Understanding Credit Score & How to Improve It

ఈ రోజుల్లో మనం ఫైనాన్స్ కి సంబంధించిన క్రెడిట్ కార్డు లేదా బ్యాంక్ లోన్ సదుపాయం తీసుకోవాలంటే, ముందుగా చూసేది క్రెడిట్ స్కోర్. ఇది మనం అప్పు తీసుకుని, తిరిగి చెల్లించే నైపుణ్యాన్ని తెలిపే స్కోర్.
ఒకవేళ మీ ఆదాయం బాగుండి, మీ ఉద్యోగం స్థిరంగా ఉన్నా కూడా — మీ క్రెడిట్ స్కోర్ తక్కువైతే బ్యాంకులు లోన్ ఇవ్వడంలో వెనకడుగు వేస్తాయి.

అందువల్ల Understanding Credit Score & How to Improve It అనేది ఫైనాన్సియల్ గా ముందుకు సాగాలనుకునే వ్యక్తి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం. క్రెడిట్ స్కోర్ అనేది మీ లోన్, క్రెడిట్ కార్డ్ అప్రూవల్స్‌కి గేమ్ చేంజర్ లాంటిది. ఈ ఆర్టికల్ లో మీరు సింపుల్ స్టెప్స్ ద్వారా క్రెడిట్ స్కోర్‌ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నారు.

క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్ వంటి ఫైనాన్సియల్ సర్వీసెస్ తీసుకోవాలన్నా ముందుగా బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు చూసేది మీ క్రెడిట్ స్కోర్. క్రెడిట్ స్కోర్ అనేది 300 నుండి 900 మధ్య ఉండే స్కోర్, ఇది మీరు గతంలో అప్పు తీసుకున్న విధానం, చెల్లింపుల నైపుణ్యం, వడ్డీ చెల్లింపులు, మరియు క్రెడిట్ కార్డ్ వాడకం ఆధారంగా లెక్కించబడుతుంది. సాధారణంగా 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే అది మంచి స్కోర్‌గా పరిగణించబడుతుంది.

Understanding Credit Score

ఇప్పుడు మీరు పూర్తిగా తెలుసుకోబోతున్న విషయాలు:

  • అసలు క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి?
  • ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అనేది తీసుకోవాలి?
  • మన సిబిల్ స్కోర్ తక్కువైతే ఏమవుతుంది?
  • దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా?
  • సరైన అలవాట్లు, మిస్టేక్స్ & టిప్స్

What is a Credit Score?

క్రెడిట్ స్కోర్ అనేది మూడు అంకెల నెంబర్, ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఇది మన క్రెడిట్ హిస్టరీ ఆధారంగా తయారవుతుంది. అంటే మనం గతంలో తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు, వాటి చెల్లింపుల తీరు మొదలైనవి. ఒక రకంగా చెప్పాలంటే ఇది రిపోర్ట్ కార్డ్ లాంటిది. మీరు అప్పు తీసుకున్నప్పుడు లేదా క్రెడిట్ కార్డు వాడినప్పుడు ఎంత బాధ్యతగా మెలుగుతున్నారో ఇది తెలియజేస్తుంది.

Score Range Breakdown:

  • 750 – 900: అద్భుతం – అన్ని బ్యాంకులు సులభంగా ఇస్తాయి
  • 700 – 749: చాలా బాగుంది – లోన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
  • 600 – 699: పర్లేదు – కానీ వడ్డీ ఎక్కువగా ఉంటుంది.
  • 300 – 599: తక్కువ – లోన్ తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Why is Credit Score Important?

ఒక మంచి క్రెడిట్ స్కోర్ మీ యొక్క ఫైనాన్సియల్ ఫ్యూచర్ ని మార్చగలదు. మీరు ఆన్‌లైన్ ద్వారా లోన్ అప్లై చేసినా, క్రెడిట్ కార్డు తీసుకున్నా, వెంటనే మీ క్రెడిట్ స్కోర్‌ను బ్యాంకులు చెక్ చేస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నట్టయితే తొందరగా అప్రూవ్ అవుతుంది. అలాగే మనపై మంచి నమ్మకం ఉంటుంది. కాబట్టి వడ్డీ కూడా తక్కువ ఉంటుంది.

క్రెడిట్ స్కోర్ ఉపయోగపడే సందర్భాలు:

  • పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సమయంలో
  • క్రెడిట్ కార్డ్స్ అప్రూవల్ సమయంలో
  • కమిషన్‌లెస్ (low-interest) ఆఫర్స్ సమయంలో
  • పనిలో ప్రమోషన్‌లు (ఫైనాన్స్ రోల్స్ లో క్రెడిట్ స్కోర్ చూసే అవకాశం ఉంటుంది)
  • ఫోన్ EMI, బై నౌ పే లేటర్ (BNPL)ప్లాన్‌లు సమయంలో

5 Major Factors That Impact Your Credit Score

1. Payment History(35%): ఇక్కడ ప్రధానంగా టైమ్ టు టైమ్ బిల్స్ కడుతున్నారా లేదా అనేదే ఇంపార్టెంట్ విషయం. ఒక్క లేట్ పేమెంట్ చేసినా కూడా మీ క్రెడిట్ స్కోర్‌ అనేది తగ్గిపోతుంది.

2. Credit Utilization Ratio (30%): మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డు లిమిట్‌లో ఎంత వాడుతున్నారో చూసి స్కోర్‌ను నిర్ణయిస్తారు. ఉదాహారణకు: మీ లిమిట్ ₹1,00,000 అయితే, నెలకు ₹30,000 లోపు వాడితే మంచిది.

3. Credit History Length (15%): మీరు ఎప్పటి నుంచి క్రెడిట్ ఉపయోగిస్తున్నారో చూస్తారు. పాత క్రెడిట్ హిస్టరీ ఉన్నవాళ్ల క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటుంది.

4. New Credit Inquiries (10%): ఈ మధ్యకాలంలో ఎక్కువగా లోన్లు అప్లై చేయడం కూడా క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది.

5. Types of Credit Used (10%): బ్యాంకు లోన్స్, క్రెడిట్ కార్డ్స్ రెండూ సమంగా వాడడం కూడా పాజిటివ్ గా ఇంపాక్ట్ చూపుతుంది.

Common Mistakes That Lower Your Credit Score

  • బిల్స్ టైమ్ టు టైమ్ కట్టకపోతే అది లేట్ పేమెంట్ గా రిజిస్టర్ అవుతుంది.
  • లిమిట్ కి మించి ఎక్కువగా క్రెడిట్ వాడితే Over Utilization గా పరిగణించబడుతుంది.
  • పాత క్రెడిట్ కార్డులు క్లోజ్ చేయడం వల్ల కూడా స్కోర్‌ తగ్గిపోతుంది.
  • అలాగే చిన్నపాటి తప్పులు మీ క్రెడిట్ రిపోర్ట్‌లో నమోదైతే, అవి సరిచేయకపోతే స్కోర్ తగ్గుతుంది.

మీ క్రెడిట్ కార్డ్స్, లోన్ EMIలు లేదా ఇతర ఫైనాన్షియల్ బిల్స్‌ని టైమ్‌ టు టైమ్ కట్టకపోవడం వల్ల లేట్ పేమెంట్ క్రింద రిజిస్టర్ అవుతుంది. దీంతో మీ క్రెడిట్ కార్డు రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక్కసారి మిస్ చేసినా అది మీ స్కోర్‌ను 50 నుండి 100 పాయింట్లు వరకు తగ్గిస్తుంది. సరైన సమయానికి కట్టకపోతే అది డిఫాల్ట్ గా మరింత నష్టాన్ని కలిగిస్తుంది. ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే అన్ని బిల్స్‌కి ఆటో డెబిట్ సెట్ చేయడం లేదా మీ కాలెండర్‌లో రిమైండర్ పెట్టుకోవడం ద్వారా టైమ్‌కు పేమెంట్ చేస్తారు. ఉదాహరణకు మీకు ₹1,00,000 క్రెడిట్ లిమిట్ ఉంటే, ఆ మొత్తాన్ని వాడుకుంటే అది Over Utilization అంటారు. సాధారణంగా 30% లోపు వాడటం(అంటే ₹30,000 లోపు) బాగుంటుంది. కాబట్టి లిమిట్‌ను 30% లోపు వాడేందుకు ప్రయత్నించండి. అవసరమైతే మరో క్రెడిట్ కార్డు తీసుకొని ఖర్చును విభజించండి. అవసరం లేకపోతే వదిలెయ్యండి.

చాలామంది ఎక్కువ సంవత్సరాలుగా వాడిన పాత క్రెడిట్ కార్డులను అవసరం లేదని క్లోజ్ చేస్తుంటారు. కానీ అది మీ క్రెడిట్ స్కోర్‌పై చాల పెద్ద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఓల్డ్ అకౌంట్స్ మీ క్రెడిట్ హిస్టరీ పొడవుని సూచిస్తాయి. ఈ పొడవైన హిస్టరీ మీరు ఓల్డ్ కస్టమర్ అనే నమ్మకాన్ని చూపుతుంది. అవసరమైన సర్వీస్ చార్జెస్ లేకపోతే పాత క్రెడిట్ కార్డులను కొనసాగించండి. కనీసం కొన్ని నెలలకొకసారి వాడి, టైమ్‌కి బిల్స్ కడుతూ ఉండండి.

ఎప్పుడో చెల్లించిన బిల్ లేట్ పేమెంట్ గా నమోదవ్వడం, తీసుకోనటువంటి లోన్ నమోదు కావడం, మీ పర్సనల్ విషయాలు తప్పుగా నమోదు అవ్వడం చిన్న పొరపాట్లు కూడా క్రెడిట్ స్కోర్ ని తగ్గిస్తాయి. మీ క్రెడిట్ కార్డు లో తప్పుగా ఉందని తెలిసినా అలాగే ఉంటే, లాంగ్ టర్మ్ లో చాల సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీ క్రెడిట్ రిపోర్ట్‌ను త్రైమాసికంగా లేదా కనీసం ఏడాదికోసారి చూసి తప్పులు ఉంటే సంబంధిత క్రెడిట్ బ్యూరోకు అప్పీల్ చేయండి. CIBIL, Experian, CRIF Highmark వంటి బ్యూరోలు ఆన్‌లైన్‌లో రిపోర్ట్ సరిచేయడానికి అవకాశమిస్తాయి.

How to Check Your Credit Score for Free in India

భారతదేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి సంవత్సరం ఒక్కసారి ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేయవచ్చు. చెక్ చేసుకోవడానికి క్రింద కొన్ని వెబ్‌సైట్లు ఇవ్వడం జరిగింది.

  • CIBIL
  • Experian
  • CRIF Highmark
  • Equifax India

యాప్స్ ద్వారా చెక్ చేయాలనుకుంటే:

  • OneScore App
  • Paytm
  • CRED
  • BankBazaar

How to Improve Your Credit Score (Fast & Effectively)

1. ఇందులో మొదటి మెట్టు ఏంటంటే, టైమ్ టు టైమ్ బిల్స్ పే చేయడం.
2. 30% లోపు క్రెడిట్ వాడకాన్ని పరిమితం చేయండి.
3. పాత క్రెడిట్ కార్డులను ఆపేయకుండా లాగే కొనసాగించండి.
4. మిస్టేక్స్ ఉంటే వెంటనే డిస్ప్యూట్ చేసి సరిచేసుకోండి.
5. ఒకేసారి 2 లేదా 3 కంటే ఎక్కువ లోన్లు అప్లై చేయకండి.
6. వివిధ రకాల లోన్స్ (హోం, పర్సనల్) వాడండి.
7. అనవసరమైన ఖర్చులకు క్రెడిట్ కార్డ్ వాడకండి.

Helpful Tools to Monitor & Boost Your Credit
CreditMantri, OneScore App: ఫ్రీ క్రెడిట్ కార్డ్ ట్రాకింగ్ కోసం ఈ టూల్స్ ఉపయోగించండి.
CRED App – టైమ్ టు టైమ్ బిల్ పేమెంట్స్ కోసం ఈ యాప్ వాడండి.
BuddyScore – క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ యాప్ వాడండి.

7 Financial Habits of Highly Successful People

(FAQs)

Q: క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది?
A: మీరు డిసిప్లిన్‌గా ఉండి, పేమెంట్స్ టైమ్ టు టైమ్ కడితే, 3 నుంచి 6 నెలల్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది.
Q: క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తే కూడా తగ్గుతుందా?
A: మీకు మీరుగా చెక్ చేస్తే తగ్గదు. ఇది soft inquiry అని పరిగణిస్తారు.
Q: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా లోన్ దొరుకుతుందా?
A: కొన్ని NBFCలు & పర్సనల్ ఫైనాన్స్ కంపెనీలు లోన్ ఇస్తాయి, కాకపోతే వడ్డీ ఎక్కువగా ఉంటుంది.

క్రెడిట్ స్కోర్ అనేది మనకు కనిపించదు, కానీ మన ఫైనాన్సియల్ ఫ్యూచర్ ని ప్రభావితం చేస్తుంది. దీన్ని శ్రద్ధగా మేనేజ్ చేయడం మన బాధ్యత. మీరు ఇప్పుడే మొదలుపెట్టి, స్కోర్ మెరుగుపరచడం ప్రారంభిస్తే – తొందరలో మీరు పెద్ద పెద్ద లోన్లు, మంచి ఆఫర్లు, క్రెడిట్ కార్డులు పొందగలుగుతారు.

ఈ రోజుల్లో Understanding Credit Score & How to Improve It అనే విషయం మీద స్పష్టమైన అవగాహన ఉండటం చాలా అవసరం. కాబట్టి మన ఆర్థిక భద్రతకు ఇది పునాది లాంటిది. మీరు తీసుకునే ప్రతి అప్పు, క్రెడిట్ కార్డు, లేదా ఫైనాన్షియల్ విషయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారు – తక్కువ వడ్డీతో లోన్లు పొందగలుగుతారు, క్రెడిట్ కార్డ్స్ సులభంగా అప్రూవ్ చేయించుకుంటారు, మరియు ఫైనాన్సియల్ గా సెక్యూర్ లైఫ్ గడపగలుగుతారు.

Join us on Telegram Group.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *