వ్యవసాయం అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం. ఇది భారతదేశ జనాభాలో దాదాపు 60 శాతం మందికి జీవనాధారం కల్పిస్తుంది. కానీ ఈ రోజుల్లో వ్యవసాయం అనేది కేవలం పంటలు పండించడానికి మాత్రమే పరిమితం కాకూడదు. సరి కొత్త టెక్నాలజీ, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మరియు ఆరోగ్యాన్ని పట్టించుకునే వినియోగదారుల వల్ల వ్యవసాయ రంగంలో అనేక లాభదాయకమైన వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం అత్యంత లాభదాయకమైన Money Making Agriculture Business Ideas గురించి తెలుసుకుందాం. వీటిని అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్, స్థిరమైన ఆదాయం పొందే అవకాశాలను కలిగివుంటాయి.
ఉద్యోగాల కోసం పరుగులు పెడుతున్న నేటి ప్రపంచంలో ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి కానీ, ఆదాయం మాత్రం తగ్గిపోతోంది. ఎవరు చెప్పినా చెప్పకున్నా ఇవి మనం ఎదుర్కొంటున్న వాస్తవాలు. అయితే దీనికొక ప్రత్యామ్నాయ మార్గం ఉంది. అదే వ్యవసాయ రంగం.
ఆరోగ్యంతో కూడిన జీవనశైలిని కోరుకునే ప్రజల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకీ ఆహారం యొక్క డిమాండ్ పెరిగుతూనే ఉంది. ఇదే మనకు మంచి అవకాశంగా మారింది. అదేంటంటే వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చే సమయం ఇది. ఇప్పుడు వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు. ఇది ఒక మంచి వ్యాపార అవకాశం.
అందుకే గ్రామీణ యువతతో పాటు పట్టణవాసులకూ ఒక స్టార్ట్‌అప్ అవకాశంగా మారింది. తక్కువ పెట్టుబడితో, స్మార్ట్ ప్లానింగ్‌తో మరియు సరైన మార్కెట్ అవగాహనతో, మినిమమ్ నుండి మాక్సిమమ్ ఆదాయం మీరు పొందవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుత మార్కెట్‌కు తగ్గ డిమాండ్ ఉన్న వ్యాపార అవకాశాలను తెలుసుకుందాం. అలాగే తక్కువ పెట్టుబడితో లాభదాయక వ్యవసాయ వ్యాపారాలు తెలుసుకుందాం. ఇంకా ఈ బిజినెస్ కి ప్రభుత్వ సబ్సిడీలు మరియు శిక్షణలతో కూడిన మార్గాలను అన్వేషిద్దాం.
Why Start an Agriculture-Based Business?
భారతదేశ జనాభా 140 కోట్లకు పైగా ఉండటంతో, ఆహార ఉత్పత్తులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ప్రభుత్వం అందించే పలు రకాల సబ్సిడీలు, రుణాలు, మరియు స్కీమ్‌లు వ్యవసాయ వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాయి. సేంద్రియ మరియు ప్రాసెస్ చేసిన ఉత్పత్తులకు విదేశాల్లో గణనీయమైన డిమాండ్ ఉంది. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ ఎగుమతి చేసి మరింత ఎక్కువ ఆదాయం పొందవచ్చు. అలాగే డ్రోన్లు, హైడ్రోపోనిక్స్, IoT వంటి సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం మరింత ఎఫెక్టివ్ గా మారబోతోంది.
Top Agriculture Business Ideas in India
1. Organic Farming:
ఎలాంటి రసాయనాలు లేకుండా ప్రకృతిసిద్ధంగా పంటలు పండించడం. దీనినే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. ఈ బిజినెస్ ఎందుకు లాభదాయకం అంటే, ఇప్పుడున్న కలుషిత ప్రపంచంలో ఎక్కడ చూసినా కెమికల్ ఫుడ్ తీసుకుంటున్నారు. అందుకే మంచి ఆరోగ్యం కోసం సహజ సిద్ధమైన ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం.
కాబట్టి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కి డిమాండ్ ఎక్కువ. పెట్టుబడి విషయానికి వస్తే ₹1 లక్ష నుంచి ₹5 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లాభం విషయానికి వస్తే 30% నుంచి 50% వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కూరగాయలు, పప్పులు, పసుపు, అల్లం వంటి ఉత్పత్తులను పండించవచ్చు. ఒకవేళ మీరు సేంద్రియ రైతుగా సర్టిఫికేషన్ పొందితే ఇంకా ఎక్కువ ధరకు మీ పంటను అమ్ముకోవచ్చు.
2. Mushroom Farming:
మష్రూమ్ సాగు అంటే పుట్టగొడుగుల పెంపకం అని అర్థం. ఈ వ్యాపారం తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి, మంచి లాభాన్ని అందించే ఒక అద్భుతమైన ఆవకాశం ఉంటుంది. మీయొక్క లొకేషన్, పంట రకం, యంత్ర పనిముట్లు ఆధారంగా పెట్టుబడి ₹50,000 నుంచి ₹2 లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది. మష్రూమ్స్ చాలా వేగంగా పెరుగుతాయి, కావున ఎక్కువ టైమ్ కేటాయించాల్సిన అవసరం లేదు. అందువల్ల కేవలం 3 నెలల్లో ₹1.5 లక్షలు నుంచి ₹2 లక్షల వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. బటన్, ఆయిస్టర్, శిటాకే, పిచ్ వంటివి ఈ మష్రూమ్స్ పంటల్లో ముఖ్యమైన పంట రకాలు.
అలాగే హోటల్స్, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, ఆర్గానిక్ ఫుడ్ స్టోర్స్ వంటి మార్కెట్ లలో వీటిని సేల్ చేయవచ్చు. వీటినే ఎందుకు పండించాలంటే, పుట్టగొడుగులు ఆరోగ్యపరమైన పదార్థాలుగా గుర్తించబడుతున్నాయి. వీటిని ప్రాసెస్ చేసి ఉత్పత్తులను కూడా విక్రయించడం ద్వారా ఆదాయం పెరగొచ్చు. వీటికి ఎక్కువ ఉష్ణోగ్రత లేదా తక్కువ ఉష్ణోగ్రత ఉండకూడదు. ఒక సాధారణ ఉష్ణోగ్రత ఉండాలి. మరియు తేమని కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. సబ్సిడీ లేదా రుణాలను పొందాలంటే ప్రభుత్వ స్కీమ్స్ తెలుసుకోవాలి.
3. Beekeeping / Honey Production:
తేనెటీగల పెంపకం ద్వారా తేనె, బీజ్వాక్స్, ప్రోలిస్మ వంటి ప్రోడక్ట్స్ తీసుకుంటారు. ఇది ప్రకృతికి అనుకూలమైన, తక్కువ ఖర్చుతో నడిపించగల వ్యాపారం. అందరికీ ఆరోగ్యంపై అవగాహన పెరగడం వల్ల పోషకాలు ఉన్న ప్రోడక్ట్స్ కి చాలా డిమాండ్ ఏర్పడుతుంది. దాంతో తేనెకి కూడా డిమాండ్ పెరుగుతోంది. మొత్తానికి ఆర్గానిక్ ఉత్పత్తులకు అధిక ధర లభిస్తోంది. ఇక్కడ తేనెతో పాటు, ఇతర ఉత్పత్తుల ద్వారా కూడా అదనపు ఆదాయం వస్తుంది. పెట్టుబడి విషయానికి వస్తే ₹1లక్ష నుంచి 2 లక్షలు (50–100 తేనెటీగ పెట్టెలు) వరకు అవుతుంది. ఇక లాభం విషయానికి వస్తే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత, సంవత్సరానికి ₹2–3 లక్షలు వరకు ఆదాయం వస్తుంది.
వీటి మార్కెట్ ప్రధానంగా ఆర్గానిక్ స్టోర్లు, Ayurvedic & Herbal కంపెనీలు, మరియు స్థానిక మార్కెట్లు లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు. KVIC (ఖాది అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్) నుండి తగిన శిక్షణ & సబ్సిడీలు పొందవచ్చు. ఇంకా NABARD రుణ సదుపాయాలు కూడా పొందవచ్చు. ఇంకొక టిప్ ఏంటంటే, వనమూలికల పంటల దగ్గర తేనెటీగల పెంపకం చేస్తే తేనె మరింత క్వాలిటీ పెరుగుతుంది. దీంతో ధర కూడా ఎక్కువగా వస్తుంది. ఇది ఒక ప్రకృతి-ఆధారిత, ఆరోగ్యవంతమైన, మరియు పర్యావరణానికి అనుకూల వ్యాపారం. రైతులు, యువత, మరియు ఆరోగ్యప్రియులందరూ దీనిపై ఒకసారి దృష్టి పెట్టండి.
4. Dairy Farming:
పాడి పశు వ్యాపారం అనేది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో స్థిరమైన ఆదాయం కల్పించే శాశ్వతమైన వ్యవసాయ ఆధారిత వ్యాపారం. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి పాల ఉత్పత్తులకు ఎప్పటికీ మార్కెట్ లో డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇది ఆదాయానికి మంచి మార్గం. అందుకే పాడి పశు వ్యాపారం అనేది – పాలు పోసే బంగారు గాయని అంటారు.
పెట్టుబడి విషయానికి వస్తే 2–10 ఆవులు లేదా బర్రెలు కొనేందుకు ₹5–₹15 లక్షల వరకు అవుతుంది. స్టార్టింగ్ లో షెడ్ నిర్మాణం, ఆహార పదార్థాలు, వైద్య ఖర్చులు వంటి వాటికి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక లాభం విషయానికి వస్తే ఒక్క ఆవు రోజుకు 8–10 లీటర్ల పాలు ఇస్తే, నెలకు దాదాపుగా ₹10,000–₹15,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ పాలను ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేస్తే అధిక లాభాలను గడించవచ్చు. పాల ఉత్పత్తులతో పాటు జీవామృతం వంటి సహ ఉత్పత్తుల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. NABARD ద్వారా రుణ సదుపాయం, ప్రభుత్వ సబ్సిడీలు అందుబాటులో ఉంటాయి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే శాశ్వతమైన డిమాండ్ ఉంటుంది. అలాగే తక్కువ మానవ శ్రమ ఉంటుంది. వ్యవసాయంతో పాటు చేయగల స్థిరమైన ఆదాయ మార్గం. మొదట్లో ఈ వ్యాపారాన్ని చిన్న స్థాయిలో మొదలుపెట్టి, మార్కెట్ ని అర్థం చేసుకుని స్కేల్ చేయడం ఉత్తమమైన మార్గం.
5. Goat Farming:
మేకల పెంపకం అనేది గ్రామీణ ప్రాంతాల్లో అధిక ఆదాయం ఇచ్చే వ్యవసాయ ఆధారిత వ్యాపార బిజినెస్ ఐడియా. తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు, నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. ఈ మేకలను మార్కెట్ లో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఒక్క మేకపై లాభం ₹2,000 – ₹4,000 వరకు వస్తుంది. అలాగే మాంసం, పాల, పొట్టు ఉత్పత్తుల ద్వారా ఇంకా అదనపు ఆదాయం పొందవచ్చు.
అలాగే సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు ఆడ మేకలు పిల్లలను కంటాయి. మొదట్లో చిన్నగా 10 మేకలతో మొదలుపెడితే సరిపోతుంది. వాటికి చిన్న షెడ్, మేత కోసం భూమి/ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి. స్థానిక ప్రాంతానికి సరిపోయే మేకల రకాలను ఎంపిక చేసుకోవాలి. మేక మాంసానికి ఎప్పటికీ మార్కెట్ లో డిమాండ్ ఉంటూనే ఉంటుంది. సమయానికి మేకలను అమ్మడం చేస్తే అధిక రాబడి పొందవచ్చు. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రుణ సాయం, సబ్సిడీలు కూడా పొందవచ్చు. ఇది ఉపాధి అవకాశాలతో పాటు, ఇంటి వద్దే నిర్వహించగల, సురక్షితమైన & స్వయం ఆధారిత వ్యాపారం. ఈరోజే స్టార్ట్ చేయండి. మంచి ఆదాయం పొందండి.
6. Poultry Farming:
ఈ బిజినెస్ ఎందుకు బాగుంటుందంటే కోళ్ల మాంసానికి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. చిన్నగా మొదలుపెట్టి, తొందరగా లాభాలు పొందగలిగే వ్యవసాయ వ్యాపారాల్లో ఇది టాప్‌లో ఉంటుంది. ఉదాహరణకు 500 కోళ్లను పెంచితే నెలకు రూ. 40,000 – రూ. 60,000 వరకు ఆదాయం రావచ్చు. ఒక్కొక్క కోడి మీద సగటున రూ. 30 – రూ. 100 పైగానే లాభం పొందవచ్చు. బిజినెస్ స్టార్ట్ చేసిన 45 రోజుల వ్యవధిలో కోళ్లు అమ్మేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇక్కడ మనకు ముఖ్యంగా అవసరమైనవి చిన్న షెడ్ ని నిర్మించుకోవాలి. ఈ కోళ్లకు మంచి పోషకాహారం ఫీడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీటికి నీటి సదుపాయం ఏర్పరచాలి.
ఎలాంటి వ్యాధులు రాకుండా టీకాలు & ఆరోగ్య సంరక్షణ ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు మన కస్టమర్స్ ఎవరంటే హోటల్స్, స్థానిక మార్కెట్లు, చికెన్ షాపులలో అమ్ముకోవచ్చు. ఈ కోళ్లను పెంచడంలో అతిపెద్ద రిస్క్ ఏంటంటే, శుభ్రంగా లేకపోతే వ్యాధులు ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకొని, అప్పుడప్పుడు టీకాలు వేస్తుండాలి. తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయాలంటే కనీసం ₹50,000 అవుతాయి. మీ దగ్గరున్న చిన్న ఖాళీ స్థలంతో స్టార్ట్ చేయండి. ప్రారంభ పెట్టుబడి ₹3–5 లక్షల వరకు అవ్వచ్చు. అంటే దాదాపుగా 500 కోళ్లు వస్తాయి.
పొలం పని కష్టమనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు వ్యవసాయం అనేది = వ్యాపారం + విజయం. ఈ ఆర్టికల్ లో తెలుసుకున్న వ్యవసాయ ఆధారిత వ్యాపార ఐడియాలు, దేశ వ్యాప్తంగా వేలాది మందిని ఆదాయం సంపాదించుకునేలా చేసాయి. ఇవే ఐడియాలు నేడు యువతను స్వయం ఉపాధి మార్గంలో నడిపిస్తున్నాయి. మీరు ఎంచుకునే ఒక్క మార్గం మీ జీవితం మారే మైలురాయి కావచ్చు. కాబట్టి ఇప్పటివరకు తెలుసుకున్న Agriculture Related Business Ideas మీకు ఎంతగానో ఉపయోగపడ్డాయని అనుకుంటున్నా.
మీరు పల్లెటూరిలో ఉంటే కనుక ఇది అద్భుతమైన అవకాశం. పట్టణంలో ఉన్నా సరే టెక్నాలజీ, ట్రేడింగ్ ద్వారా వ్యవసాయ వ్యాపారాన్ని నడిపించవచ్చు. భూమి లేకున్నా కాంట్రాక్ట్ తీసుకుని ఫార్మింగ్, హైడ్రోపోనిక్స్, వెర్మీకంపోస్ట్ వంటి బిజినెస్ చేయవచ్చు. ఇది కేవలం పంటల గురించి మాత్రమే కాకుండా, గతంలో లాభాలు తెచ్చుకున్న భరోసా కూడా. మీరు చేస్తున్న ప్రతి చిన్న వ్యవసాయ ఆలోచన. మీ భవిష్యత్తుకు పెద్ద మార్పు తీసుకురావచ్చు. పట్టుదల, పథకం, ప్రాక్టికల్ మైండ్‌తో మీరు కూడా వెచ్చించిందే సంపాదన అనే సరికొత్త దారిలో వెళ్ళవచ్చు. ఇది కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, ఇది ఒక స్వయం ఉపాధి విప్లవం అని చెప్పవచ్చు.
Join us on Telegram Group.