మీరు ఎప్పుడైనా ఆర్థికంగా విజయం సాధించిన వ్యక్తులను చూస్తూ, ఈరోజు వాళ్లు ఈ స్థాయికి ఎలా వచ్చారు, అని ఆలోచించారా? వారి వద్ద ప్రత్యేకంగా ఏదైనా సీక్రెట్ ఉందా? నిజానికి అది అదృష్టం కాదు, వారు పాటించే అలవాట్లే వారి విజయానికి కారణం. ఇప్పుడు మీరు, అత్యంత విజయవంతమైన వ్యక్తులు పాటిస్తున్న 7 ప్రాక్టికల్ డబ్బు అలవాట్లు గురించి తెలుసుకుంటారు. కాబట్టి ఈ Financial Habits of Highly Successful People గురించి తెలుసుకోండి. మీరు విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా, వ్యాపారవేత్త అయినా, ఇవి మీ జీవితాన్ని ఆర్థికంగా మార్చేస్తాయి.
Financial Habits of Highly Successful People
1. Track Every Rupee: విజయవంతమైన వ్యక్తులు తమ ఖర్చులను, ఆదాయం అన్నీ ట్రాక్ చేస్తారు. కాబట్టి వాళ్లకు ప్రతి రూపాయి ఎలా వచ్చిందో, ఎక్కడ ఖర్చయిందో స్పష్టంగా తెలుస్తుంది. Walnut, Money Manager, Goodbudget లాంటి మొబైల్ యాప్స్ ను ఉపయోగించి ప్రతి రూపాయిని కూడా ట్రాక్ చేయవచ్చు. అలాగే గూగుల్ షీట్స్ లేదా Excel షీట్ లో నోట్ చేస్తూ కూడా ప్రతి రూపాయిని ట్రాక్ చేయవచ్చు. ఇప్పుడొక చిన్న చిట్కా ఇస్తా. ప్రతిరోజూ 5 నిమిషాలు డబ్బు ట్రాకింగ్‌కు కేటాయించండి. దీంతో మీ సేవింగ్స్‌ను గణనీయంగా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడినుంచి ఆదాయం వస్తుంది, ఎక్కడెక్కడ ఖర్చు అవుతుందనేది సులభంగా అర్థం అవుతుంది కాబట్టి.
2. Prioritize Saving Before Spending: అత్యధికంగా డబ్బు సంపాదించేవారు కూడా సేవ్ చేయకపోతే పేదవారిగానే మిగిలిపోతారు. కాబట్టి విజయవంతమైనవారు మాత్రం ప్రతి నెల తనకు తాను ముందుగా డబ్బు సేవ్ చేస్తారు. ఆపై మిగతా ఖర్చులు లాంటివి చూసుకుంటారు. దీనినే Pay Yourself First అంటారు. ఇప్పుడు మీకోక చిన్న చిట్కా చెప్తా చూడండి. ప్రతి నెల జీతం వచ్చిన వెంటనే కొంత భాగాన్ని SIP, RD, లేదా బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో జమ చేయండి. ఇందులో మీరు ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ సెటప్ చేసుకోవచ్చు. మంచి ఉదాహరణ ఏంటంటే, జీతం వచ్చిన వెంటనే కనీసం 20% ఆదాయాన్ని సేవ్ చేయండి.
3. Avoid Bad Debt: విజయవంతమైన వ్యక్తులు క్రెడిట్ కార్డు వంటి నష్టదాయకమైన అప్పులను ఎప్పటికీ తీసుకోరు. అందువల్ల అవసరం లేని ఖర్చులను తగ్గించి, అవసరం ఉన్న వాటికి మాత్రమే ఉపయోగిస్తారు. ఎలా అంటే, అప్పు అనేది సంపద సృష్టించడానికి మాత్రమే చేస్తారు. తాను ఉపయోగించుకోవడానికి చేయరు. మంచి అప్పు అనేది (వినియోగానికి కాదు, సంపద సృష్టించడానికి) మాత్రమే తీసుకుంటారు. అప్పులు చెల్లించడంలో Snowball లేదా Avalanche మెథడ్ ను ఫాలో అవుతారు.
4. Invest Regularly: ఒక్కసారి మాత్రమే ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే, ఎప్పటికీ ధనవంతులు అవ్వలేరు. అందువల్ల ప్రతి నెలా కొంచెం కొంచెం పెట్టుబడి పెడుతూ ఉండండి. అప్పుడే మిమ్మల్ని మీరు నిలదొక్కుకొని, ఆర్థికంగా స్ట్రాంగ్ గా నిలబడగలుగుతారు. ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఏంటంటే, Systematic Investment Plan (SIP). Groww, Zerodha వంటి యాప్స్ ద్వారా Mutual Funds, National Pension Scheme (NPS) లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. ప్రతి నెలకు ₹5,000 పెట్టుబడి, 12% వడ్డీతో 10 సంవత్సరాల్లో ₹10 లక్షలకుపైగా పెరుగుతుంది. కాబట్టి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ని తక్కువ అంచనా వేయకండి.
5. Learn Continuously: సక్సెస్ఫుల్ పీపుల్ నిత్యం ఆర్థిక విషయాలను తెలుసుకుంటారు. ఎలా అంటే న్యూస్ పేపర్ మరియు బుక్స్ చదవడం, అలాగే వీడియోస్ చూడటం వంటివి చేస్తారు. ఇప్పుడు మీరు ఈ ఆర్టికల్ చదువుతున్నట్టు ఆర్థిక విషయాలు తెలుసుకుంటారు. ఉదాహరణకు రోజుకు కనీసం 15 నిమిషాలు వ్యక్తిగత ఆర్థిక విషయాలను చదవడం, YouTube ఛానళ్ల ద్వారా లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్, పన్నులు గురించి తెలుసుకోవడం వంటివి చేస్తారు. లైఫ్ లో ఒక్కసారైనా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన బుక్స్ మీకు చెప్తాను. వీటిని చదివితే ఖచ్చితంగా మీ ఆర్థిక ఆలోచనలు మారుతాయి. ఈ బుక్స్ మీకు కావాలనుకుంటే వాటిపై క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి.
6. Set Financial Goals: సక్సెస్ఫుల్ పీపుల్ డబ్బే లక్ష్యంగా పనిచేస్తారు. కాబట్టి వారి యొక్క జీవన విధానాన్ని డబ్బుకు అనుగుణంగా మార్చుకుంటారు. ఎలా అంటే షార్ట్ టర్మ్ అవసరాలకు ఎమర్జెన్సీ ఫండ్. మిడ్ టర్మ్ అవసరాలకు కార్ లేదా ఇంటి యొక్క Down Payment. అలాగే లాంగ్ టర్మ్ అవసరాలకు రిటైర్మెంట్ ఫండ్, పిల్లల చదువు లాంటివి ప్లాన్ చేసుకుంటారు. వారు ముఖ్యంగా SMART Goals (Specific, Measurable, Achievable, Relevant, Time-bound) ని ఫాలో అవుతారు. కాబట్టి మీరు మీ లక్ష్యాలను SMART గా ప్లాన్ చేసుకోండి.
Comprehensive Financial Management for Wealth Building – 10 Steps for You
7. Live Below Their Means: ఎప్పుడైనా సక్సెస్ఫుల్ పీపుల్ ఖర్చు చేసే ముందు ఆలోచిస్తారు. వారు ఎలాంటి ఖర్చు చేసినా అర్థవంతంగా, అవసరాలకు తగినట్లుగా కొనుగోలు చేస్తారు. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ప్రధాన లక్షణం ఇవే. ఎందుకంటే అవసరం లేనివాటిపై ఖర్చు తగ్గించి, ప్రతి ఖర్చును ఇది నిజంగా అవసరమా? అని ఆలోచించి తీసుకుంటారు. ఎప్పుడూ ఆనందం కోసం ఖర్చు పెట్టకుండా, అవసరం ఉంటేనే ఖర్చు చేయండి. అదేవిధంగా వృధా ఖర్చులు తగ్గించి, ఉన్నదాంట్లోనే సర్దుకోండి.
చివరగా ఈ 7 అలవాట్లు – ట్రాకింగ్, సేవింగ్, పెట్టుబడులు, అప్పుల నివారణ, చదువు, లక్ష్యాలు, ఖర్చు నియంత్రణ. ఇవన్నీ పాటిస్తే మీరు కూడా ఆర్థికంగా విజయవంతం కావచ్చు. ఇప్పుడు మీరే చెప్పండి. ఈ రోజు నుంచి ఏ అలవాటును ప్రారంభించబోతున్నారు? కామెంట్ చేయండి లేదా సక్సెఫుల్ అవ్వాలని ఎవరైతే అనుకుంటారో వారికి ఈ ఆర్టికల్‌ను షేర్ చేయండి. Financial Habits of Highly Successful People గురించి పూర్తిగా తెలుసుకొని, మీరు సక్సెస్ అవ్వండి, అలాగే మీతోపాటు అందరినీ సక్సెస్ చేయండి. ఇవే ధనవంతులవుతున్న వ్యక్తులు ప్రతిరోజూ అనుసరిస్తున్న 7 ఆర్థిక అలవాట్లు. మీరు కూడా ఈ అలవాట్లను ఫాలో అయితే ధనవంతులు అవ్వచ్చు.
Join us on Telegram Group.
Leave a Reply