Understanding Basic Business Terms: A Glossary for Beginners

Understanding Basic Business Terms A Glossary for Beginners
వ్యాపారం యొక్క ప్రాథమిక అవగాహన

వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న చాలా మంది కొత్త వాళ్లకు అందులో ఉన్న పదాలు అర్థం కాకపోవడం వల్ల ఇబ్బందికి గురవుతారు. అలాగే ఇంతకు ముందే వ్యాపారం మొదలు పెట్టిన వాళ్లకు కూడా ఇప్పుడు చెప్పబోయే పదాలకు అర్థం దాదాపు తెలీకపోవచ్చు. ఎందుకంటే వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటారే గానీ వాటి అర్థం తెలియాలని రూలేం లేదు. కాబట్టి ఆ పదాల అర్థం తెలియక వ్యాపారాన్ని రిస్క్ లో పెట్టేస్తుంటారు. ఇప్పటికైనా తెలుసుకొని వ్యాపారాన్ని వృద్ధిలోకి తెచ్చుకోండి. కొత్తవారు అయితే ఈ పదాలకు అర్థం కచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ల వ్యాపారం మంచి అభివృద్ధి పథం వైపు వెళ్తుంది. దాంతో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే పదాలు చాలా సులభంగా గుర్తుపెట్టుకునేలా ఉదాహరణలతో సహా వివరించడం జరిగింది.

1). Entrepreneur (వ్యాపారవేత్త)

ఒక కొత్త ఆలోచనతో వ్యాపారాన్ని సృష్టించి మనమధ్య ఉన్న సమస్యనైనా లేక కొత్త సమస్యనైనా పరిష్కరించటం. ఎలాంటి నష్టాలు రాకుండా దానిని మేనేజ్ చేయడం. రిస్క్ తీసుకున్నా కానీ Risk-Reward మాదిరి మంచిగా లాభాల బాటలో ఉంచడం. ఉదాహరణకు మనం ఆపిల్ సంస్థ CEO స్టీవ్ జాబ్స్ ను తీసుకుంటే ఆయన తన సంస్థను ఒక చిన్న గ్యారేజ్ నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ మొదలుపెట్టాం అని కాదు. ఎలాంటి ఆలోచనతో మొదలుపెట్టాం అనేదే ముఖ్యం. తనకున్న ఆ చిన్న ఆలోచనతో నేడు ఎంతో గొప్ప స్థానానికి చేరుకోవడం జరిగింది.

2). Business Plan (వ్యాపార ప్రణాళిక)

వ్యాపార ప్రణాళిక అనేది, వ్యాపారం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? తీసుకోవాల్సిన మెళకువలు ఏంటి? అలాగే వ్యాపారంలో విజయం సాధించాలంటే కావాల్సిన అన్నింటిని క్షుణ్ణంగా వివరించే అధికారిక పత్రం అని చెప్పవచ్చు. ఇది మీ వ్యాపారానికి ఒక రోడ్ మ్యాప్ లాగా పనిచేస్తుంది. ఉదాహరణకు మీరు ఏదైనా రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారని ఊహించుకోండి. మీ దగ్గర ఎలాంటి మ్యాప్ మరియు GPS లేకపోతే అప్పుడు ఏ దారిలో వెళ్లాలో తెలియక తికమక పడతారు. అదేవిధంగా మీ దగ్గర వ్యాపార ప్రణాళిక లేకపోతే కూడా వ్యాపారం అనేది గందగోళంగా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఒక మంచి వ్యాపార ప్రణాళికను రూపొందించుకోండి.

3). Market Research (మార్కెట్ పరిశోధన)

మార్కెట్ ను పరిశోధించే సమయంలో ముఖ్యంగా కస్టమర్ యొక్క ప్రాధాన్యతను బట్టి వారి అవసరాలు ఏంటి? ఒకవేళ వాళ్లకు కావాల్సిన ప్రొడక్ట్ లేదా సర్వీస్ ని కనుక్కుంటే దానికి పోటీ ఎలా ఉంటుంది. ఇలాంటి అన్ని విషయాలను ముందుగానే పసిగట్టాలి. ఉదాహరణకు మనం ఒక కొత్త కాఫీ షాప్ ని ప్రారంభిస్తున్నాం అనుకోండి. అప్పుడు ఆ కాఫీ షాప్ ని ఎలాంటి ప్రదేశంలో ప్రారంభిస్తే గిరాకీ ఉంటుంది ? అలాగే ఏదైనా ప్రదేశంలో ప్రారంభిస్తే అక్కడి స్థానిక ప్రజలు ఏ రకమైన కాఫీ ని ఇష్టపడతారు? ఇలాంటి విషయాలను ముందుగానే సర్వే చేసి కస్టమర్ల అభిరుచులకు తగినట్టుగా చేస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

4). Revenue (రాబడ)

మనం చేసే అన్ని అమ్మకాలపై వచ్చే డబ్బుని ఆదాయం అంటారు. ఇందులోనే ఖర్చులు కూడా ఉంటాయి. ఇదే మన వ్యాపారంలో ప్రవహించే ఆదాయం. ఉదాహరణకు మీకు ఒక బేకరీ షాప్ ఉందనుకోండి. ఒక నెల పాటు కేక్ లను మరియు ఇతరత్రా స్వీట్స్ అమ్మితే, వాటిపై వచ్చే మొత్తం రాబడి మీ ఆదాయం. ఈ రాబడిని బట్టి మీ వ్యాపారం లాభాల్లో ఉందా లేక నష్టాల్లో ఉందా అనేది అర్థం అవుతుంది.

5). Profit (లాభం)

ప్రతి అమ్మకం పై వచ్చే ఆదాయం లోనుంచి ఖర్చులన్నీ తీసివేయగా మిగిలేదే లాభం. ఇదే మీ కష్టానికి మిగిలే ఫలితం. ఉదాహరణకు పైన బేకరీనే తీసుకుందాం. మీ బేకరీకి Rs 50,000 ఆదాయం వచ్చిందనుకోండి అందులో షాప్ అద్దెలాంటి ఇతరత్రా ఖర్చులు Rs 30,000 తీసివేద్దాం. ఇప్పుడు మీ లాభం Rs 20000. ఇక్కడే తెలుస్తుంది మీ వ్యాపారం విజయవంతంగా జరుగుతుందా లేదా అనేది.

6). Startup (స్టార్టప్ )

స్టార్టప్ అనేది కొత్తగా స్థాపించబడిన వ్యాపారం. ఇది వినూత్నమైన మరియు అధికంగా వృద్ధిచెందే సామర్థ్యం కలిగిన ఆలోచన. ఉదాహరణకు ప్రజలు తమ సమయాన్ని క్వాలిటీ గా ఉపయోగించుకోవడానికి ఒక మంచి అప్లికేషన్ ఉంటే బాగుంటుంది కదా. ఇదే ఐడియాతో నేను ఒక మంచి అప్లికేషన్ ని డిఫరెంట్ గా స్టార్ట్ చేయవచ్చు. అయితే ఈ ఆప్లికేషన్ ని అభివృద్ది చేయడానికి తగినన్ని నిధులు కావాల్సి ఉంటుంది.

7). Networking (నెట్వర్కింగ్)

నెట్వర్కింగ్ వల్ల అందరితో సంబంధాలు ఏర్పరచుకుంటారు. అలాగే గొప్ప గొప్ప వ్యక్తులతో మనకు కావాల్సిన సమాచారాన్ని లేదా సహాయ సహకారాలు అందిపుచ్చుకోవడం జరుగుతుంది. ఇది మనకు మరియు మన వ్యాపారానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదాహరణకు మీ ప్రాంతంలో ఏదైనా వ్యాపారానికి సంబంధించిన మీటింగ్ జరిగితే, అందులో మీరు కట్చితంగా పాల్గొనండి. ఎందుకంటే ఆ మీటింగులో కొత్త విషయాలు తెలుస్తాయి. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అప్పుడు అక్కడ మీకోక కొత్త అవకాశం లభిస్తుంది.

8). Brand (బ్రాండ్)

బ్రాండ్ అంటే మీ సంస్థ యొక్క పేరైనా కావచ్చు లేదా మీ సంస్థ లోగో అయినా కావచ్చు. ఇది మీ వ్యాపారం యొక్క గుర్తింపును సూచిస్తుంది. ఉదాహరణకు మీరొక ఫుడ్ బిజినెస్ చేస్తున్నారనుకోండి. ఆ ఫుడ్ బిజినెస్ లో మంచి క్వాలిటీ రుచిని కస్టమర్స్ కి ఇచ్చినట్లయితే వాళ్ళు మీ ప్రొడక్ట్ ని చూడకుండానే మీ ఫుడ్ రుచి చూసి, మీ కంపెనీ పేరు ఇట్టే చెప్పేస్తారు. ఎందుకంటే మీ ఫుడ్ రుచి వాళ్లకు తెలుసు కాబట్టి మీ కంపెనీ ఇట్టే గుర్తొస్తుంది. అదీ అసలైన బ్రాండ్ అంటే.

9). Target Audience (టార్గెట్ ఆడియన్స్)

: ఒక సమూహం గల వ్యక్తులకు మీ వ్యాపార ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ ని సేల్ చేయడం. ఉదాహరణకు మీరొక ఎనర్జీ డ్రింక్ ప్రొడక్ట్ ని సేల్ చేయలనుకున్నప్పుడు, మీ యొక్క టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఎవరైతే ఈ ప్రొడక్ట్ పై ఆసక్తి కలిగి ఉంటారో వాళ్లకు ఉపయోగపడుతుంది. ఈ ఎనర్జీ డ్రింక్ ఎక్కువగా ఫిట్నెస్ మరియు స్పోర్ట్స్ ఆడే వ్యక్తులకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు వాళ్లనే ఎక్కువగా టార్గెట్ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా వాళ్లే మీ టార్గెట్ ఆడియన్స్ కాబట్టి.

10). Cash Flow (నగదు ప్రవాహం)

మీ వ్యాపారంలో లో జరిగే అన్ని డబ్బు వ్యవహారాలను నగదు ప్రవాహం అంటారు. ఉదాహరణకు మీరు ఒక కాఫీ షాప్ నడుపుతున్నావనుకోండి. ఈ కాఫీ షాప్ లో మీరొక Rs 10,000 ఇన్వెస్ట్ చేస్తే, పాలు ఖర్చులు మరియు మిగతా వాటర్ ఖర్చులన్నీ Rs 5,000 అయ్యాయనుకోండి. అప్పుడు మీరు మిగతా Rs 5,000 లాభం పొందినట్లు. కాబట్టి మీ కాఫీ షాప్ మంచిగా నడుస్తుందని అర్థం. ఇలా జరిగే ఈ డబ్బు ప్రవాహాన్ని నగదు ప్రవాహం అంటారు.

11). Investment (పెట్టుబడి)

మీ డబ్బుని పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఒక నిర్ణీత వ్యవధిలో ఆస్తిపై పెట్టుబడి పెట్టడం. ఉదాహరణకు లైఫ్ ఇన్సూరెన్స్, పదవీ విరమణ, మ్యుచివల్ ఫండ్స్ వంటి ఆస్తులపై పెట్టుబడి పెట్టడం. మీరొక కంపెనీలో 10,000 Rs పెట్టుబడి పెట్టినట్లయితే కొంత నిర్ణీతకాల వ్యవధిలో లాభం పొందడం.

12). Liability (బాధ్యత)

ఒక వ్యక్తి లేదా కంపెనీ కార్యకలాపాల కోసం ఇంకొక కంపెనీ దగ్గర తెచ్చుకునేదే రుణం. దీనినే అప్పు అని కూడా అంటారు. ఈ రుణం కంపెనీ విలువకు తగ్గట్టుగా తెచ్చుకోవాలి. అంతేగానీ ఎక్కువగా తెచ్చుకుంటే నష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. దానికి మీరే భాద్యత వహించాల్సి వస్తుంది. ఉదాహరణకు బేకరీ షాప్ ని తీసుకుందాం. మీ బేకరీ షాప్ చాలా మంచి లాభాల్లో ఉంది. అప్పుడు ఇంకా మంచి బిజినెస్ చేయాలని ఇదే బేకరీ లో ఎక్కువగా అమ్ముడుపోయే వస్తువుపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలను పొందాలనుకుంటున్నారు. అయితే అప్పుడు ఆ వస్తువు యొక్క ముడిసరుకు కొనుక్కోవడానికి తగినన్ని నిధులు మీ దగ్గర లేకపోతే, మీరు ఇంకొక వ్యక్తి దగ్గరో లేక కంపెనీ దగ్గరో నిధులు తెచుకోవాల్సి వస్తుంది. దీనినే అప్పు లేదా రుణం అంటారు.

13). Assets (ఆస్తులు)

ఆస్తులు ఏంటంటే మీ వ్యాపారమైనా కావచ్చు లేదా నగదు డబ్బు, రియల్ ఎస్టేట్, మరియు విలువైన వస్తువులు ఉండవచ్చు. ఉదాహరణకు బేకరీ షాప్ ని తీసుకుంటే అందులో ఉన్న ఫర్నిచర్ మరియు విలువైన వస్తువులే మీ ఆస్తి. మీకు ఎంత ఎక్కువ ఆస్తి ఉంటే, అంత ఎక్కువ విలువ ఉంటుంది. కాబట్టి ఈ ఆస్తిని బట్టే మీ వ్యాపారానికి విలువ ఉంటుంది.

14). Supply and Demand (సరఫరా మరియు డిమాండ్)

కస్టమర్ల డిమాండ్ కి తగ్గట్టుగా మన ప్రొడక్ట్స్ ని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎండాకాలంలో ఐస్ క్రీమ్స్ కి చాలా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఎండాకాలంలో వేడికి అందరూ చల్లటి పదార్థాలను తీసుకుంటారు. అందువల్ల ఆ సమయంలో మీ ప్రాంతంలో ఉన్న షాప్ కి సరైన ఐస్ క్రీమ్ సరఫరా ఉన్నట్టయితే, వ్యాపారం బాగా జరుగుతుంది. సరఫరా సరిగా లేకపోతే మీరు మీ వ్యాపారాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అందుకే డిమాండ్ కి తగ్గట్టుగా సరఫరా ఉండాలి.

15). Return on Investment (ROI) (పెట్టుబడిపై రాబడ)

మొదట్లో మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? దానిపై మీకు ఇప్పుడు ఎంత రాబడి వచ్చింది? అనేదే పెట్టుబడి పై వచ్చే రాబడి. ఈ లెక్కలను కనుక్కోవడానికి ఒక ఫార్ములా కూడా ఉంది. అదేంటంటే (నికరలాభం/పెట్టుబడి వ్యయం)×100. ఉదాహరణకు మీరు ప్రకటనల కోసం Rs 200 ఖర్చు చేసినట్టయితే, ఆ తర్వాత ప్రకటనల ద్వారా Rs 1,000 సంపాదించారనుకోండి. అప్పుడు మీకు వచ్చే లాభం Rs 800 అవుతుంది. అప్పుడు మీకు 400% రిటర్న్స్ వచ్చినట్టు. అర్థం కాకపోతే ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ నికరలాభం అంటే, ప్రకటనల ద్వారా వచ్చిన మొత్తం అమౌంట్ లో నుంచి, మనం మొదట్లో పెట్టిన ఖర్చు తీసేస్తే వచ్చేది. 1,000-200 = “Rs 800”. ఇప్పుడు మనం ఫార్ములాను అప్లై చేద్దాం. నికరలాభం(800 Rs) / పెట్టుబడి వ్యయం(200 Rs)×100 = 400%. అర్థం కాకపోతే మళ్లీ ఒకసారి చదివి పేపర్ పై ప్రాక్టీస్ చేస్తే సులభంగా వస్తుంది.

వ్యాపారంలో ఉండే ఈ ముఖ్యమైన పదాలను మీరు నేర్చుకున్నట్టయితే భవిష్యత్ లో చాలా బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఎలాంటి బిజినెస్ అయినా ఇలాంటి పదాలు ఖచ్చితంగా ఉంటాయి. పైన మనం చెప్పుకొన్న ప్రతి ఒక్క పదం చాలా ప్రాముఖ్యం. కాబట్టి వీటిని నేర్చుకొని మిమ్మల్ని మీరు ఇంకా అభివృద్ధి చేసుకోండి. వీటిని నేర్చుకోవడం వల్ల మీరు సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకుంటారు. దాంతో మీ వ్యాపారాన్ని అబ్బివృద్ది పథం వైపు నడిపిస్తారు.

Join us on Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *