Easy Way to Start a Small Printing Business

మీరు ఇంటి నుండి ప్రారంభించి, నెమ్మదిగా ఇంప్రూవ్ చేసుకుంటూ పూర్తి ఆదాయ మార్గంగా మార్చుకునే వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలని కలలు కంటున్నారా? అలా అయితే, Start a Small Printing Business మీకు సరైన అవకాశం కావచ్చు. ఎందుకంటే తక్కువ పెట్టుబడి, వివిధ రకాల ఆదాయ మార్గాలు, మరియు కస్టమర్స్ నుండి పెరుగుతున్న డిమాండ్ – ఇవన్నీ ప్రింటింగ్ బిజినెస్ ని 2025 సంవత్సరంలో అత్యంత లాభదాయకమైన చిన్న వ్యాపారంగా నిలిపాయి. మీకు ఎలాంటి అనుభవం లేకపోయినా, ఒక చిన్న ప్రింటింగ్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలియకపోయినా ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుంటారు. నిష్ ఎంచుకోవడం దగ్గరనుంచి, పరికరాలు కొనడం, మార్కెటింగ్ చేయడం, మరియు వ్యాపారాన్ని పెంచడం వరకు ప్రతీ దశను కవర్ చేయడం జరిగింది. తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచి ప్రింటింగ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో పూర్తి స్ట్రాటజీని start a small printing business ఆర్టికల్ ద్వారా ఇప్పుడు తెలుసుకుంటారు.

Why Start a Small Printing Business?

ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది క్రియేటివిటీ, ఫ్లెక్సీబిలిటీ మరియు లాభదాయకమైన సామర్థ్యం కలిగి ఉంది. చిన్న చిన్న వ్యాపారాలు, పాఠశాలలు, ఈవెంట్ నిర్వాహకులు, ఆన్‌లైన్ స్టోర్లు — వీళ్లందరికీ ప్రింటింగ్ సేవలు అవసరం అవుతాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా తమకు కావాల్సిన డిజైన్స్ తమకు నచ్చినట్టుగా, అప్పటికప్పుడు డిజైన్ చేసుకోవచ్చు.

Key Advantages: ఇంటి నుండే స్టార్ట్ చేయవచ్చు. కాబట్టి తక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది. అందుకే ఈ వ్యాపారానికి చాలా డిమాండ్ ఉంటుంది. డిజైన్ మరియు కస్టమైజేషన్ కు విస్తృత అవకాశాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. స్టార్ట్ చేయడానికి మరియు స్కేల్ చేసుకోవడానికీ చాలా ఈజీగా ఉంటుంది. వివిధ రకాల ఆదాయ మార్గాలు అయిన – షర్టులు, కార్డులు, బ్రోచర్లు మొదలైనవి తయారుచేయవచ్చు.

Is a Printing Business Right for You?

మీరు గనుక ఈ క్రింది లక్షణాలు కలిగి ఉంటే, మీరొక సక్సెస్ఫుల్ ప్రింటింగ్ వ్యాపారవేత్త అవుతారు. డిజైన్ లేదా విజువల్ క్రియేషన్స్ పై ఇంటరెస్ట్ ఉండి
డిజైనింగ్ కి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. అలాగే కంప్యూటర్లు మరియు సాఫ్ట్‌వేర్‌ని వాడడంలో నిపుణులైతే మీకు సరిపోతుంది. ఇంకా ఇంటి నుండే పని చేయాలనుకునే వారు చక్కగా స్టార్ట్ చేయవచ్చు. మీకు ప్రింటింగ్ అనుభవం లేకపోయినా, ఇది కొత్తగా స్టార్ చేసే వారికి అనుకూలమైన వ్యాపారం.

What Kind of Printing Services to Offer

ఒకేసారి అన్ని ప్రింటింగ్ సర్వీసెస్ ని చేయాల్సిన అవసరం లేదు. మొదట రెండు లేదా మూడు ప్రధాన సర్వీసెస్ తో ప్రారంభించి, తర్వాత అవసరాన్ని బట్టి స్కేల్ చేయండి. ఇప్పుడు మనము కొన్ని ప్రధానమైన ప్రింటింగ్ సర్వీస్ నిష్ ల గురించి తెలుసుకుందాం.

1. Commercial Printing: విజిటింగ్ కార్డులు, ఫ్లైయర్లు, బ్రోచర్లు, మెను కార్డులు, లెటర్‌హెడ్స్ వంటి ప్రింటింగ్ నిష్ లన్నీ కమర్షియల్ ప్రింటింగ్ సర్వీసెస్ క్రిందకు వస్తాయి.

2. Custom Apparel Printing: టీ-షర్ట్స్, హుడీలు, టీమ్ యూనిఫార్మ్స్, ఈవెంట్ ప్రింటెడ్ షర్ట్స్ ఇవన్నీ మనకు కావాల్సినట్టు డిజైన్ చేసుకునే అప్పారెల్ ప్రింటింగ్ సర్వీసెస్ క్రిందకు వస్తాయి.

3. Promotional Product Printing: మగ్గులు, వాటర్ బాటిల్స్, పెన్స్, నోట్‌బుక్స్, ఫోన్ కేసులు వంటి సర్వీసెస్ అన్నీ ప్రమోషనల్ ప్రొడక్ట్ ప్రింటింగ్ సర్వీసెస్ క్రిందకు వస్తాయి.

4. Large Format Printing: ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, షాప్ బోర్డ్స్, వాహన స్టిక్కర్లు వంటి సర్వీసెస్ లన్నీ లార్జ్ ఫార్మాట్ ప్రింటింగ్ సర్వీసెస్ క్రిందకు వస్తాయి.

5. Event Printing: పెళ్లి కార్డులు, ఫోటో బుక్స్, పర్సనలైజ్డ్ గ్రీటింగ్స్ వంటి వన్నీ ఈవెంట్ ప్రింటింగ్ సర్వీసెస్ క్రిందకు వస్తాయి.

అయితే మీ ప్రాంతంలో డిమాండ్ ఉన్న సర్వీస్ ఎంచుకోండి. స్టార్ట్ చేయడానికి సరిపడే సర్వీసెస్, తక్కువ పెట్టుబడిలో ఉండే ప్రింటింగ్ మోడల్స్ ఎన్నుకోవడం ఉత్తమమైన మార్గం.

How to Research Your Market

ముందుగా మీ ప్రోడక్ట్స్ కి డిమాండ్ ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ సర్వీసెస్ కి తగినట్టు తయారు చేసుకోవడానికి సహాయపడుతుంది. మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బిజినెస్‌లు, పాఠశాలలు, ఈవెంట్లు పరిశీలించండి. Etsy, Fiverr వంటి సైట్‌లలో డిమాండ్ ఉన్న సర్వీసెస్ ఎంటో చూడండి. Google Trendsలో మీకు సంబంధించిన కీవర్డ్స్ కోసం వెతకండి. ఫేస్‌బుక్ గ్రూప్‌లలో నేరుగా అడగండి. అలాగే మీ పోటీదారుల వెబ్‌సైట్‌లు, రివ్యూలు, ధరలు అన్నింటినీ పరిశీలించండి.

Write a Simple Printing Business Plan

మీ వ్యాపారం ఏ విధంగా సాగాలో తెలుసుకోవాలంటే ఒక సులభమైన బిజినెస్ ప్లాన్ ఉండాలి. ఈ ప్లాన్ లో ముఖ్యంగా మీ బిజినెస్ పేరు మంచిగా ఉండాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న సర్వీస్ ఎంటనేది తెలియాలి. స్టార్టింగ్ లో వచ్చే ఖర్చుల గురించి ఒక మంచి ప్లాన్ ఉండాలి. మీ బిజినెస్ ని మార్కెట్ లోకి ఎలా తీసుకెళ్లాలో ఒక మార్కెటింగ్ ప్లాన్. నెలవారీ వచ్చే ఖర్చులు మరియు లాభాలను నోట్ చేయాలి. షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్ గోల్స్ అయిన 6 నెలల మరియు 1 సంవత్సరపు లక్ష్యాలను నిర్ణయించుకోవాలి.

Estimate Startup Costs and Budget

చిన్న స్థాయిలో ప్రింటింగ్ వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన ముఖ్యమైన పరికరాలు మరియు వట్టి ఖర్చులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రింటర్ (ఇంక్‌జెట్ లేదా లేజర్) యొక్క ఖర్చులు అంచనా వేసినట్టయితే ₹40,000 – ₹1,50,000 వరకు అవుతుంది. తర్వాత హీట్ ప్రెస్ మెషీన్ యొక్క ఖర్చులు అంచనా వేసినట్టయితే ₹15,000 – ₹40,000 వరకు అవుతుంది. అలాగే వినైల్ కట్టర్ యొక్క ఖర్చులు అంచనా వేసినట్టయితే ₹15,000 – ₹30,000 వరకు అవుతుంది. ఇంకా కంప్యూటర్ మరియు డిజైన్ సాఫ్ట్‌వేర్ యొక్క ఖర్చులు అంచనా వేసినట్టయితే ₹50,000 – ₹1,50,000 వరకు అవుతుంది. స్టార్ట్‌అప్ మెటీరియల్స్ (పేపర్, ఇంక్, షర్ట్స్ మొదలైనవి) యొక్క ఖర్చులు అంచనా వేసినట్టయితే ₹20,000 – ₹50,000 వరకు అవుతుంది.

Affordable Printing Business Plan:
తక్కువ బడ్జెట్ లో కావాలంటే ఇంటి నుండే వ్యాపారం ప్రారంభించండి. సెకండ్ హ్యాండ్ పరికరాలను వాడండి. Canva వంటి ఉచిత టూల్స్ ని డిజైనింగ్ కోసం ఉపయోగించండి. ఎంత తక్కువ బడ్జెట్ అయినా కనీసం ₹1.5 లక్షల నుండి ₹3 లక్షల వరకు ఖర్చు అవుతుంది.

Register Your Business

వ్యాపారాన్ని లీగల్ గా మరియు ప్రొఫెషనల్‌గా నడిపించేందుకు మీ బిజినెస్ కి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ముందుగా మీ బిజినెస్ యొక్క పేరేంటో నిశ్చయించుకోండి. ఆపై MSME / Udyam వంటి వెబ్సైట్ ద్వారా మీ బిజినెస్ ని ఆన్లైన్ లో రిజిస్టర్ చేయించండి. అవసరమయితే GST ని కూడా నమోదు చేయించండి. అలాగే సరికొత్త బిజినెస్ అకౌంట్ ని ఓపెన్ చేయండి. ఈ అకౌంట్ ని బిజినెస్ పర్పస్ కి మాత్రమే వాడండి. ఇంకా మీ బిజినెస్ కి ఇన్సూరెన్స్ చేయించండి.

Choose the Right Printing Equipment

మీ సర్వీసెస్ ప్రకారం పరికరాలను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు T-Shirt Printing: కోసం DTG ప్రింటర్ / హీట్ ప్రెస్, వినైల్ కట్టర్, ట్రాన్స్ఫర్ పేపర్ వంటి పరికరాలను తీసుకోవాల్సి ఉంటుంది. Paper Printing: కోసం లేజర్ ప్రింటర్, కట్టింగ్ మెషీన్లు, లామినేషన్ పరికరాలు వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. Designing Tools: కోసం Adobe Photoshop, Illustrator, Canva వంటివి కావాల్సి ఉంటుంది.

Build Your Website and Online Presence

మీ బిజినెస్ కి వెబ్‌సైట్ ఉండటం చాలా అవసరం. ఎందుకంటే, నమ్మకాన్ని పెంచుతుంది మరియు ఆర్డర్‌లు అందుకుంటే సహాయపడుతుంది. ఈ వెబ్‌సైట్ లో ముఖ్యమైనవి హోమ్ పేజీ, సర్వీసెస్ లిస్ట్, పోర్ట్‌ఫోలియో, ధరలు, కాంటాక్ట్ పేజీ, ఆర్డర్ చేసే పేజీ (ఇ-కామర్స్ మోడల్) వంటివి ఖచ్చితంగా ఉండాలి. మీ వెబ్‌సైట్ కి SEO చేయడం కోసం printing business marketing ideas వంటి కీలక పదాలను సహజంగా చేర్చండి.

Market Your Small Printing Business

Local Marketing Ideas: స్థానికంగా ఉన్న వ్యాపారాలపై బ్రోచర్లు పంపండి. పాఠశాలలు, ఈవెంట్లలో భాగస్వామ్యం అయ్యి మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోండి. మొదటి ఆర్డర్‌పై డిస్కౌంట్లు ప్రకటించండి.

Online Marketing Strategies: Facebook, Instagramలో మీ బిజినెస్ మోడల్స్ పోస్ట్ చేయండి. అలాగే Google My Business ప్రొఫైల్ క్రియేట్ చేయండి. ఇది మీ లోకల్ ఏరియాలో లిస్ట్ అవుతుంది. గూగుల్ లో మీ వెబ్‌సైట్ ఫస్ట్ పేజీలో రావడానికి SEO ఫ్రెండ్లీ కంటెంట్ రాయండి. WhatsApp మార్కెటింగ్ మరియు ఈమెయిల్ ప్రచారాలు చేయండి.

Deliver Amazing Customer Service:
మీ సర్వీసెస్ యొక్క క్వాలిటీ మాత్రమే కాదు, కస్టమర్ ని ఎలా ట్రీట్ చేస్తారో అది కూడా ముఖ్యం. కస్టమర్ కాల్ చేసిన తక్షణమే స్పందించండి. క్లారిటీతో డెలివరీ డేట్ చెప్పండి. ఏదైనా కంప్లయింట్ ఉంటే వెంటనే సానుకూలంగా పరిష్కరించండి. మీ ఓల్డ్ కస్టమర్స్ ని రివ్యూస్ అడగండి. మీకంటూ ఒక పోర్ట్‌ఫోలియోగా వాడండి.

How to Scale Your Printing Business

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రొడక్ట్స్ ని తెస్తూ ఉండండి. డిజైన్, ప్యాకింగ్, మార్కెటింగ్ కోసం ఉద్యోగస్టులను జాయిన్ చేయించుకోండి. ఈ-కామర్స్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్మండి. అవసరమైతే షాపు లేదా ప్రింటింగ్ వర్క్‌షాప్ ప్రారంభించండి. దీంతో ఇంకా ఎక్కువగా మీ బిజినెస్ స్కేల్ అయ్యే అవకాశం ఉంటుంది.

Avoid These Beginner Mistakes:

బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే కావాల్సిన దానికంటే ఎక్కువ టూల్స్ ని కొనుక్కోవడం చాలా పెద్ద తప్పు. మీ సర్వీస్ ధర కంటే తక్కువకు అమ్మడం కూడా మీకు లాస్ ని చూపిస్తుంది. అలాగే మీ బిజినెస్ యొక్క సరైన టార్గెట్ మార్కెట్ అర్థం చేసుకోకపోడం కూడా తప్పే. ఇంకా కాంట్రాక్ట్స్ లేదా ఆర్డర్స్ ని స్కిప్ చేయడం కూడా తప్పే. నేటి రోజుల్లో ఆన్లైన్ లో గడిపేవాళ్ళు ఎక్కువయ్యారు. కాబట్టి మీ బిజినెస్ కూడా ఖచ్చితంగా ఆన్లైన్ లో ఉండాలి. లేకపోతే ఆన్లైన్ బిజినెస్ ని కోల్పోతాము.

చివరగా మీరిప్పుడు తెలుసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ తో చిన్న ప్రింటింగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇది మీరూ స్వతహాగా వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి బెస్ట్ దారి. కాబట్టి సరైన పరికరాలు, సరైన మార్కెట్ టార్గెట్, మరియు ప్రామాణిక సేవలు అందిస్తే, ఈ వ్యాపారం మీకో పెద్ద విజయాన్ని అందిస్తుంది. ఇప్పటివరకు మీరు చదివిన Start a Small Printing Business ఆర్టికల్ ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ ని సంపాదించింది ఉంటారు. మీ ఫ్యూచర్ కస్టమర్స్ మీకోసం వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మరెందుకు ఆలస్యం ఈరోజే మీ మొదటి స్టెప్ ని ముందుకు వేయండి.

Join us on Telegram Group.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *