Pradhan Mantri Awas Yojana Scheme Details in Telugu

Pradhan Mantri Awas Yojana Scheme Details in Telugu

దశాబ్దాలుగా భారతదేశంలో సరసమైన ధరలలో గృహనిర్మాణం చేపట్టడం చాలా పెద్ద సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం 2015 సంవత్సరంలో Pradhan Mantri Awas Yojana (PMAY) పథకాన్ని ప్రారంభించింది. 2024 సంవత్సరం పూర్తయ్యే నాటికి అందరికీ ఇళ్లు అందించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రతి భారతీయ పౌరుడు ముఖ్యంగా ఆర్థికంగా బడుగు బలహీన వర్గాల వారికి సురక్షితమైన, సరసమైన ఇంటికి నిర్మించుకోవడం.

What is Pradhan Mantri Awas Yojana (PMAY)?

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) అనేది భారతీయ పౌరులందరికీ సరసమైన ఇళ్లను అందించడానికి రూపొందించబడిన ప్రభుత్వ పథకం. ముఖ్యంగా ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలు (EWS), తక్కువ-ఆదాయ సమూహాలు అయిన ప్రజలకు (LIG) మరియు మధ్య-ఆదాయ సమూహాల (MIG) ప్రజలపై దృష్టి పెట్టింది. భారతదేశంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక గృహాల కొరతను పరిష్కరించడానికి, అవసరమైన సౌకర్యాలతో పక్కా ఇల్లు (శాశ్వత గృహాలు) నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రారంభించబడింది.

ఈ పథకం రెండు కీలక రంగాలలో పనిచేస్తుంది:
Pradhan Mantri Awas Yojana-Urban (PMAY-U) : పట్టణాలు మరియు నగరాలలో ఇళ్లను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది.
Pradhan Mantri Awas Yojana-Gramin (PMAY-G) : గ్రామాల్లోని ప్రజలకు సరసమైన ఇళ్లను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Key Features of PMAY:

1) Affordable Housing for all : PMAY 2024 సంవత్సరం పూర్తయ్యే నాటికి భారతదేశం అంతటా 2.95 కోట్ల ఇల్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మరియు వడ్డీ రాయితీలను అందిస్తుంది, దాంతో ఇళ్లను సరసమైన ధరలలో నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.

2) Interest Subsidy for Home Loans : Credit Linked Subsidy Scheme (CLSS) కింద, EWS, LIG మరియు MIG వర్గాలకు చెందిన వ్యక్తులు 3% నుండి 6.5% వరకు వడ్డీ రేట్లతో గృహ రుణాలపై సబ్సిడీ పొందవచ్చు. దీంతో లబ్ధిదారులపై ఆర్థిక భారం అనేది తగ్గుతుంది.

3) Focus on Women Empowerment : PMAY పథకం కుటుంబంలోని మహిళా సభ్యుల పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రోత్సహిస్తుంది. దీంతో మహిళలకు సాధికారత కల్పించడంలో సహాయపడుతుంది. అలాగే ఆస్తి యాజమాన్యంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది.

4) Environmental Sustainability : ఈ పథకం పర్యావరణ అనుకూలమైన నిర్మాణ పద్దతులను మరియు సామగ్రిని ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది. కొత్త గృహాలు సరసమైన ధరలకే రావడంతో పాటు, పర్యావరణానికి కూడా మంచి చేకూరుతుంది.

Beneficiary Categories Under PMAY:

ఈ పథకంలో లబ్ధిదారులను నాలుగు వర్గాలుగా విభజించడం జరిగింది. ఈ వర్గాల ప్రకారం వడ్డీ రాయితీలు మరియు ఇతర ప్రయోజనాలను అర్హులను బట్టి అందిస్తుంది.

1) EWS (ఆర్థికంగా బలహీనమైన విభాగం): 3 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉండాలి.

2) LIG (తక్కువ ఆదాయ సమూహం): వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయల నుండి Rs 6 లక్షల మధ్య ఉంటుంది.

3) MIG-I (మధ్య-ఆదాయ సమూహం: 6 లక్షల రూపాయల నుండి 12 లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉండాలి.

4) MIG-II (మధ్య-ఆదాయ సమూహం: 12 లక్షల రూపాయల నుండి 18 లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉండాలి.

Pradhan Mantri Awas Yojana-Urban (PMAY-U):

PMAY-Urban ఈ పథకం ద్వారా నాలుగు కీలకమైన కార్యక్రమాలను చేపట్టి పట్టణ ప్రాంతాల్లో సరసమైన ఇళ్లను నిర్మించడం జరుగుతుంది.

In-Situ Slum Redevelopment : పట్టణ ప్రాంతాల్లో వారి కమ్యూనిటీ నిర్మాణాన్ని పెంచుతూ అక్కడి ప్రజలకు సురక్షితమైన, ఆధునిక గృహాలను అందించడానికి స్లమ్ ఏరియా తిరిగి అభివృద్ధి చేయడం జరుగుతుంది.

Affordable Housing in Partnership : దీని ద్వారా పట్టణంలో ఉన్న పేదలకు సరసమైన ఇళ్లను అందించడానికి ప్రభుత్వం మరియు ప్రైవేట్ డెవలపర్‌ల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

Beneficiary-Led Construction : ప్రజలు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం చేకూరుతుంది.

Credit Linked Subsidy Scheme(CLSS) : Economically Weaker Sections(EWC), Low Income Group(LIG) మరియు Middle Income Group(MIG) కుటుంబాలకు ఇంటిని నిర్మించుకోవడానికి అప్పు ఇచ్చి వడ్డీ రేట్లపై రాయితీ కూడా అందిస్తుంది.

Pradhan Mantri Awas Yojana-Gramin (PMAY-G):

ఈ పథకం ద్వారా గ్రామీన్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సొంత ఇంటి కల నెరవేరుతుంది. భారతదేశంలోని గ్రామీణ కుటుంబాలకు పక్కా ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. PMAY-G స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఉజ్వల యోజన వంటి ఇతర ప్రభుత్వ పథకాలతో సన్నిహితంగా పని చేస్తుంది. ఇళ్లలో మరుగుదొడ్లు, తాగునీరు మరియు LPG కనెక్షన్లు వంటి అవసరమైన సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి.

Pradhan Mantri Awas Yojana Apply Online:

PMAY పథకం కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం మరియు ప్రభుత్వ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో చేయవచ్చు.

  1. PMAY అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి : Pradhan Mantri Awas Yojana Apply Online అధికారిక పోర్టల్
  2. మీ అర్హతకు తగిన పథకాన్ని (అర్బన్ లేదా గ్రామీణ) ఎంచుకోండి.
  3. తర్వాత మీ ఆధార్ వివరాలను నమోదు చేసి, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి.

అర్హతను తనిఖీ చేయండి: వెబ్‌సైట్ ఆదాయ వర్గం ఆధారంగా అర్హులైన లబ్ధిదారుల జాబితాను అందిస్తుంది.

Elon Musk Business Strategies: Key Lessons for Entrepreneurs

Join us on Telegram Group.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *