How to Start an Emergency Fund Easily Today

మీ జీవితంలో ఎప్పుడైనా అకస్మాత్తుగా ఇలాంటి పరిస్థితులు ఎదురై ఉంటాయి. ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రి ఖర్చులు రావడం. బిజినెస్ లోను కట్టలేకపోవడం. అనుకోకుండా కుటుంబంలో ఓ వ్యక్తి ఆదాయాన్ని కోల్పోవడం వంటివి జరిగే ఉంటాయి. ఈ టైములో మనం ఏమి చేయగలం? అప్పులు కట్టాలా? ఆస్తులు అమ్మాలా? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచించడానికి కూడా టైం ఉండదు. అలాంటి సమయాల్లో ఒకే ఒక్క ఆప్షన్ ఉంటుంది అదే ఎమర్జెన్సీ ఫండ్. అకస్మాత్తుగా వచ్చే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఒకే మార్గం – ఎమర్జెన్సీ ఫండ్. ఈ ఆర్టికల్ ద్వారా How to Start an Emergency Fund గురించి సరళంగా తెలుసుకోండి.

అయితే ముందే మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ ని ఏర్పాటు చేసుకుంటే, ఈ సమస్యల అన్నింటి నుంచి బయటపడటానికి సహాయం అవుతుంది. ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు అవసరం? అలాగే మీ ఆదాయం మరియు ఖర్చుల ఆధారంగా ఎంత డబ్బు సేవ్ చేయాలి? ఈజీగా ఎలా స్టార్ట్ చేయాలి? రోజువారీ అలవాట్లతో దీన్ని ఎలా పెంచుకోవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకొని, మీ ఆర్థిక భద్రత వైపు మొదటి అడుగు వేయండి.

How to Start an Emergency Fund

1. What Is an Emergency Fund?

సింపుల్‌గా చెప్పాలంటే ఇది మన అవసరాల కోసం ప్రత్యేకంగా ఉంచే డబ్బు, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది సాదా పొదుపు కానే కాదు. ఇది మీ జీవితానికి సేఫ్టీ నెట్ లాంటిది. అప్పటికప్పుడు మీ ఆదాయం నిలిచిపోయినా, ఎలాంటి టెన్షన్ లేకుండా నెగటివ్ పరిస్థితులను తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఇది ఎవరికీ అవసరం అంటే? ఉద్యోగస్తులు – ఉద్యోగం సెక్యూర్ గా లేనివారికి. ఫ్రీలాన్సర్స్, స్వయం ఉపాధి కలిగినవారికి. బిజినెస్ మాల్‌ల కోసం పని చేసే వాళ్లకి. కుటుంబ బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరికీ అవసరపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రతి కుటుంబానికి అవసరం.

2. Why Is an Emergency Fund Important?

వేగంగా మారుతున్న ప్రపంచంలో, ఆర్థిక వ్యవస్థలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగస్తులను అకస్మాత్తుగా తొలగించేస్తున్నాయి. వీరికి ఆ టైమ్ లో ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాల్సిందే. హెల్త్ ఇష్యూస్ కూడా భారీగా పెరిగాయి. అనుకోకుండా ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఉండాల్సిందే. దినసరి ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ ఇంపార్టెంట్. చిన్న చిన్న స్టార్టప్‌లు ఫెయిల్ అయినప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. డిజిటల్ రంగంలో పోటీ ఎక్కువైపోయింది. ఈ పరిస్థితుల్లో అవసరానికి సరిపడా ఫండ్ లేని వారు అప్పటికప్పుడు డబ్బులు కావాలంటే ఏం చేయాలో తెలియక అప్పుల్లో చిక్కుకుంటారు.

3. Emergency Fund = Peace of Mind

మీ ఇంట్లో ఎంత ఇబ్బంది పరిస్థితులు వచ్చినా, మీ దగ్గర 6 నెలల ఖర్చులకు మించిన ఫండ్ ఉంటే – మీకు భయం ఉండదు. కుటుంబ సభ్యులు సేఫ్‌గా ఫీల్ అవుతారు. మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్ట్రెస్ లేని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వైద్య ఖర్చులు అయినా, ఉద్యోగం పోయినా, ఆదాయం తాత్కాలికంగా ఆగిపోయినా. ఎన్ని సమస్యలు వచ్చినా. మీ దగ్గర 6 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే, మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, అప్పుడు మీరు ఏం చేయాలి? అనే దిక్కుతెలియని పరిస్థితిలో కాకుండా, ఎలాంటి మంచి నిర్ణయం తీసుకోవాలి? అనే ప్రశాంతతలో ఉంటారు. ఇది కేవలం డబ్బు సేవింగ్ గురించి మాత్రమే కాదు. ఇది ఒక స్ట్రెస్ ఫ్రీ జీవితం కోసం తెలివితో తీసుకునే ముందుజాగ్రత్త. ఇది మీరు మీ కుటుంబానికి ఇచ్చే నిశ్చింత భరోసా. అలాగే ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం వల్ల మీ జీవితం అదుపులో ఉంటుంది, మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ తీసుకోలేరు.

4. How Much Should You Save in an Emergency Fund?

ఎమర్జెన్సీ ఫండ్ అనేది గాలిలో అంచనా వేయడం కాదు. ఇది మీ జీవనశైలిని బట్టి స్పష్టంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. 3 నుండి 6 నెలల నెలసరి ఖర్చులను బట్టి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ నెలసరి ఖర్చు ₹30,000 అయితే, ఎమర్జెన్సీ ఫండ్ = ₹90,000 (3 నెలలకు) నుండి ₹1,80,000 (6 నెలలకు) వరకు ఉండాలి.

ఇందులో ఏమేమి కలుపుకోవాలంటే?

  • ఇంటి అద్దె
  • EMIలు
  • విద్యుత్, నీటి బిల్లులు
  • పిల్లల చదువులు
  • రవాణా ఖర్చులు
  • ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు
  • భద్రతా ఖర్చులు

ఇవి అన్నీ కలిపి మీ నిజమైన నెలసరి అవసరం ఎంత ఉందో అంచనా వేసుకోవాలి. అదే మీ ఎమర్జెన్సీ ఫండ్ లక్ష్యం అవుతుంది. ఇప్పుడు మీ ఖర్చులు అంచనా వేసుకోండి. వాటిని పట్టికలో రాసుకోండి. ఇక ఆ మొత్తానికి తగిన ఫండ్ ఏర్పాటుకు మొదటి రుపాయిని ఈరోజే సేవ్ చేయండి.

5. Where to Keep Your Emergency Fund?

ఇలాంటి చోట ఎమర్జెన్సీ ఫండ్ ను దాచుకోవాలి. అందులో ముఖ్యంగా సేవింగ్స్ అకౌంట్ లో దాచుకోవచ్చు. వీటిని తక్షణమే వాడుకోవడానికి ఉంటుంది. ఆ తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్, ఇక్కడ దాచుకోవడమే కాకుండా కొంచెం ఎక్కువ వడ్డీ కూడా పొందవచ్చు. ఇక లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా దాచుకొని తక్కువ రిస్క్ తో, తక్కువ రిటర్న్స్ పొందొచ్చు. డిజిటల్ వాలెట్ అకౌంట్లలో యాడ్ చేసుకోవచ్చు. PhonePe Wallet, Paytm Wallet మొదలైనవి – లిమిటెడ్ అవసరాల కోసం మాత్రమే ఉపయోగపడుతుంది.

Rules: రిస్క్ ఉన్న ఇన్వెస్ట్మెంట్‌లలో డబ్బులను పెట్టొద్దు (ఉదాహరణకు స్టాక్ మార్కెట్, క్రిప్టో వంటివి). అలాగే మినిమం లిక్విడిటీ ఉండే ప్లాన్స్ కి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరూ ముట్టుకోలేని ఖచ్చితమైన dedicated account గా ఉంచాలి.

6. How to Start Building an Emergency Fund from Scratch
  • మీయొక్క నెలసరి ఖర్చులు లెక్కించండి.
  • గమ్యాన్ని కూడా సెట్ చేయండి (ఉదా: ₹1,50,000)
  • ప్రతి నెలా ఒక ఫిక్స్‌డ్ అమౌంట్ ను సెట్ చేయండి. (ఉదా: ₹5,000).
  • ఎప్పుడూ ఆ ఫండ్‌ డబ్బులను వేరే ఖర్చుల కోసం వాడొద్దు.
  • ఎవరికీ చెప్పకండి – ఇది మీ ఫైనాన్షియల్ గోప్యత.
  • సామాన్య ఖర్చులకు వాడితే తిరిగి మళ్లీ యాడ్ చేయండి.

మీకు తెలిసా? 2024 సంవత్సరంలో జరిగిన ఒక సర్వే ప్రకారం, భారతదేశంలో 68% మందికి ఎమర్జెన్సీ పరిస్థితులకు తగిన డబ్బు లేదు! వాళ్లు సాధారణ పరిస్థితుల్లోనే అప్పుల్లో చిక్కిపోతున్నారు. కాబట్టి మనం వాళ్లలా ఉండకూడదు కదా?

7. Real Life Examples:

ఉదాహరణ 1: రవీందర్ అనే Hyderabad వ్యక్తి IT కంపెనీలో పని చేస్తుంటారు. అకస్మాత్తుగా కంపెనీ మూతపడింది. వీరు 5 నెలల ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసి పెట్టుకున్నారు. కొత్త ఉద్యోగం వచ్చే వరకు సాఫీగా జీవించగలిగారు.

ఉదాహరణ 2: లక్ష్మీ అనే Vijayawada అమ్మాయి భర్తకి ఆరోగ్య సమస్య వచ్చింది. ఆసుపత్రి బిల్లులు పెద్ద మొత్తంలో వచ్చాయి. ఎప్పుడో ప్లాన్ చేసి పెట్టిన ఎమర్జెన్సీ ఫండ్ వాళ్లకు లక్ష రూపాయల ఖర్చు పెట్టకుండా తప్పించింది.

8. Emergency Fund vs Other Savings vs Investment:

ఎమర్జెన్సీ ఫండ్ మనకు తక్షణ అవసరాల కోసం ఉపయోగపడుతుంది. హై లిక్విడిటీ ఉంటుంది. తక్కువ రిస్క్ ఉంటుంది. సేవింగ్స్ ఫండ్ అనేది చిన్నవి పెద్దవి కొనుగోళ్ల కోసం. లిక్విడిటీ మీడియంగా ఉంటుంది. అలాగే రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది డబ్బు పెరగడానికి బాగుంటుంది. లిక్విడిటీ తక్కువ, రిస్క్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది.

Avoid Mistakes: జీరో బ్యాలెన్స్ ఉన్నవారు కూడా అవసరం లేదులే అని డబ్బు దాచడం మర్చిపోతారు. దీన్ని సేవింగ్స్ అకౌంట్ లాగా వాడేస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని ఫండ్ దాచకపోవడం. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్‌లోనే పెట్టేస్తారు – ఇది పెద్ద తప్పు.

Emergency Fund Savings Plan: మీ ఎమర్జెన్సీ ఫండ్ గురించి కనీసం మీ భార్య లేదా భర్తకు తెలియాలి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు తెలుపడం మంచిదే.

నెలకు ₹5,000 మీరు దాచినట్లయితే 1 సంవత్సరం తర్వాత – ₹60,000, 2 సంవత్సరాల తర్వాత – ₹1,20,000, ఇది compounded అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖర్చులు కాదు, భద్రత కోసం. మీ భవిష్యత్‌ని సురక్షితంగా ఉంచే ఆర్థిక సాధనం ఈ ఎమర్జెన్సీ ఫండ్. ఇది మీ కుటుంబానికి మీరు అందించే భద్రత.

చివరగా మీరు ఎంత సంపాదిస్తున్నారన్నదానికన్నా, మీరు ఎంత దాచుకుంటున్నారన్నదే మీ భద్రత. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత, వెనక్కి చూడొద్దు. ఈరోజే మీరు మీ ఎమర్జెన్సీ ఫండ్ ను ప్రారంభించండి. ఈ కంటెంట్ ఉపయోగకరంగా అనిపిస్తే – దయచేసి మీ కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఒక్క షేర్ చేయడం వల్ల కూడా ఎవరో ఒకరి జీవితాన్ని సురక్షితంగా మార్చవచ్చు.

Understanding Credit Score & How to Improve It

అనుకోని పరిస్థితుల్లో మన ఫ్యూచర్ ఆగిపోకుండా ఉండాలంటే, ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి. ఇవాళే మొదలు పెట్టండి. చిన్న మొత్తాలతో అయినా సరే, అలవాటుగా మార్చుకుంటే మీ జీవితం సెక్యూర్ గా ఉంటుంది. ఈ బ్లాగ్‌లో చెప్పిన How to Start an Emergency Fund ద్వారా మీరు వేగంగా, సురక్షితంగా ముందుకు వెళ్లొచ్చు. మీరు తీసుకునే ఈ చిన్న నిర్ణయం, రేపటి అనేక సమస్యలకు సమాధానం అవుతుంది.

మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా అనుకోని ఆర్థిక సమస్య వచ్చింది కాబట్టి, ఎమర్జెన్సీ ఫండ్ సృష్టించడం ఒక అవసరం మాత్రమే కాదు, ఇదే మీ ఆర్థిక భద్రతకు మొదటి అడుగు. ఇప్పుడే ఈ రోజు నుండే కొద్ది కొద్దిగా ఆదా చేయడం మొదలుపెట్టి, ఈ ఫండ్‌ను మరింత బలపర్చండి. చిన్న చిన్న మొత్తం కలుపుకొని ఒక పెద్ద సహాయం మీకు చేస్తాయి. కాబట్టి అనుకోని సమస్యల సమయంలో మీరు దూకుడుగా వెళ్ళటం కాదు, మీ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం ముఖ్యం. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, దాన్ని కాపాడుకోండి! మీకొక చిన్న సలహా ఏంటంటే ఏ ఒక్క రోజూ ఆలస్యం చేయకండి, ఈరోజే మీ ఎమర్జెన్సీ ఫండ్ ప్రారంభించండి. మీ ఆదాయాన్ని, ఖర్చులను బట్టి చిన్న లక్ష్యాలు పెట్టుకుని దానిని చేరుకోండి.

FAQs:
  1. What is an emergency fund?
    అనుకోకుండా ఏర్పడే ఆర్థిక పరిస్థితుల్లో మనల్ని సేవ్ చేసే డబ్బునే ఎమర్జెన్సీ ఫండ్ అంటారు.
  2. Why do I need an emergency fund?
    ఉద్యోగం పోవడం, అనారోగ్యం క్షీణించడం, లేదా తక్షణ ఖర్చుల సమయంలో సేఫ్ గా ఉండేందుకు, ఈ ఎమర్జెన్సీ ఫండ్ అవసరం.
  3. How much money should be in an emergency fund?
    మీయొక్క నెలసరి ఖర్చులను బట్టి, కనీసం 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడే మొత్తాన్ని సేవ్ చేయాలి.
  4. What expenses should I include in my emergency fund?
    ఇంటి అద్దె, EMIలు, బిల్లులు, ఆరోగ్య ఖర్చులు, పిల్లల చదువులు, రవాణా మొదలైనవి కలుపుకొని సేవ్ చేయాలి.
  5. Where should I keep my emergency fund?
    లిక్విడ్‌గా ఉండే చోట – సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంచుకోవాలి.
  6. When should I use it?
    కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. సాధారణ ఖర్చులకు మాత్రం కాదు.
  7. How do I start building my emergency fund?
    నెలకు కొంత మొత్తాన్ని ప్రక్కన పెట్టండి. ఆటోమేటిక్ సేవింగ్ అలవాటు చేసుకోండి.
  8. Why should creating an emergency fund be a top priority?
    ఎమర్జెన్సీ ఫండ్ కి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, అనుకోని పరిస్థితుల్లో (ఉదాహరణకు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ నష్టం, లేదా అత్యవసర ఖర్చులు) ఆర్థికంగా భద్రత కలిగేందుకు ఇది సహాయపడుతుంది. అప్పులలో పడకుండా ఉండేందుకు ఇది రక్షణగా ఉంటుంది.

Investments are subject to market risks. Please do your research before investing!

Join us on Telegram Group.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *