ఈ రోజుల్లో, వుద్ధి అంటే కేవలం స్కిల్స్ ఉండటం మాత్రమే కాదు. మీ మైండ్‌సెట్ కూడా చాలా ముఖ్యమైనది. ఇద్దరు వేరు వేరు వ్యక్తులు ఒకే ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఒకరేమో వేగంగా ఎదుగుతారు, మరొకరు అలాగే నిలబడిపోతారు. ఇలా ఎందుకు జయుగుతుంది? ఇక్కడ వారు ఏమి చేస్తారు? అనేది కాదు, వారు ఎలా ఆలోచిస్తారు? అనే విషయం ఇంపార్టెంట్. సంతోషకరమైన విషయం ఏమిటంటే, మీరు కొత్తగా డిగ్రీ లేదా పదేళ్ల అనుభవం అవసరం లేకుండా, మీ మైండ్‌సెట్ చేంజ్ చేసుకుంటే కేవలం 30 రోజుల్లో మీ కెరీర్‌ను చేంజ్ చెలుకోవచ్చు. ఇప్పుడు మనం Professional Development Plan అనేది టాపిక్ గురించి తెలుసుకుందాం. 30 రోజుల్లో మీ మైండ్‌సెట్ ను మార్చుకుంటే, మీ కెరీర్ ఎలా బూస్ట్ అవుతుందో తెలుసుకునేదే ఈ టాపిక్.
నేడు మనం ఎంత కష్టపడి ఏం నేర్చుకున్నా జీవితంలో ఎదగట్లేదంటే అప్పుడు మనం మార్చుకోవాల్సింది మన టాలెంట్ కాదు. మన ఆలోచన విధానం (Mindset). కాబట్టి ఎన్నో సందేహాలు, limitations, comparison, short-term ఆలోచనలు మన ఎదుగుదలకు బ్రేకుల్లా మారతాయి. అందుకే మనం ఫిక్స్డ్ మైండ్‌సెట్ నుంచి గ్రోత్ మైండ్‌సెట్‌కి మారే ప్రాక్టికల్ మార్గాల గురించి తెలుసుకుందాం. ఫిక్స్డ్ మైండ్‌సెట్ అనేది నేను ఇంతకంటే ఎక్కువ ఎదగలేను అన్న భావన కలుగుతుంది. కానీ గ్రోత్ మైండ్‌సెట్ మాత్రం నేను నేర్చుకోగలను, ఎదగగలను అన్న నమ్మకాన్ని నింపుతుంది. ఉద్యోగి స్థాయిలో ఆలోచిస్తే, పనిని పూర్తి చేయడమే లక్ష్యంగా ఉంటుంది. కానీ ఒనర్షిప్ ఆలోచనతో పనిపై బాధ్యత తీసుకుంటారు, లాంగ్ టర్మ్ విజన్‌తో ముందుకు సాగుతారు.
అలాగే కంఫర్ట్ జోన్ లో ఉండటం సేఫ్ గా ఫీల్ అవుతారు. కానీ ఎలాంటి ఎదుగుదల ఉండదు. అసలైన ఎదుగుదల లెర్నింగ్ జోన్లో మాత్రమే జరుగుతుంది. అందుకే కొత్త పనులు, కొత్త బాధ్యతలు భయపడకుండా తీసుకోవాలి. షార్ట్ టర్మ్ ఫలితాల కోసం పరితపించకండి. లాంగ్ టర్మ్ విజన్ ఉన్నప్పుడు చిన్న చిన్న అపజయాలు కూడా మీ ప్రగతికి దారి చూపిస్తాయి. ఇతరులతో పోల్చుకోవడం వల్ల మనలో నమ్మకం తగ్గుతుంది. అలా కాకుండా నిన్నటి మీతో నేటి మిమ్మల్ని పోల్చుకోండి. అప్పుడే నిజమైన అభివృద్ధి కన్పిస్తుంది. ఫీడ్‌బ్యాక్ అంటే తప్పుని మాత్రమే చూపించడం కాదు. దానిని అంగీకరించి, మెరుగుపడదలచుకుంటేనే నిజమైన ప్రొఫెషనలిజం మొదలవుతుంది. ఎంతసేపు పని చేసారని కాకూండా, ఆ పనిలో ఎంత విలువ సృష్టించగలిగారు అనేదే ముఖ్యం.
Professional Development Plan
Why Mindset Matters in Career Growth మైండ్‌సెట్ అనేది మీయొక్క ఇంటర్నల్ సాఫ్ట్వేర్ లాంటిది. ఇది పాతదిగా, నెమ్మదిగా ఉంటే, మీ పనితీరు దెబ్బతింటుంది. ఎంత బలమైన హార్డ్‌వేర్ ఉన్నా కూడా. ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే మనం మైండ్‌సెట్ అనుకోవచ్చు. అలాగే హార్డ్‌వేర్ అంటే స్కిల్స్ అని చెప్పుకోవచ్చు.
- Growth Mindset: అనేది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ, తనకుతానుగా అవకాశాలను సృష్టించుకునే మనస్తత్వం.
- Ownership Mindset: అనేది ఉద్యోగులను నాయకులుగా మార్చే మనస్తత్వం.
- Value-Driven Mindset: అనేది విలువలతో కూడిన మనస్తత్వం.
మీరు వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటే, ఈ మైండ్‌సెట్ చేంజెస్ చేపట్టడమే మొదటి అడుగు అవుతుంది.
Sample Career Development Plan
ఈ రోజుల్లో సక్సెస్ఫుల్ గా ఎదగాలంటే కేవలం స్కిల్స్ ఉంటే సరిపోదు. మైండ్‌సెట్ అనే శక్తివంతమైన ఆయుధం కూడా అవసరం. ఎందుకంటే ఇద్దరు ఒకే స్కిల్, ఒకే ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఒకరు ముందుకు దూసుకెళ్తారు, మరొకరు అలాగే ఆగిపోతారు. దీనికి కారణం వారు ఏం చేస్తున్నారు? అనేది కాదు. వారు ఎలా ఆలోచిస్తున్నారు? అనేదే ముఖ్యం. సంతోషకరమైన విషయం ఏమిటంటే, మీరు పెద్దగా డిగ్రీలు, అనుభవం లేకుండానే, కేవలం మీ ఆలోచనా విధానాన్ని మార్చుకొని 30 రోజుల్లో మీ కెరీర్‌ను కొత్త దిశగా నడిపించవచ్చు. కాబట్టి మీరు విద్యార్థి అయినా, ఉద్యోగంలో ఉన్నా లేదా కెరీర్‌ను రీస్టార్ట్ చేయాలనుకున్నా, మీకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపుతుంది. కాబట్టి ఇప్పుడే మొదలు పెట్టండి. మీ బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే మీ మైండ్‌సెట్‌ను అప్‌గ్రేడ్ చేయండి.
1. Fixed Mindset → Growth Mindset
ఫిక్స్ మైండ్‌సెట్ అనేది, నాకు ఇది రాదు అని చెప్పుకుంటారు. కానీ గ్రోత్ మైండ్‌సెట్, నేను దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయగలను? అని అడుగుతుంది. ఇప్పుడు మీరు చేయవల్సింది, ప్రతి వారంలో ఒక కొత్త విషయం నేర్చుకోడానికి కనీసం 30 నిమిషాలు కేటాయించండి. LinkedIn Learning, Udemy, YouTube వంటి ప్లాట్‌ఫారమ్‌లను కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఉపయోగించండి. ఉదాహరణకు నాకు ప్రెజెంటేషన్ రాదు అనే కన్నా, పబ్లిక్ స్పీకింగ్ పై చిన్న కోర్స్ తీసుకొని వారానికి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది.
2. Employee Thinking → Ownership Thinking
ఎక్కువ మంది ఉద్యోగస్థులు తమ పనిని ఒక చెక్‌లిస్ట్ ద్వారా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే నాయకులు మాత్రం, పనిని కాకుండా వాటిపై ప్రభావం పై ఎలా ఉంటుందో ఆలోచిస్తారు. ఈ ప్రాజెక్ట్ నా దగ్గర ఉంటే నేను దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయగలను? అని ఆలోచించుకోండి. మీరు ఇంప్రూవ్ చేసిన దానిని డాక్యుమెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇవి అప్రైజల్ లేదా ఇంటర్వ్యూ సమయంలో ఉపయోగపడతాయి. అవి చెయ్ ఇవి చెయ్ అని కాకుండా, చేసి చూపించే పట్టుదల గలవారిగా మీరు గుర్తించబడతారు.
3. Comfort Zone → Learning Zone
మీకు తెలిసిన నాలెడ్జ్ తో అలాగే ఉండటం అనేది సేఫ్ అని చెప్పవచ్చు. కానీ అప్డేట్ కాకుండా ఉండటం అనేది మీయొక్క గ్రోత్ ని ఆపేస్తుంది. కాబట్టి కంఫర్ట్ జోన్ వదిలేసి కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకొని అప్డేట్ అవ్వండి. ఎలా అంటే మీరు ఎప్పుడూ చేయని ఒక కొత్త ప్రాజెక్ట్ ని ఛాలెంజింగ్ గా తీసుకొని చేయండి. కొత్త దారులు భయంకరంగా ఉన్నా వాటిని మీరు అవకాశాలుగా భావించండి. మీరు కొత్త అనుభవాలు పొందేటప్పుడు, మీ మెదడులో న్యూరోప్లాస్టిసిటీ జరుగుతుంది. అప్పుడు మీయొక్క గ్రోత్ అనేది అసౌకర్యాన్ని కోరుకుంటుంది.
4. Short-Term Wins → Long-Term Vision
షార్ట్ టర్మ్ సక్సెస్ కాకుండా, లాంగ్ టర్మ్ సక్సెస్ పై ఫోకస్ పెట్టండి. ఎలా అంటే వారసత్వం మాదిరి. ముందుగా ఒక సంవత్సరం మరియు ఐదు సంవత్సరాల కెరీర్ లక్ష్యాలను సెట్ చేయండి. వీటిని నెలవారీ, వారాంత సమయం పనులుగా విభజించండి. ఆ తర్వాత రోజువారీ, గంటల వారీగా విభజించుకోండి. మీ గ్రోత్ ని ట్రాక్ చేయడానికి కెరీర్ గోల్ ట్రాకర్ ను Google Sheet లేదా Notion లో యాడ్ చేయండి.
5. Comparison → Self-Improvement
LinkedIn మరియు Instagram యుగంలో, వెనుకబడి ఉన్నట్లు అనిపించడం సులభం. కానీ మీ పోటీ మాత్రం వేరే వాళ్ళు కాదు, మీ గతమే మీ పోటీ. కాబట్టి ఈ వారం నేను గత వారం కంటే ఏం ఇంప్రూవ్ అయ్యాను? అని ప్రతి వారం చివరలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చిన్న చిన్న విజయాలను మరియు వృద్ధిని ఒక నోట్ బుక్ లో లేదా జర్నల్ లో యాడ్ చేయండి. ఎప్పుడూ కూడా మీయొక్క మొదటి చాప్టర్ ను ఇతరుల 20 వ చాప్టర్ తో పోల్చకండి.
6. Avoiding Feedback → Seeking Feedback
చాలా మంది ఫీడ్‌బ్యాక్ నెగటివ్ గా ఉంటుంది అని భయంతో దానిని వదిలేస్తారు. కానీ ఫీడ్‌బ్యాక్ అనేది మీయొక్క అభివృద్ధికి ఇంధనం లాంటిది. నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయం ఏంటని, ప్రతి వారం ఒక వ్యక్తిని (మేనేజర్ లేదా స్నేహితుడు) అడగండి. అలా తప్పకుండా అమలు చేయండి మరియు ఫలితాలను చూపించండి. మీరు ఇప్పటివరకు పొందిన ఫీడ్‌బ్యాక్‌ను డాక్యుమెంట్ చేసి ప్రతినెలా దాన్ని ట్రాక్ చేస్తూ ఉండండి.
7. Time Focused → Value Focused
గంటలు గంటలు మీరు పడే కష్టానికి వారు పే చేయట్లేదు, వాళ్లకు వచ్చే ఫలితాల కోసం పే చేస్తున్నారు. మీ టాప్ 3 అధిక విలువ కలిగిన పనులను గుర్తిస్తే, అవే మీ నిజమైన ఫలితాలను సృష్టిస్తాయి. వీటికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టండి. తక్కువ ఇంపార్టెంట్ అయిన మీటింగ్స్, ఇమెయిల్స్ మీద కాకుండా. 80/20 అనే పరేటో నియమాలను అనుసరించండి. మీకు వచ్చిన 80% ఫలితాలు, కేవలం మీరు చేసిన 20% ప్రయత్నాల నుండి వస్తాయి.
Tools and Resources:
- 30-రోజుల కెరీర్ మైండ్‌సెట్ ఛాలెంజ్ ని ఇప్పుడే స్వీకరించండి.
- వారం వారం రివ్యూ చేసే టెంప్లేట్ రెడీ చేయండి.
- చదవాల్సిన పుస్తకాలు:
- Mindset – కరోల్ డ్వెక్
- Atomic Habits – జేమ్స్ క్లియర్
- Deep Work- కాల్ న్యూ పోర్ట్
Bonus: Real-Life Example
ప్రియ అనే అమ్మాయి ఒక మార్కెటింగ్ అసోసియేట్, తన రోల్ లో 2 సంవత్సరాల పాటు అలాగే స్టక్ అయిపోయింది. ఆమె తన మైండ్‌సెట్ ను చేంజ్ చేసుకోవడానికి క్రింది విషయాలపై ఫోకస్ పెట్టింది. ఒక చిన్న ఇంటర్నల్ క్యాంపెయిన్ మేనేజ్ చేయడానికి ఇనిషియేటివ్ తీసుకుంది. తన టీమ్ నుండి ఫీడ్‌బ్యాక్ కోరింది. గూగుల్ అడ్స్ పై ఫ్రీ కోర్సు చేయడం స్టార్ట్ చేసింది. 6 నెలల్లో కాంపెయిన్ మేనేజర్ అవడానికి లక్ష్యాన్ని సెట్ చేసింది. 90 రోజులలోనే ఆమె ప్రొమోట్ అయింది. మరియు ఇప్పుడు జూనియర్ మార్కెటర్లకు తను మార్గనిర్దేశం చేస్తున్నారు.
Top Reasons Why Your Resume Isn’t Working in 2025
మీ మైండ్‌సెట్ అనేది పక్కాగా ఉండదు— ఎప్పుడైనా సవరించుకోవచ్చు. మీరు ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నా మైండ్‌సెట్ ను మార్చుకోవచ్చు. ఇప్పుడు చేసే ఒక చిన్న మార్పు కూడా కాలంతో పెద్దగా మారవచ్చు. రాబోయే 30 రోజుల్లో ఎలాంటి మైండ్‌సెట్ ఉండాలని కోరుకుంటున్నారు? క్రింద కామెంట్స్ లో తెలియపరచండి. చివరగా, కెరీర్లో ఎదగాలంటే కేవలం నైపుణ్యాలు, అనుభవం కాదు, మైండ్‌సెట్ కూడా చాలా కీలకం. ఈ ఆర్టికల్ లో చెప్పిన చిన్న చిన్న మైండ్‌సెట్ మార్పులు ప్రతి రోజు పాటిస్తే, మీరు 30 రోజుల్లోనే మీ కెరీర్‌ను అద్భుతంగా మెరుగుపరచుకోవచ్చు. Sample Career Development Plan అనేది ఒక లక్ష్యం కాదు, మీరు తీసుకునే ప్రతి చిన్న మంచి నిర్ణయం వల్ల సాధ్యమయ్యే మార్గం. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. మీ ఆలోచనలు మార్చండి, మీ కెరీర్ మారుతుంది.
ఇప్పటివరకు మనం తెలుసుకున్న అన్నింటినీ మీరు నిజంగా అర్థం చేసుకుని జీవన శైలిలో పాటిస్తే, మీరు చేసే ప్రతి పని మీద కంట్రోల్ వస్తుంది. మీ ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా మీరు బాగా ఎదుగుతారు. నేటి ఒక చిన్న మార్పు-రేపటి పెద్ద విజయాలకు మార్గం. మరి మీరు రెడీనా మీ మైండ్‌సెట్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు?
Join us on Telegram Group.