Stock Market for Beginners – What is Share Market?

ఎంత డబ్బు సంపాదించినా నెల తిరిగేసరికి ఇంటి అద్దె, EMI, మొబైల్, టివి రీఛార్జ్ అంటూ ఉన్నదంతా ఖర్చయిపోతే ఉపయోగం ఏంటి? జీవితాంతం జాబ్ చేస్తూ వచ్చిన జీతం వచ్చినట్టు ఖర్చయితే భవిష్యత్తులో ఎలా మరి? అందుకే వచ్చిన జీతాన్ని ఖర్చులకు మాత్రమే కాకుండా డబ్బుని డబ్బే సంపాదించేలా చేయాలి. అర్థం కాలేదా అయితే ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా చదవండి.

Don’t work for Money !
చాలామంది డబ్బు కోసం పనిచేస్తున్నట్టు మనం కూడా డబ్బు కోసం పనిచేయరాదు. డబ్బే మనకోసం పనిచేసేలా చేయాలి. అదెలా అంటే ఉదాహరణకు మీకు వచ్చే నెల జీతాన్ని నాలుగు భాగాలుగా చేయండి. అందులో ఒక భాగం మొత్తం మీ ఖర్చులకు, రెండవ భాగం మీ ఎమర్జెన్సీ ఫండ్, మూడవ భాగం మీ ఆరునెలలకు సరిపోయే సేవింగ్స్, నాల్గవ భాగం ఇన్వెస్ట్మెంట్ కి పెట్టుకోండి. ఇలా మీ ఆదాయాన్ని విభజించుకోండి.

అప్పుడే మీరు ఎంత సంపాదిస్తున్నారో, ఎంత ఖర్చు చేస్తున్నారో, ఎంత సేవ్ చేస్తున్నారో తెలుస్తుంది. దాంతో మీ ఖర్చులు తగ్గి ఆస్తులు పెరుగుతాయి. ఈ నాలుగు అంశాలలో ముఖ్యంగా మనకు కావాల్సింది ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇక్కడ మనం పెట్టిన డబ్బు ఎక్కడికీ వెళ్ళదు.

What is Investment ?
మన దగ్గర ఉన్న డబ్బుని షార్ట్ టర్మ్ లోనైనా లేక లాంగ్ టర్మ్ లోనైనా మంచి లాభాలు వచ్చే ఆస్థిపై పెట్టుబడి పెట్టడం. ఉదాహరణకు Real Estate, Bonds, Fixed Deposit, Gold, Stock Market లలో పెట్టుబడి పెట్టడం. అలాగే మంచి లాభాలను పొందడం. మనం సంపాదించే ఆదాయాన్ని పైన చెప్పిన నాలుగు భాగాలుగా విభజిస్తే బాగుంటుంది. అందులో అన్నింటికన్నా మంచిది ఇన్వెస్ట్మెంట్.

మనం ఇన్వెస్ట్ చేసే ఆ ఒక్క భాగం స్టాక్ మార్కెట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే తక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ప్రాఫిట్ పొందవచ్చు. ఒకవేళ వేరే ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చూసినా ఎక్కువ డబ్బుతో ముడిపడి ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ బెస్ట్.

స్టాక్ మార్కెట్ అంటే అందరూ జూదం అనుకుంటారు. ఎందుకంటే దీని గురించి తెలీదు కాబట్టి. అదే తెలిసిన వాళ్ళయితే దీనిని వరం అంటారు. ఎందుకంటే మన దగ్గర మిగిలిన చిన్న అమౌంట్ తో రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయలేం. అలాగే బంగారం కొనుక్కోలేము. Fixed Deposit చేసినా చాలా తక్కువ వడ్డీ వస్తుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టాక్ మార్కెట్ లో అతితక్కువ అమౌంట్ తో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు. అయితే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

What is Stock Market?
స్టాక్ మార్కెట్ అంటే ఒక కంపెనీ యొక్క స్టాక్స్ లేదా షేర్స్ ని stock exchange ద్వారా పబ్లిక్ గా కొనుక్కోవడం మరియు అమ్మడం జరుగుతుంది. స్టాక్ అంటే ఒక కంపెనీ యొక్క చిన్న భాగం. ఉదాహరణకు మనం ఒక కంపెనీ యొక్క స్టాక్ ని కొనుక్కున్నట్టయితే ఆ కంపెనీలో మనం కూడా ఒక భాగం.

అప్పుడు మనకు ఆ కంపెనీ లో ఒక చిన్న భాగం ఓనర్షిప్ ఉన్నట్టు. ఒకవేళ కంపెనీ మంచిగా వృద్ధి చెందుతూ ఉంటే అప్పుడు మీ యొక్క స్టాక్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడతారో అప్పుడు మీరు కూడా బిజినెస్ చేస్తున్నట్టు. మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేస్తే అక్కడ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ స్టాక్ మార్కెట్ లో అలా కాదు.

ఇప్పటికే స్థాపించిన కంపెనీలో పెట్టుబడి పెట్టడం. ఇక్కడ రిస్క్ తక్కువ మరియు రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. కానీ స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకొని ఈ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేకానీ ఎవరో చెప్పారని రాత్రికి రాత్రే మీ డబ్బులు డబల్ అయిపోవు.

What are the Stock Exchanges ?
Securities and Exchange Board of India(SEBI) రూల్స్ ప్రకారం రోజూ ట్రేడ్స్ అనేవి జరుగుతాయి. National Stock Exchange మరియు Bombay Stock Exchange రెండూ SEBI నియంత్రణలో ఉంటాయి. ప్రధానంగా మనకు stock exchanges రెండు ఉన్నాయి. మొదటిది National Stock Exchange(NSE). రెండవది Bombay Stock Exchange(BSE). ఇందులో NSE చాలా పెద్దది మరియు నగదు లావాదేవీలు ఎక్కువగా జరుగుతాయి. అలాగే BSE అనేది మన దేశంలో చాలా పాతది. Bombay Stock Exchange ని 1875 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అలాగే National Stock Exchange ని 1992 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది.

What is Stock Indices ?
ప్రధానంగా మనకు రెండు Indices ఉన్నాయి. అవి ఏంటంటే NIFTY మరియు SENSEX. NIFTY అనేది NSE లో లిస్ట్ అయిన టాప్ 50 స్టాక్స్ యొక్క కంపెనీస్ ఉంటాయి. అలాగే SENSEX అనేది BSE లో లిస్ట్ అయిన టాప్ 30 స్టాక్స్ యొక్క కంపెనీస్ ఉంటాయి. అందుకే NIfty 50 మరియు Sensex 30 అంటారు. ఇప్పుడైతే NSE లో 2,379 కంపెనీస్ మరియు BSE లో 5,505 కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి.

Why people Invest in Stock Market ?
స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి.

  1. Growth Potential : బ్యాంక్ లో మనం పొదుపు చేసే డబ్బుపై కేవలం 7% రిటర్న్స్ మాత్రమే వస్తాయి. కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
  2. Compounding Power : మీరు స్టాక్ మార్కెట్ లో సంపాదించిన డబ్బుని తిరిగి మళ్లీ ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తే, ఆ డబ్బు మరింత తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు ప్రతి నెలా Rs 1,000 ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే కొన్ని రోజులకు అది డబల్, ట్రిపుల్ ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంపౌండింగ్ పవర్ అలా ఉంటుంది మరి.
  3. Financial Independence : స్టాక్ మార్కెట్ పై మంచి నాలెడ్జ్ తో stock portfolio నిర్మించుకుంటే కొన్నేళ్లపాటు అలా వదిలిస్తే, మీ డబ్బు చాలా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో మీకు కావాల్సిన ఇంటిని నిర్మించుకోవచ్చు లేదా మీ పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది. ఇంకా మీరు సంతోషంగా రిటైర్ అవ్వచ్చు.

How to get started with your first Investment ?
ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలంటే మీకు మీరుగా రీసెర్చ్ చేయండి. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అదెలా పనిచేస్తుంది? ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకేంటి ఉపయోగం? ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానం వెతుక్కోండి. అప్పుడే మీకు ఈ స్టాక్ మార్కెట్ పూర్తిగా అర్థం అవుతుంది.

అంతేకానీ ఎవరో ఎదో చెప్పారని ఉన్న డబ్బంతా వారికి ఇచ్చి నష్టపోవడం, ఎక్కడపడితే అక్కడ ఇన్వెస్ట్ చేసి బాధపడటం చేయకండి. స్టాక్ మార్కెట్ గురించి ఇంకా అర్థం కాకపోతే ఈ ఆర్టికల్ ని మరొకసారి చదవండి. అలాగే ఫ్రీగా యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకోండి.

ఇలాంటి మరిన్ని ఆర్టికల్స్ ఆన్లైన్ లో ఫ్రీగానే దొరుకుతాయి వాటిని చదివి అర్థం చేసుకోండి. ఒకవేళ డబ్బు పెట్టి నేర్చుకోవాలనుకుంటే సర్టిఫైడ్ స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్స్ ని కలిస్తే వారే మీకు దిశా నిర్దేశం చేస్తారు. ఇంకా మీరు పూర్తిగా స్టాక్ మార్కెట్ పై అవగాహన రావాలంటే మేము అందించే అప్డేట్స్ ఫాలో అవ్వండి.

Educate Yourself Regularly :
రోజూ కొంచెం కొంచెం నేర్చుకుంటూ ముందుకెళ్లండి. మొదట్లోనే డబ్బు ఇన్వెస్ట్ చేసి నష్టపోవద్దు. ముందుగా ఎలాంటి ఇండస్ట్రీ భవిష్యత్ లో బాగుంటుంది? ఆ ఇండస్ట్రీలో ఎలాంటి కంపెనీస్ వృద్ధి చెందుతున్నాయి? మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది? అనేది రీసెర్చ్ చేసి మీకు మీరుగా తెలుసుకోండి. ఇదేం అంత కష్టమేం కాదు. నేర్చుకుంటే అన్నీ సులభమే.

ఈ సబ్జెక్ట్ స్కూల్స్ లో ఎక్కడా చెప్పరు. కాబట్టి ఆన్లైన్ లో ఎన్నో ఫ్రీగా వీడియోస్ ఉన్నాయి ఆర్టికల్స్ ఉన్నాయి చదివి నేర్చుకోండి. మీకు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పై పూర్తి అవగాహన వస్తుందో అప్పుడే చిన్న మొత్తంలో డబ్బు ఇన్వెస్ట్ చేసి నేర్చుకోండి. అలా చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించి ఫైనాన్సిల్ ఫ్రీడమ్ పొందండి. ఇంకెందుకు ఆలస్యం మాతోపాటు మీరు కూడా నేర్చుకోండి.

ఈ ఆర్టికల్ లో చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అందరికీ స్టాక్ మార్కెట్ పై అవగాహన కలిగించి ఇందులో ఉన్న మెళకువలు తెలుసుకొని నేర్చుకుంటారని. ఇంకా మున్ముందు పూర్తి సమాచారం మీ ముందుకు తీసుకొస్తాం. Stay updated !

8 Great Business Ideas To Start in 2025 – 8 గొప్ప వ్యాపారాలు

How to invest in Stock Maket (స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి)

స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మనకి ఒక డిమార్ట్ అకౌంట్ అయితే కావాలి డిమార్ట్ అకౌంట్ కావాలంటే దాన్ని కంపల్సరీ మీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి పాన్ కార్డు ఉండాలి దాంతో పాటు ఒక డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంట్లో పేపర్ ట్రేడ్ చేసుకోండి ఓకేనా మనకి బేసిక్ గా చెప్పాలంటే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ డిమార్ట్ అకౌంట్ ఇస్తున్నారు (ICICI DIRECT)

Join us on Telegram Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *