కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి లేకపోతే వ్యాపారంలో రాణించలేం అనే అపోహలో ఉంటారు. అలాంటి వారు వ్యాపారం ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం క్రియేటివిటీ, సరైన సమయానికి సరైన నిర్ణయాన్ని తీసుకునే ధైర్యం ఉంటే చాలు. అందరికంటే విభిన్నంగా ఆలోచించే తెలివి మీకు ఉన్నట్లయితే, ఒక మంచి వ్యాపార ఆలోచనతో ప్రారంభిస్తే సరిపోతుంది.
2025లో ప్రారంభించడానికి 8 గొప్ప వ్యాపారా ఆలోచనలు
ఇక మొదట్లోనే మీరు ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టాలి ? దానికి కావాల్సిన ప్లాన్ ఏంటి ? కస్టమర్ల ఆలోచన తీరు ఎలా ఉంది ? వాళ్ల అభిరుచులు ఏంటో పసిగట్టి, దానికి తగ్గట్టు ప్లాన్ వేసుకోండి. ప్లాన్ అంటే మైండ్ లో ఆలోచించి మరచిపోయేది కాదు. ఆ ఆలోచనను పేపర్ పై రాయండి. అప్పుడు ఆ ప్లాన్ అనేది అమలవుతుంది. ఆలోచిస్తూ పోతే వ్యాపార ఆలోచనలు చాలానే వస్తాయి. ఒకవేళ అలా ఆలోచించే సమయం మీకు లేకపోతే మేమే మీకోసం కొన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించే వ్యాపారాలు ఇవ్వడం జరిగింది. ఆ వ్యాపారాలు ఏంటో మీరు కూడా చదివేయండి.
1. Freelance Content Creation and Copywriting :
నేటి డిజిటల్ యుగంలో ప్రతి వ్యాపారానికి కంటెంట్ అవసరం ఉంది. అది వెబ్సైట్ కంటెంట్ అయినా, బ్లాగ్ పోస్టులు లేదా సోషల్ మీడియా కంటెంట్ అయినా సరే క్వాలిటీ రైటింగ్ కి డిమాండ్ అనేది పెరుగుతోంది. ఫ్రీలాన్సర్ గా కంటెంట్ క్రియేటర్ లేదా కాపీరైటర్‌గా రాణించడానికి మీకు కేవలం ఒక కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు.
ఫ్రీలాన్సర్ గా రాణించాలంటే స్కిల్ అనేది బాగా ఉండాలి. మీ ప్రాంతంలో ఉండే కంపెనీలకు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసి మీ పోర్టుఫోలియో నిర్మించుకోండి. అలాగే మీ స్కిల్ ని ఇతరులకు చూపించుకోవడానికి వెబ్సైట్ లేదా సోషల్ మీడియా ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోండి. అప్పుడే మీకు వర్క్ ఈజీ గా దొరుకుతుంది. ఫ్రీలాన్స్ వర్క్ కోసం Upwork, Fiverr, LinkedIn మరియు Freelancer వెబ్సైట్ లలో వెతకవచ్చు.
2. Virtual Assistant Services :
కంపెనీలకు ప్రాంతంతో సంబంధం లేకుండా అంతర్జాతీయ ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. దాంతో వర్చువల్ అసిస్టెంట్ల అవసరం పెరుగుతోంది. ముఖ్యంగా వీరు e-Mail మేనేజ్ చేయడం, అడ్వర్టైజ్మెంట్ మరియు కస్టమర్ సపోర్ట్ లాంటి పనులు చేస్తుంటారు. ప్రారంభంలో ఈ బిజినెస్ కి వ్యయం తక్కువగా ఉంటుంది. అలాగే మీరు ఎక్కడినుంచైనా ఈ పనులు చెయ్యవచ్చు. మీరు అందించాలనుకుంటున్న సర్వీసెస్ ను అందరికీ తెలిసేలా చేయండి. అదెలా అంటే ఒక LinkedIn ప్రొఫైల్ లేదా వెబ్సైట్ క్రియేట్ చేయండి. ఫ్రీలాన్స్ ప్లాట్‌ఫారమ్‌లలో లేదా స్థానికంగా ఉండే వ్యాపార యజమానుల దగ్గర మీ సర్వీసెస్ ని ప్రమోట్ చేసుకోండి. అలాగే ఈ వర్చ్యువల్ అసిస్టెంట్స్ ఉన్న ఆన్లైన్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. అక్కడ మీ వర్క్ ని ప్రమోట్ చేసుకోండి.
సోషల్ మీడియా అనేది నేడు ఎంత అవసరమో అందరికీ తెలుసు. కానీ చిన్న చిన్న వ్యాపార యజమానులు దాని ఉపయోగం తెలిసి కూడా, దానిని మేమేజ్ చేయడానికి స్కిల్ లేకపోవడం వలనో లేక టైమ్ లేకపోవడం వలనో అక్కడే ఆపేస్తారు. సోషల్ మీడియా మేనేజర్స్ కేవలం ఇంటర్నెట్ మరియు కంప్యూటర్‌తో ఇంటి నుండి పని చేయవచ్చు. ఎలా అంటే సోషల్ మీడియా ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీ విలువైన ఆలోచనలు అక్కడ పంచుకోండి. దాంతో మీ పోర్ట్‌ఫోలియోకి వాల్యూ ఏర్పడుతుంది.
ఫ్రీగా సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోండి. మనకు చాలా ఫ్రీ అప్లికేషన్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా Youtube, Instagram, Facebook లాంటివి కనబడతాయి. వీటిలో మీకోక మంచి స్కిల్ తో ఆన్లైన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని, వాటిని చిన్న చిన్న వ్యాపార యజమానులకు చూపించినట్లయితే వారే మీకు మంచి వర్క్ ఇస్తారు. దాంతో మంచి ఆదాయం సంపాదించవచ్చు.
4. Massage Therapist :
రోజు రోజుకీ టెన్షన్ మరియు ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో మసాజ్ థెరపీ చాల ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనకున్న టెన్షన్, బాడీ పెయిన్ లాంటివి తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఈ థెరపీ చేయడానికి మీరు శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఒకసారి శిక్షణ పొందితే ఎక్కడైనా మీ స్టూడియోని ప్రారంభించవచ్చు. ఈ మస్సాజ్ థెరపీకి ఇప్పుడిప్పుడే డిమాండ్ ఏర్పడుతుంది. కాబట్టి మీరు కూడా ఓ లుక్కేయండి.
5. Tutoring Services :
నేటి రోజుల్లో స్కిల్ ఉన్న అధ్యాపకులకు మంచి డిమాండ్ ఉంది. వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో చాలా మంది భోధిస్తున్నారు. కానీ ఆన్లైన్ లో తక్కువ మందే ఉన్నారు. విద్యార్థులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు స్కిల్ ఉన్న అధ్యాపకుల కోసం ఆన్లైన్ లో చూస్తున్నారు. కాబట్టి మీరు సైన్స్, మ్యాథ్స్, మరియు ఏదైనా భాషలలో పట్టు ఉన్నట్టయితే ఇది మీకు పెట్టుబడి లేని బిజినెస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆన్లైన్ లో బోధించే అధ్యాపకులు చాలా తక్కువ మంది ఉన్నారు.
మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే Chegg, Tutor.com, Wyzant, Vedantu వంటి ఆన్లైన్ ప్లాట్ ఫారంలలో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. అక్కడ మీ సబ్జెక్ట్ ఏంటో సెలెక్ట్ చేస్కొని చిన్న టెస్ట్ రాసి పాస్ అయితే మీరు కూడా బోధించవచ్చు. అలాగే మీ ప్రాంతంలో స్కూల్ కి వెళ్లే విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వాళ్లకు సబ్జెక్ట్ నేర్పిస్తూ ఆదాయం పొందవచ్చు.
6. Fitness Coaching or Personal Training :
ఇప్పట్లో అందరికీ ఆరోగ్యం పై అవగాహన పెరిగినందుకు ఫిట్నెస్ కోచింగ్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. అనేకమంది జిమ్ మెంబర్షిప్ కంటే ఎక్కువగా పర్సనల్ గైడెన్స్ పై ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల తక్కువ పెట్టుబడితో దీన్ని ప్రారంభించవచ్చు. మీకు గనుక పర్సనల్ ట్రైనింగ్ లేదా ఫిట్నెస్ స్కిల్ ఉన్నట్టయితే మీ ప్రాంతంలో ట్రైనింగ్ సెంటర్ ద్వారా క్లాసులు చెప్పవచ్చు. ఇక ఆన్లైన్ లో ఫ్రీగా టిప్స్ ఇస్తూ ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు. దాంతో పర్సనల్ ట్రైనింగ్ లేదా ఫిట్నెస్ గురించి మరింత సమాచారం కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అలా మీకు మంచి ఆదాయం చేకూరుతుంది.
7. Digital Products Creation :
డిజిటల్ ప్రొడక్ట్స్ లో ముందుగా మనం పని చేయాల్సి ఉంటుంది. మనకు ఏదైనా సబ్జెక్ట్ లో పట్టు ఉన్నట్టయితే E-books లేదా ఆన్లైన్ కోర్సులు వంటివి రూపొందించి ఆదాయం పొందవచ్చు. ఉదాహరణకు business, finance, investment, career development వంటి స్కిల్స్ గనుక మీకు ఉంటే ఆన్లైన్ లో కోర్సులు మరియు e-books రూపొందించి వాటిని సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్ పొందవచ్చు. వీటిని amazon, flipkart, మరియు మీ సొంత వెబ్సైటులో అమ్మవచ్చు.
8. Real estate :
అపార్ట్మెంట్స్, హౌసెస్ మరియు ఖాళీ స్థలాలను అమ్మడం, కొనుగోలు చేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ పరీక్ష రాసి సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళు ఇల్లు అద్దెకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయో తెలుసుకొని, వాటిని కావాల్సిన వారికి సేల్ చేస్తారు. ఇది ఈజీ వర్క్ అయితే కాదు. అలా అని మరీ కష్టంగా ఉండదు. మీ చుట్టుపక్కల సర్కిల్ లో ఉన్న వ్యక్తులతో మంచి పరిచయాలు ఉండాలి. కొత్తవ్యక్తులతో తెలివిగా మాట్లాడి సేల్ జరిగేలా ఒప్పించాలి.
తక్కువ ప్రయత్నాలతో వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు వేగంగా విజయాన్ని పొందడానికి, 8 ఉత్తమమైన మార్గాలు, ఈ పరిశ్రమలు మార్కెట్లో దూసుకుపోతున్నాయి.
ఎలాంటి పెట్టుబడి లేకుండా వ్యాపారం ప్రారంభించడం ఎలా ? (How to Start a Business with Zero Investment)
Leave a Reply