకు అవసరమైన వస్తువులుగా తయారు చేస్తాయి. ఉదాహరణకు బట్టల ఫ్యాక్టరీలు, కార్ల తయారీ కంపెనీలు, ఫర్నిచర్ తయారీ కేంద్రాలు వంటివి. ఇవి ఎక్కువగా కర్మాగారాల ఆధారంగా పనిచేస్తాయి.

2. Trading Activities : వస్తువులను కొనుగోలు చేసి విక్రయించడం. ఈ వ్యాపారాలు మూడో వ్యక్తి నుండి వస్తువులను కొనుగోలు చేసి, వాటిని కస్టమర్లకు అమ్మే ప్రక్రియలో నిమగ్నమై ఉంటాయి. ఉదాహరణకు రిటైల్ షాపులు, హోల్‌సేల్ వ్యాపారులు, మార్కెట్‌లో బ్రోకర్లు. వీరు తయారీకి సంబంధం లేకుండా, అమ్మకం ప్రక్రియలో భాగంగా ఉంటారు.

3. Service Activities : అశారీరక సేవలను అందించడం. ఈ రకానికి చెందిన వ్యాపారాలు కస్టమర్లకు సేవలు అందిస్తాయి. ఉదాహరణకు సలహాలు ఇవ్వడం, పరిష్కారాలు చెప్పడం, హెల్ప్ డెస్క్ సపోర్ట్ మొదలైనవి. ఉదాహరణలు చూస్తే బ్యాంకులు, టాక్సీ సర్వీసెస్, హోటల్ మేనేజ్‌మెంట్, బీమా కంపెనీలు. సర్వీసెస్ కనిపించవు కానీ వినియోగదారులకు విలువను అందిస్తాయి.

4. Agricultural Activities : భూమిని ఆధారంగా చేసుకుని ఆహారం లేదా ముడి పదార్థాల ఉత్పత్తి. ఎలా అంటే పంటలు సాగు చేయడం, పశుపాలన, మత్స్య వ్యాపారం వంటివి ఈ విభాగంలో వస్తాయి. ఉదాహరణకు వరి సాగు, పాలు ఉత్పత్తి కేంద్రాలు, చేపల కేంద్రాలు. ఇది ప్రాథమిక రంగానికి చెందుతుంది.

5. Mining & Extraction Activities : భూమిలో నుంచి సహజ వనరులను వెలికి తీసే ప్రక్రియ. ఎలా అంటే బొగ్గు, బంగారం, ఆయిల్, గ్యాస్ వంటి మూల వనరులను నేల దిగువ నుండి తవ్వడం. ఉదాహరణకు బొగ్గు గనులు, క్రూడ్ ఆయిల్ తవ్వకం, మినరల్స్ తవ్వక కేంద్రాలు. ఇవి అత్యంత ఖరీదైన మరియు పెద్ద వ్యాపార కార్యకలాపాలు.

చివరగా ప్రతి వ్యాపారం ఈ ఐదు కార్యకలాపాల్లో ఒకటి లేదా అనేక రకాలలో భాగంగా ఉంటుంది. వ్యాపారం ఏ రంగంలో ఉన్నా, ఈ కార్యకలాపాలపై సరైన అవగాహన ఉండటం అనేది వ్యాపార విజయానికి కీలకం. మీరు వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని చూస్తున్నా, లేదా ఉద్యోగంగా వ్యాపార రంగంలోకి రావాలని అనుకుంటున్నా, ఈ వ్యాపార కార్యకలాపాల రకాల మీద బేసిక్ అవగాహన ఉండటం అవసరం.

Importance of Understanding the Nature of Business

వ్యాపారం స్వభావం అంటే ఏ వ్యాపారమైనా ఏ ఉద్దేశంతో సాగుతుంది, ఏ రంగంలో పనిచేస్తుంది, ఎలాంటి ఉత్పత్తులు లేదా సేవలు అందిస్తుంది అనే అంశాల సమాహారం. దీనిని అర్థం చేసుకోవడం వ్యాపార ప్రారంభం నుంచి విజయవంతమైన నిర్వహణ వరకు చాలా అవసరం.

1. Helps Define Clear Business Goals : వ్యాపార స్వభావాన్ని తెలుసుకోవడం వలన మీరు మీ వ్యాపారం చేసే ఉద్దేశాన్ని స్పష్టంగా నిర్ణయించవచ్చు. ఉదాహరణకు మీరు లాభం కోసం చేస్తున్నారా? లేక సామాజిక సేవ కోసం చేస్తున్నారా? అనే విషయాన్ని ముందుగా స్పష్టంగా నిర్ణయించుకోవచ్చు.

2. Enables Strategic Planning : వ్యాపార స్వభావాన్ని బట్టి మీరు మీ వ్యాపారం కోసం సరైన స్ట్రాటజీ, మార్కెటింగ్ ప్లాన్స్ తయారుచేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ ఎవరికి అవసరం? ఏ ప్రాంతంలో డిమాండ్ ఎక్కువ? అనే విషయాలను అర్థం చేసుకోవచ్చు.

3. Identifies Market Position : మీ వ్యాపారం ఏ రంగంలో వస్తుంది, మీ పోటీదారులు ఎవరున్నారు? అనే విషయాలను బట్టి మార్కెట్లో మీ స్థానాన్ని అర్థం చేసుకోవచ్చు. అది మీ బ్రాండ్ నిర్మాణానికి ఉపయోగపడుతుంది.

4. Efficient Resource Utilization : మీ వ్యాపారానికి అవసరమైన వనరులు మానవ వనరు, సాంకేతికత, పెట్టుబడి వంటి వాటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వ్యాపారం స్వభావాన్ని తెలుసుకోవడం అవసరం.

5. Ensures Legal Compliance : మీ వ్యాపారం ఏ రకమైనదో బట్టి, దానికి అవసరమైన లైసెన్స్‌లు, చట్టాలు పాటించాల్సిన విధానం మారుతుంది. ఉదాహరణకు, ఒక ఫుడ్ బిజినెస్‌కు FSSAI లైసెన్స్ అవసరం, కానీ ఒక ఐటి కంపెనీకి అది అవసరం లేదు.

6. Helps Communicate with Investors : మీ వ్యాపారం స్వభావం స్పష్టంగా ఉండటం వలన మీరు పెట్టుబడిదారులకు మీ వ్యాపారం గురించి నమ్మకంగా వివరించగలరు. అది పెట్టుబడులు సులభంగా పొందటానికి సహాయపడుతుంది.

7. Builds Better Customer Relationships : మీ వ్యాపారం ఏ సేవలు అందిస్తుందో, కస్టమర్లకు ఏ విలువను అందించాలనుకుంటుందో స్పష్టంగా తెలుసుకోవడం వలన, మీరు కస్టమర్లకు నమ్మకాన్ని కలిగించగలరు.

ఉదాహరణకు ఒక ఆన్‌లైన్ క్లాతింగ్ స్టోర్ దాని స్వభావం – ఈ-కామర్స్, ఉద్దేశ్యం — ట్రెండీ దుస్తులను అందరికీ అందుబాటులోకి తేవడం. ఇది రిటైల్ సర్వీస్ బిజినెస్. ఇంకొక ఉదాహరణ చూస్తే ఒక ఎడ్యుకేషన్ యూట్యూబ్ చానెల్ ఉద్దేశం — విద్య అందించడం, లాభం కాకుండా సేవే లక్ష్యం. ఇది నాన్-ప్రాఫిట్ సేవా రంగంకు చెందినది. చివరగా వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ తమ వ్యాపార స్వభావాన్ని గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. ఇది లాభాల్లో పెరుగుదలకు మాత్రమే కాకుండా, స్థిరమైన అభివృద్ధికి దారితీస్తుంది. మీరు వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, లేదా ఇప్పటికే నడుపుతున్నా, ఈ నాలెడ్జ్ మీకు రోడ్ మ్యాప్ లా ఉంటుంది.

Factors Influencing the Nature of Business

ఒక వ్యాపారం ఎలా ఉంటుంది? దాని లక్ష్యాలు, ఆచరణా విధానాలు, మార్కెట్‌లో వ్యవహరించే తీరును ఏవేవో అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనవే ఈ స్వభావాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఇవి వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో, వ్యూహాలను రూపొందించడంలో, వృద్ధి సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

1. Economic Environment : మార్కెట్ అనేది భూమింగ్ లో ఉన్నప్పుడు వ్యాపారం వేగంగా ఎదుగుతుంది. కానీ మందగమనంలో ఉన్నప్పుడు కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అందువల్ల Inflation పెరుగుతుంది. వడ్డీ రేట్లు పెరుగుతాయి. నిరుద్యోగ స్థాయి పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి రేటు పెరగడం జరుగుతుంది. ఇవన్నీ వ్యాపార స్వభావాన్ని మార్చేస్తాయి. ఉదాహరణకు కరోనా సమయంలో చాలా మంది రిటైల్ వ్యాపారాలు మూతపడ్డాయి. కానీ ఆన్‌లైన్ డెలివరీ సర్వీసులు మాత్రం వేగంగా విస్తరించాయి.

2. Technological Advancement : నూతన సాంకేతికతలు వ్యాపార మోడళ్లను మార్చేస్తాయి. నేడు ఉన్న డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, మొబైల్ యాప్స్. ఈ టెక్నాలజీలు వ్యాపారం నడిపే తీరును పూర్తిగా మార్చేశాయి. ఉదాహరణకు ఓలా, ఉబెర్ వంటి సంస్థలు సాంకేతికత ఆధారంగా ట్యాక్సీ మార్కెట్‌ను రీడిజైన్ చేశాయి.

3. Legal and Regulatory Factors : ప్రతి వ్యాపారాన్ని ప్రభావితం చేసే కొన్ని ప్రభుత్వ నిబంధనలు ఉంటాయి. వాటిలో పన్నుల విధానం, కార్మిక చట్టాలు, లైసెన్సులు & అనుమతులు వంటివి ఉంటాయి. ఇవి వ్యాపారం చేసే మార్గాన్ని నిర్ణయిస్తాయి. ఒక వ్యాపారం నిబంధనలు పాటించకపోతే జరిమానాలు, మూసివేత కూడా జరగవచ్చు.

4. Social and Cultural Factors : ప్రజల ఆలోచనా విధానం, జీవన శైలి, భాషలు, ఆచారాలు వ్యాపార తీరును ప్రభావితం చేస్తాయి. వ్యాపారం ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా మారాలి. ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో మసాలా భోజనాలు ప్రాచుర్యంలో ఉంటే, ఉత్తర భారతదేశంలో వేరే రుచులకు ప్రాధాన్యం ఉంటుంది. ఫుడ్ బిజినెస్‌లు స్థానిక అభిరుచులకు తగ్గ మార్పులు చేసుకోవాలి.

5. Competitive Environment : మార్కెట్‌లో ఎంత మంది ప్రత్యర్థులు ఉన్నారు? వాళ్లు ఏ రకంగా పని చేస్తున్నారు? అన్నదానిపైన కూడా వ్యాపారం చేసే తీరు మారుతుంది. ఎలా అంటే అధిక పోటీ ఉన్న చోట ధరలు తగ్గించాలి. సరికొత్త ఆఫర్లు ఇవ్వాలి. అలాగే కస్టమర్ సర్వీస్ ఇంప్రూవ్ చేయాలి. ఉదాహరణకు టెలికాం రంగంలో జియో వచ్చిన తరువాత, Airtel, VI లాంటి కంపెనీలు ధరలను తగ్గించి, కొత్త ప్లాన్లు అందించాయి.

6. Global Influences : గ్లోబల్ మార్కెట్‌లో జరిగే మార్పులు కూడా భారతదేశ వ్యాపారాలపై ప్రభావం చూపుతాయి. ఎలా అంటే డాలర్ మారకం రేట్లు. ఇతర దేశాల పన్ను విధానాలు. అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాలు వంటివి. ఉదాహరణకు అమెరికా వడ్డీ రేట్లు పెరిగితే, భారతదేశంలో విదేశీ పెట్టుబడులు తక్కువవుతాయి. దీని వల్ల స్టాక్ మార్కెట్లు పడిపోతాయి.

చివరగా ఒక వ్యాపారం ఎలా నడుస్తుంది అనే విషయంలో పై అంశాలన్నీ ఒకదానితో ఒకటి కలిసివుంటాయి. సాంకేతికత, ఆర్థిక పరిస్థితులు, చట్టాలు, పోటీ, ప్రజల అభిరుచులు. ఇవన్నీ కలిసి వ్యాపారం చేసే తీరు, లక్ష్యం, వ్యూహాలు నిర్ణయిస్తాయి. మీరు వ్యాపారం ప్రారంభించాలనుకుంటే లేదా ఇప్పటికే చేస్తున్నా, ఈ అంశాలను తెలుసుకోవడం వల్ల మంచి స్ట్రాటజీ రూపొందించగలుగుతారు. మార్కెట్‌కు తగ్గ మార్పులు చేయగలుగుతారు. పటిష్టమైన స్థిరమైన వ్యాపారం నిర్మించగలుగుతారు.

Crafting a Nature of Business Statement

ఒక సరైన Nature of Business స్టేట్‌మెంట్‌లో ఈ అంశాలు ఉండాలి. మీ ప్రొడక్ట్ లేదా సర్వీస్ గురించి స్పష్టత ఉండాలి. మీ బిజినెస్ యొక్క టార్గెట్ ఏంటో ఆ గ్రూప్ ని మాత్రమే టార్గెట్ చేయండి. అలాగే యునిక్ సెల్లింగ్ పాయింట్ (USP) కూడా ఉండాలి. ఉదాహరణకు మేము సహజమైన, పర్యావరణహిత శుభ్రతా ఉత్పత్తులు తయారు చేసి, హెల్త్ కేర్‌పై శ్రద్ధ పెట్టే కస్టమర్లకు అందిస్తున్నాం అని చెప్పవచ్చు. ఇంకొక ఉదాహరణ చూస్తే మేము విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాం అని కూడా స్పష్టంగా ఉండాలి.

Real-World Examples

1. Apple Inc : వ్యాపార స్వభావం (Nature) – టెక్నాలజీ కంపెనీ. ప్రధాన కార్యకలాపాలు – ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల డిజైన్, తయారీ చేయడం మరియు విక్రయించడం. సాఫ్ట్‌వేర్ సేవలు కూడా అందిస్తుంది (iOS, iCloud, App Store). న్యాయ రూపం – కార్పొరేషన్. పబ్లిక్ కంపెనీ షేర్ల ద్వారా నిధుల సేకరణ జరుగుతుంది. పరిశ్రమ – సమాచార సాంకేతికత (Information Technology). యాపిల్ సంస్థ తన ప్రత్యేకమైన డిజైన్, అధిక నాణ్యత, వినియోగదారులకు విశ్వసనీయతతో ప్రపంచవ్యాప్తంగా తన మార్కెట్‌ను నిర్మించుకుంది. ఇది ఒక లాభదాయకమైన వ్యాపారం. టెక్ రంగంలో ఉన్నవారికి ఇది మంచి ఉదాహరణ.

2. Tata Motors : భారతదేశపు ఆటోమొబైల్ దిగ్గజం. వ్యాపార స్వభావం – ఆటోమొబైల్ తయారీ సంస్థ. కార్యకలాపాలు – కార్లు, బస్సులు, ట్రక్కులు, కమర్షియల్ వాహనాలు తయారీ మరియు విక్రయం. న్యాయ రూపం – పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. పరిశ్రమ – ఆటోమొబైల్ పరిశ్రమకు చెందినది. టాటా మోటార్స్ అనేది భారతదేశంలో స్థాపించి, అంతర్జాతీయంగా విస్తరించిన బహుళజాతి కంపెనీ. ఇది దేశీయ అవసరాలను తీర్చడంలో పాటు ప్రపంచ మార్కెట్‌లో పోటీ పడుతుంది. దీని వ్యాపార స్వభావం తయారీ ఆధారితంగా ఉంటుంది.

3. Infosys : ఐటీ సేవల కంపెనీ. వ్యాపార స్వభావం – సాఫ్ట్‌వేర్ మరియు కన్సల్టింగ్ సేవల సంస్థ. కార్యకలాపాలు – కస్టమర్లకు సాఫ్ట్‌వేర్ డెవెలప్, బిజినెస్ కన్సల్టింగ్, డిజిటల్ సేవల ప్రొవైడింగ్. న్యాయ రూపం – పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. పరిశ్రమ – ఐటీ సేవలు (Information Technology Services). ఇన్ఫోసిస్ భారతదేశంలో స్థాపించబడిన కంపెనీ అయినా, ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తుంది. దీని వ్యాపార స్వభావం సర్వీస్ బేస్డ్ మోడల్. ఇది ముఖ్యంగా విదేశీ క్లయింట్లకు ఐటీ సేవలు అందించి ఆదాయం పొందుతుంది.

4. Amul : డైరీ ఉత్పత్తుల కంపెనీ. వ్యాపార స్వభావం – కోఆపరేటివ్ సంస్థ. కార్యకలాపాలు – పాలు, పెరుగు, చీజ్, ఐస్‌క్రీమ్ వంటి డైరీ ఉత్పత్తుల తయారీ మరియు విక్రయం. న్యాయ రూపం – సహకార సంస్థ (Cooperative Society). పరిశ్రమ – డైరీ పరిశ్రమ (Dairy Industry). అమూల్ అనేది సహకార వ్యవస్థకు ఓ చక్కటి ఉదాహరణ. ఇది రైతులకు మంచి ఆదాయం ఇవ్వడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన డైరీ ఉత్పత్తులు అందిస్తుంది. వ్యాపార స్వభావంగా చూస్తే, ఇది సామూహిక భాగస్వామ్యంతో నడిచే సంస్థ.

5. Flipkart : ఈ-కామర్స్ కంపెనీ. వ్యాపార స్వభావం – ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫారమ్. కార్యకలాపాలు – వినియోగదారులకు ఆన్‌లైన్ ద్వారా ఉత్పత్తుల విక్రయం. న్యాయ రూపం – ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. పరిశ్రమ – ఈ-కామర్స్ (E-commerce). ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు మార్గం వేసిన ప్రముఖ సంస్థ. దీని వ్యాపార స్వభావం పూర్తిగా డిజిటల్. ఇది మిగతా కంపెనీలకు వ్యాపార మోడల్ పరంగా మంచి ఆదర్శం అని చెప్పవచ్చు.

ఒక వ్యాపారం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం అనేది వ్యాపార ప్రారంభదశలోనే కాదు, అది ఎదుగుతున్న ప్రతి దశలోనూ చాలా అవసరం. వ్యాపారం ఏ రంగానికి సంబంధించినది? ఎలాంటి సేవలు లేదా ఉత్పత్తులు అందిస్తోంది? దాని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఇవన్నీ స్పష్టంగా తెలిసినప్పుడు మనం వ్యూహాత్మకంగా ఆలోచించగలము, సరిగ్గా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్లగలము. ఒక మంచి వ్యాపారం అర్థవంతమైన లక్ష్యం, ఖచ్చితమైన సేవలు లేదా ఉత్పత్తులు, సరైన మార్కెట్ గుర్తింపు మరియు బలమైన వ్యూహాలతో నిర్మించబడుతుంది. మీరు వ్యాపార యజమానిగా, ఉద్యోగిగా, లేదా పెట్టుబడిదారుగా ఉండినా, వ్యాపారం యొక్క స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలరు. దీని వల్ల వ్యాపార విజయం, సంపద సృష్టి మరియు స్థిరమైన అభివృద్ధి సాధ్యపడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే వ్యాపారం ఏమి చేస్తుందో, ఎందుకు చేస్తుందో, ఎవరికి చేస్తుందో – ఇవన్నీ అర్థం చేసుకోవడమే వ్యాపారం స్వభావాన్ని అర్థం చేసుకోవడం. ఇది మీ విజయానికి బలమైన పునాది వేస్తుంది.

Join us on Telegram Group.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *