Complete List of IPL Team Owners and Net Worth

భారతీయ క్రికెట్‌లో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఒక ఆట పండుగ మాత్రమే కాదు. ఇది కోట్లాది రూపాయల విలువైన వ్యాపార సామ్రాజ్యం. IPL Team Owners ఎవరు? ఈ కీలక పదం వెనుక ఉన్న వ్యాపార రహస్యం తెలుసుకోవాలనుకుంటే, ఈ ఆర్టికల్ మీకోసమే. ప్రతి IPL జట్టు వెనుక ఒక గొప్ప బిజినెస్ మైండ్ ఉంటుంది. వాళ్ళు పెట్టుబడులు పెట్టి, బ్రాండ్‌ను నిర్మించి, క్రికెట్‌ను వ్యాపారంగా మార్చే దిశగా నడిపిస్తున్నారు.

ఈ వ్యాసంలో మనం 2025 సంవత్సరం నాటికి ప్రతి ఐపీఎల్ జట్టు యజమాని ఎవరో, వాళ్ల సంపద ఎంత, అలాగే వాళ్ల స్ట్రాటజీ ఏంటో అద్భుతమైన సమాచారంతో వివరించాం. ఈ ఆర్టికల్‌లో మీరు తెలుసుకునే విషయాలు:

  • ప్రతి జట్టు యజమాని వివరాలు మరియు వాళ్ల నెట్‌వర్త్.
  • వ్యాపార వృద్ధిలో ఐపీఎల్ యజమానుల పాత్ర.
  • టీమ్‌లు ఎలా ఆదాయం పొందుతున్నాయో!
  • యువ వ్యాపారులకు ఉపయోగపడే వ్యూహాలు మరియు స్ఫూర్తిదాయకమైన విషయాలు.

ఈ సమాచారం క్రికెట్ అభిమానులకు మాత్రమే కాకుండా, వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు కూడా మోటివేషన్ ఇచ్చే విధంగా ఉంటుంది. దీన్ని చదవడం ద్వారా మీరు కేవలం ఆట గురించి కాదు, వ్యాపారం ఎలా నడుస్తుందో కూడా తెలుసుకుంటారు.

IPL Team Owners and Their Net Worth

1. Mumbai Indians : ముంబై ఇండియన్స్ జట్టు యజమాని ఎవరంటే, రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఇండియా విన్ స్పోర్ట్స్. ఇక్కడ ప్రధాన వ్యక్తి ముకేశ్ అంబానీ. ఈ జట్టు నికర విలువ $92.8 billion. భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ముంబై ఇండియన్స్ జట్టుకి యజమానిగా ఉంది.

2. Chennai Super Kings : చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ యొక్క యజమాని ఇండియా సిమెంట్స్. ప్రధాన వ్యక్తి ఎన్. శ్రీనివాసన్. ఈ టీమ్ నికర విలువ $2.35 billion. BCCI మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ CSK జట్టును విజయవంతంగా నడుపుతున్నారు.

3. Kolkata Knight Riders : కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ యజమానులు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, జయ్ మెహతా నికర విలువలు క్రింది విధంగా ఉన్నాయి. బాలీవుడ్ ప్రముఖులు కలసి KKR జట్టుకి యజమానిగా ఉన్నారు.

  • షారుఖ్ ఖాన్: $770 million
  • జూహీ చావ్లా: $531 million
  • జయ్ మెహతా: $2.1 billion

4. Delhi Capitals : ఈ ఢిల్లీ క్యాపిటల్ టీమ్ యొక్క యజమానులు GMR గ్రూప్, JSW గ్రూప్. ఇందులో ప్రధాన వ్యక్తులు పార్థ్ జిందాల్, కిరణ్ కుమార్ గ్రాంధీ. వీరి నికర విలువలు క్రింది విధంగా ఉన్నాయి. ఇండస్ట్రియల్ దిగ్గజాలు కలసి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి యజమానిగా ఉన్నారు.

  • JSW గ్రూప్: $7.68 billion
  • GMR గ్రూప్: $3.2 billion

5. Royal Challengers Bangalore : ఈ టీమ్ యొక్క యజమాని డియాజియో అనుబంధ సంస్థ అయినటువంటి యునైటెడ్ స్పిరిట్స్. ఈ టీమ్ నికర విలువ $1.2 billion. RCB జట్టు యునైటెడ్ స్పిరిట్స్ ద్వారా యాజమాన్యం పొందుతోంది.

6. Sunrisers Hyderabad : ఈ టీమ్ యొక్క యజమాని సన్ గ్రూప్. ఇక్కడ ప్రధానమైన వ్యక్తి కళానిధి మారన్. వీరి నికర విలువ $2 billion. సన్ టీవీ నెట్‌వర్క్ అధినేత కళానిధి మారన్ SRH జట్టుకి యజమానిగా ఉన్నారు.

7. Rajasthan Royals : ఈ రాజస్థాన్ రాయల్స్ టీమ్ యజమానులు Emerging Media అధినేత మనోజ్ బడాలే, Lachlan Murdoch అధినేత లాక్లాన్ మర్డాక్. రాజస్థాన్ రాయల్స్ జట్టు యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ముందు ఉంటుంది. వీరియొక్క నికర విలువలు క్రింది విదంగా ఉన్నాయి.

  • మనోజ్ బడాలే: $160 million
  • లాక్లాన్ మర్డాక్: $2.1 billion

8. Punjab Kings : ఈ పంజాబ్ టీమ్ యజమానులు మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింటా, కరణ్ పాల్. పంజాబ్ కింగ్స్ జట్టు బలమైన యజమాన్యంతో ముందుకు సాగుతోంది. వీరి నికర విలువలు క్రింది విధంగా ఉన్నాయి.

  • Dabur Group (Mohit Burman): $10.4 billion
  • Ness Wadia: $6.7 billion
  • Preity Zinta: $15 million

9. Lucknow Super Giants : ఈ లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ యజమాని RPSG గ్రూప్. ఇందులో ప్రధాన వ్యక్తి సంజీవ్ గోయెంకా. ఈ టీమ్ నికర విలువ $4.5 billion. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కొత్తగా లీగ్‌లో చేరి మంచి ప్రదర్శన చూపుతోంది.

10. Gujarat Titans : ఈ టీమ్ యొక్క యజమానులు CVC క్యాపిటల్ పార్ట్నర్స్, టోరెంట్ గ్రూప్. వీరి నికర విలువలు క్రింది విధంగా ఉన్నాయి. CVC Capital Partners (33%), Torrent Group (67%) విలువ కలిగి ఉంది. గుజరాత్ టైటన్స్ జట్టు 2022 సంవత్సరంలో లీగ్‌లో చేరి, మొదటి సీజన్‌లోనే విజయం సాధించింది.

ఈ జట్ల యజమానులు తమ వ్యాపార మోడళ్లతో, పెట్టుబడులతో IPL లీగ్‌ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా చేశారు. వారి నికర విలువలు, వ్యాపార దృష్టికోణాలు లీగ్ విజయానికి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఐపీల్ టీం ఓనర్స్ ని IPL Team Sponsors List అని కూడా అనవచ్చు.

Understanding the IPL Business Model

IPL అంటే కేవలం క్రికెట్ టోర్నమెంట్‌ మాత్రమే కాదు. ఇదొక కోట్లాది రూపాయల విలువ కలిగిన వ్యాపార రంగం. ప్రతి టీమ్ వెనుక కూడా బలమైన business model ఉంటుంది. ఈ లీగ్‌కి ఫ్రాంచైజీలు ఎలా డబ్బు సంపాదిస్తున్నాయి? వాటి ఆదాయ మార్గాలు ఏమిటి? ఇప్పుడు వాటిని వివరంగా తెలుసుకుందాం.

1. Media Rights : IPL లీగ్‌లో ఎక్కువ భాగం ఆదాయం బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల ద్వారా వస్తుంది. BCCI ఈ హక్కులను ప్రముఖ టీవీ మరియు OTT సంస్థలకు వేల కోట్లకు అమ్మేస్తుంది. తర్వాత, ఈ మొత్తంలో నుంచి కొంత భాగాన్ని ప్రతి టీమ్‌కు వాటా రూపంలో ఇస్తుంది. ఉదాహరణకు స్టార్ స్పోర్ట్స్ లేదా జియో సినిమా లాంటి సంస్థలు ఈ హక్కుల కోసం భారీ మొత్తాన్ని BCCI కి చెల్లిస్తాయి.

2. Sponsorships : ప్రతి ఒక్క టీమ్‌కు IPL Jersey స్పాన్సర్‌లు, టైటిల్ స్పాన్సర్‌లు, అధికారిక భాగస్వాములు ఉంటారు. ఇవి ఫ్రాంచైజీకి మరింత ఆదాయాన్ని అందిస్తాయి. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ జెర్సీపై BYJU’S, Slice లాంటి బ్రాండ్‌లు కనిపిస్తాయి. ఈ బ్రాండ్స్ డబ్బు చెల్లించి బ్రాండ్ ప్రమోషన్ చేయించుకుంటాయి.

3. Ticket Sales : ప్రతి టీమ్‌కి వారి హోం మైదానంలో మ్యాచ్‌లు జరుగుతాయి. వాటికి టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా ఫ్రాంచైజీకి వస్తుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ముఖ్యమైన మ్యాచ్‌ల సమయంలో టికెట్ల ధరలు కూడా పెరుగుతాయి, అప్పుడు ఆదాయం మరింత పెరుగుతుంది.

4. Merchandise Sales : IPL Team Jersey, క్యాప్స్, మొబైల్ కవర్లు, కీచెయిన్లు లాంటి ఫ్యాన్ మెర్చండైజ్ అమ్మడం ద్వారా కూడా ఆదాయం వస్తుంది. ఈ బ్రాండెడ్ ప్రోడక్ట్‌లు అభిమానులు కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు CSK జెర్సీ ధరించి మైదానానికి వెళ్లే అభిమానులను మీరు చూసే ఉంటారు.

5. Franchise Fees & Auctions : కొత్తగా జతయ్యే టీమ్‌లు (ఉదా: లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్) BCCIకి వెయ్యి కోట్లకు పైగా ఫ్రాంచైజీ ఫీజు చెల్లిస్తాయి. ఇది పూర్తిగా BCCI ఆదాయంగా మారుతుంది, కాకపోతే దీని ద్వారా మొత్తం లీగ్ విలువ పెరుగుతుంది. అలాగే, ఆటగాళ్ల వేలం ద్వారా కూడా మనీ ఫ్లో కంటిన్యూగా ఉంటుంది. దాదాపుగా అన్ని టీమ్‌లు ఆటగాళ్ల కోసం వేల కోట్ల బిడ్లు వేస్తాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్. ఈ లీగ్‌లో పాల్గొనే ప్రతి జట్టు వెనుక ఒక శక్తివంతమైన యజమాని లేదా సంస్థ ఉంటుంది. ఈ యజమానులు తమ పెట్టుబడులు, వ్యాపార మోడళ్లతో జట్ల విజయాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ వ్యాసంలో, 2025 నాటికి IPL జట్ల యజమానులు మరియు వారి నికర విలువల గురించి తెలుగులో సమగ్ర సమాచారం అందించబడింది.

Business Strategies of IPL Team Owners

IPL అనేది కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు. ఇది ఒక పెద్ద వ్యాపార వేదిక అని మనం ముందుగానే చెప్పుకున్నాం. ప్రతి జట్టు వెనుక ఉన్న యజమానులు తమ వ్యాపార దృష్టికోణంతో IPL ను ఒక మల్టీ-బిలియన్ డాలర్ బ్రాండ్‌గా తీర్చిదిద్దారు. ఈ విభాగంలో, వారు ఏ స్ట్రాటజీ అనుసరిస్తున్నారో, ఎలా మున్ముందు ఆలోచిస్తున్నారో ఇప్పుడు చూద్దాం.

1. Diversification : IPL Team Owners తమ వ్యాపారాలను కేవలం భారతదేశానికే పరిమితం చేయకుండా ఇతర దేశాల్లోనూ విస్తరించారు. ఉదాహరణకు సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్, దక్షిణాఫ్రికాలో Sunrisers Eastern Cape అనే జట్టుని ప్రారంభించారు. ఇలా, ఒకే బ్రాండ్‌ని వివిధ లీగ్స్‌లో విస్తరించడం ద్వారా వారిని గ్లోబల్ స్పోర్ట్స్ మార్కెట్లో నిలిపారు. ఈ స్ట్రాటజీ ద్వారా వారి వ్యాపార మోడల్‌ను విస్తరించడమే కాకుండా, మరిన్ని ఆదాయ మార్గాలను ఏర్పరచుకున్నారు.

2. Brand Building : IPL జట్టు కేవలం ఆటగాళ్లతో కాదు, అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకోవడమే అసలు గెలుపు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) యజమాని షారుఖ్ ఖాన్, తన సినిమా ఇమేజ్‌తో ఈ జట్టుని ఒక ఎంటర్టైన్‌మెంట్ బ్రాండ్‌గా మార్చారు. సోషల్ మీడియా, జెర్సీలు, యాడ్స్, రీల్స్ అన్నింటి మీద KKR గ్లోబల్ ఫాలోయింగ్ సంపాదించింది. ఒక బలమైన బ్రాండ్ ఉన్నప్పుడు, జట్టు విజయాలపై మాత్రమే ఆధారపడకుండా, ఇతర ఆదాయ మార్గాలు కూడా అందుబాటులోకి వస్తాయి.

3. Global Expansion : IPL జట్టు యజమానులు ఇతర దేశాల క్రికెట్ లీగ్‌లలో కూడా జట్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ వల్ల IPL బ్రాండ్ మరింత గ్లోబల్ గా ఎదుగుతుంది. ఈ జట్టు యజమానులకు ఏడాది పొడవునా ఆదాయం వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. ఉదాహరణకు KKR – USA, వెస్ట్ ఇండీస్ లీగ్‌లలో జట్లు, Royals Sports Group – South Africa T20, The Hundred (UK) లీగ్‌లలో బ్రాంచులు ఏర్పరచుకున్నారు. ఈ స్ట్రాటజీ వల్ల ఒక IPL జట్టు గ్లోబల్ ఫుట్‌ప్రింట్‌ కలిగి ఉంటుంది.

4. Year-Round Fan Engagement : IPL సీజన్ ముగిసిన తరువాత కూడా జట్టుల యజమానులు అభిమానులను ఎంగేజ్ చేయడానికి డిజిటల్ కంటెంట్, మర్చండైజ్ (జెర్సీలు, క్యాప్స్, కీస్), బ్రాండ్ క్యాంపెయిన్‌లు, సోషల్ మీడియా యాక్టివిటీలు చేయడం వంటి అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల వారు అభిమానులను ఏడాది పొడవునా తమ బ్రాండ్‌తో కనెక్ట్‌లో ఉంచుతున్నారు. అదే సమయంలో ఆదాయాన్ని క్రమంగా పెంచుకుంటున్నారు.

5. Passion + Business Acumen : IPL యజమానుల్లో చాలా మంది వ్యాపార రంగంలో విజయవంతమైన వ్యక్తులు. కానీ వారు క్రికెట్‌ పట్ల ఉన్న అభిరుచిని వ్యాపార వ్యూహంతో కలిపారు. ఉదాహరణకు ముకేశ్ అంబానీ (Mumbai Indians). తక్కువ మాట్లాడుతారు, కానీ స్ట్రాటజిక్ వ్యాపార వ్యూహాల మాస్టర్. నెస్స్ వాడియా, మోహిత్ బర్మన్ (Punjab Kings) తమ FMCG అనుభవాన్ని క్రీడా రంగానికి అన్వయించారు. వ్యాపార విజయం కోసం కేవలం డబ్బు మాత్రమే సరిపోదు, అభిరుచి కూడా అవసరం అనే విషయం క్లియర్ గా అర్థం అవుతుంది.

Lessons for Aspiring Entrepreneurs

ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానుల విజయ గాథలు, వ్యాపార వృద్ధి ఎలా సాధ్యమవుతుందో మనకు చూపిస్తున్నాయి. క్రీడను వ్యాపారంగా మార్చిన ఈ వారు, యువ వ్యాపారవేత్తలకు అనేక విలువైన పాఠాలు చెబుతున్నారు. వాటిలో ముఖ్యమైనవే ఇవి:

Strategic Investment Is the Key : వ్యాపారంలో విజయం పొందాలంటే ఎప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలుసుకోవడం చాలా కీలకం. ఉదాహరణకు రిలయన్స్ ముంబై ఇండియన్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా క్రీడల్లోకి ప్రవేశించి పెద్ద మల్టీబిలియన్ బ్రాండ్‌గా మార్చింది. ఇది స్ట్రాటజిక్ పెట్టుబడి శక్తిని చూపిస్తోంది. ఎప్పుడూ కూడా మూడవ వ్యక్తులు ఏమి చేస్తున్నారో కాకుండా, మార్కెట్ అవసరాలపై మీ దృష్టి పెట్టండి. మంచి రిస్క్ అనలిసిస్‌తో పెట్టుబడి పెట్టండి.

Brand Value Is Your Real Asset : ఒక మంచి బ్రాండ్‌ను నిర్మించడం ద్వారా మీరు ఆదాయ మార్గాలను విస్తరించుకోవచ్చు. ఉదాహరణకు కోలకతా నైట్‌రైడర్స్ యజమాని షారుక్ ఖాన్ తన సినీ బ్రాండ్‌ను, క్రికెట్ బ్రాండ్‌తో మిళితం చేసి అభిమానులను సంపాదించారు. కాబట్టి మీ బ్రాండ్‌కు విశ్వసనీయత, గుర్తింపు, అనుభూతి కలిగేలా ఉండాలి. మీరు ఎంచుకునే రంగంలో మంచి పేరు తెచ్చుకోండి.

Adapt Quickly with Trends : వ్యాపార ప్రపంచం నిరంతరం మారిపోతూ ఉంటుంది. ఎవరు ముందుగా మారుతారో వారు ముందుకు దూసుకెళ్తారు. ఉదాహరణకు IPL యజమానులు ఇతర దేశాల్లోనూ లీగ్‌లను కొనుగోలు చేయడం వల్ల వారి బ్రాండ్‌ను అంతర్జాతీయంగా వ్యాప్తి చేశారు. టెక్నాలజీ, మార్కెట్, వినియోగదారుల అవసరాల్లో మార్పును గమనించి మీరు కూడా మారాలని గుర్తించండి.

Passion + Business Acumen = Success : మీకు నిజంగా ఇష్టమైన దానిపై వ్యాపార దృష్టితో పని చేస్తే, తొందరగా విజయం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు చైన్నై సూపర్ కింగ్స్ యజమాని N. శ్రీనివాసన్‌కు క్రికెట్ పట్ల ఉన్న అభిమానం, వ్యాపార అనుభవంతో మిళితం కావడం వల్ల అది ఒక బ్రాండ్‌గా మారింది. మీకున్న ఆసక్తిని వ్యాపార అవకాశంగా మార్చండి. దీన్ని అనుభవంతో కలిపితే మీరు నిలిచిపోయే స్థానం లేదు, మరింత ముందుకు దూసుకెళ్తారు.

Diversification Leads to Multiple Revenue Streams : ఎప్పుడూ కూడా ఒకే రంగానికి పరిమితమై ఉండకండి. మీరు ఒక రేంజ్‌లో నిలబడిన తర్వాత ఇతర అవకాశాలను అన్వేషించండి. ఉదాహరణకు ఐపీఎల్ యజమానులు కేవలం క్రీడా బృందాలకే కాకుండా, ఈవెంట్స్, మెర్చండైజ్, డిజిటల్ కంటెంట్‌ల ద్వారా ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పరుచుకుంటున్నారు. ఒక బిజినెస్ సక్సెస్ అయిన తర్వాత దానితో అనుబంధితంగా ఉన్న ఇతర రంగాల్లోకి దూసుకెళ్లండి.

Building Fan Relationships Ensures Long-Term Growth : కస్టమర్ ఎంగేజ్‌మెంట్ ఎప్పుడూ కొనసాగాలి. IPL సీజన్ అయిపోయినా, ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్ టిక్కెట్లు, మెర్చండైజ్, సోషల్ మీడియా ద్వారా కొనసాగుతూ ఉంటుంది. మీరు మీ కస్టమర్లతో సంబంధం కలుపుకునే స్ట్రాటజీ రూపొందించండి. వారితో అనుబంధం పెరిగితే, ఆదాయం కూడా పెరుగుతుంది. చివరగా ఐపీఎల్ యజమానుల కథల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యాపార విజయం అనేది కేవలం డబ్బుతోనే కాదు, వ్యూహంతో, నమ్మకంతో, అభిరుచితో సాధ్యమవుతుంది. యువ వ్యాపారవేత్తలు కూడా ఈ పాఠాలను తీసుకొని, చిన్న స్థాయిలో ప్రారంభించి పెద్ద విజయాలు సాధించవచ్చు.

IPL జట్ల యజమానులు తమ వ్యాపార వ్యూహాలతో కేవలం ఆటను మాత్రమే కాకుండా, ఒక బిలియన్ డాలర్ బ్రాండ్‌ని నిర్మించారు. వారి వ్యూహాలు, అభిరుచి, మరియు మార్కెట్ అనుభవం వల్ల వారు తమ జట్లను గ్లోబల్ లెవెల్లో నిలబెట్టగలిగారు. ఈ వ్యూహాలు చిన్న వ్యాపారాల నుండి, యువ పారిశ్రామికవేత్తల వరకు అందరికీ ప్రేరణగా నిలుస్తాయి. కాబట్టి ఇప్పటివరకు మీరేమి నేర్చుకున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

How IPL Team Owners Earn Money and Grow Wealth

FAQs :

1) Who are the current IPL team owners in 2025?
2025 సంవత్సరంకి సంబంధించి IPL team owners list ఈ క్రింది విధంగా ఉంది.

  • Mumbai Indians – ముకేశ్ అంబానీ (Reliance Industries)
  • Chennai Super Kings – ఎన్. శ్రీనివాసన్ (India Cements)
  • Kolkata Knight Riders – షారుక్ ఖాన్, జయ్ మెహతా, జుహీ చావ్లా
  • Royal Challengers Bangalore – యునైటెడ్ స్పిరిట్స్ (Diageo)
  • Delhi Capitals – GMR గ్రూప్ & JSW గ్రూప్
  • Sunrisers Hyderabad – కలానిధి మారన్ (Sun Group)
  • Rajasthan Royals – మనోజ్ బడాలే (Emerging Media)
  • Punjab Kings – మోహిత్ బర్మన్, నెస్ వాడియా, ప్రీతి జింటా
  • Lucknow Super Giants – సంజీవ్ గోయెంకా (RPSG గ్రూప్)
  • Gujarat Titans – Torrent గ్రూప్ & CVC క్యాపిటల్


ఈ IPL team owners list 2025 అనేది తాజా సమాచారం ఆధారంగా రూపొందించబడింది.

2) What is the net worth of IPL team owners in 2025?
IPL team owners net worth బాగా విస్తృతంగా ఉంది. టాప్ ఓనర్స్ వారి వ్యాపార సామ్రాజ్యాల వలన బిలియన్ల డాలర్ల విలువను కలిగి ఉన్నారు. ఈ సంఖ్యలు చూస్తే, ఎంత గొప్ప స్థాయిలో IPL team owners ఉన్నారో మీకే తెలుస్తుంది.

  • ముకేశ్ అంబానీ – $92.8 Billion
  • షారుక్ ఖాన్ – $770 Million
  • ఎన్. శ్రీనివాసన్ – $2.35 Billion
  • కలానిధి మారన్ – $2 Billion
  • పార్థ్ జిందాల్ (JSW) – $7.68 Billion

3) Which IPL team has the richest owner?
ప్రస్తుతం IPL లో అత్యంత ధనవంతుడైన ఓనర్ Mumbai Indians కు చెందిన ముకేశ్ అంబానీ. ఆయన నెట్ వర్త్ $92.8 బిలియన్ పైనే ఉంది. ఇది మొత్తం లీగ్‌లోనే అత్యధికం. Richest IPL team owner 2025 గా ఆయనను పరిగణించవచ్చు.

4) Do celebrities own IPL teams?
అవును. చాలా మంది ప్రముఖులు IPL team owners with celebrity background గానే ఉన్నారు. వీరు తమ పాపులారిటీతో పాటు వ్యాపార అవగాహనను ఉపయోగించి IPL ఫ్రాంచైజీలను విజయవంతంగా నడుపుతున్నారు. ఈ సెలెబ్రిటీ IPL team owners అభిమానులతో మంచి కనెక్షన్ ఏర్పరచుకుంటున్నారు. వారిలో ప్రధానంగా:

  • షారుక్ ఖాన్ – Kolkata Knight Riders
  • జుహీ చావ్లా – KKR
  • ప్రీతి జింటా – Punjab Kings

5) How do IPL franchise owners earn money?
IPL team owners income sources అనేక రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా:

  • Broadcasting rights revenue share
  • Jersey sponsorships & brand deals
  • Ticket sales from stadium matches
  • Official merchandise sales
  • Social media and digital campaigns


వీటితో పాటు, IPL బ్రాండ్ విలువ పెరిగిన కొద్దీ ఫ్రాంచైజీల విలువ కూడా పెరుగుతుంది. ఇది how IPL team owners make money అనే ప్రశ్నకు పూర్తి సమాధానం.

6) Can new owners buy IPL teams in the future?
అవును. భవిష్యత్తులో new IPL team owners వస్తారు. BCCI టెండర్ ప్రక్రియ లేదా వేలం ద్వారా కొత్త వ్యాపారవేత్తలు IPLలోకి ప్రవేశించవచ్చు. 2022లో వచ్చిన Lucknow Super Giants మరియు Gujarat Titans వంటి జట్లు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

7) Who is the owner of CSK and what is their background?
Chennai Super Kings owner 2025లో ఎన్. శ్రీనివాసన్. ఆయన India Cements అధినేత. బీసీసీఐ మాజీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. వ్యాపారంలో ఆయనకు ఉన్న అనుభవం CSK విజయాలకు కారణం. IPL team owners with strong business background లో ఆయన ఒకరు.

8) Which is the most valuable IPL franchise in 2025?
ప్రస్తుతం (2025) Mumbai Indians మరియు Chennai Super Kings అత్యధిక విలువ కలిగిన most valuable IPL franchises. వీటి IPL team owners బ్రాండ్ బిల్డింగ్, consistent performance మరియు marketing ద్వారా ఈ స్థాయికి తీసుకువచ్చారు.

Join us on Telegram Group.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *