ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు, ఇది బిలియన్ డాలర్ల విలువ కలిగిన వ్యాపార రంగం. 2008లో ప్రారంభమైన ఈ లీగ్, ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా లీగ్‌లలో ఒకటిగా మారింది. ఐపీఎల్ అంటే మామూలు క్రికెట్ మ్యాచ్ మాదిరి సిరీస్ అనుకుంటే పొరపాటే. ఇది కోట్లాది రూపాయల విలువ ఉన్న వ్యాపార సామ్రాజ్యం. ప్రతి ఒక్క మ్యాచ్ వెనుక మార్కెటింగ్ స్ట్రాటజీ, స్పాన్సర్ డీల్స్, డిజిటల్ ఆదాయ వనరులు, టికెట్ విక్రయాలు, మీడియా హక్కుల లెక్కలు దాగి ఉంటాయి. అంటే, ఆట మైదానంలో విజయం సాధించడమే కాదు – ఆట మైదానం వెలుపల వ్యాపారం ఎలా సాగించాలో తెలియడం కూడా టీం యజమానుల విజయం. ప్రతి ఐపీఎల్ జట్టు వెనుక ఒక బిజినెస్ గ్రూప్, సెలెబ్రిటీ లేదా పెట్టుబడిదారుల సమూహం ఉంటుంది. ఐపీఎల్ టీం యజమానులుగా వ్యవహరించేవారు కోట్లల్లో పెట్టుబడులు పెట్టి, దాన్ని ఎలా మల్టిపుల్ ఆదాయంగా మార్చుకుంటున్నారు? వారు కేవలం ఆట కోసం కాకుండా, దీన్ని ఒక బిజినెస్ మోడల్‌గా ఎలా నడుపుతున్నారు? వారి సంపద ఎటువంటి మార్గాల్లో పెరుగుతోంది? How IPL Team Owners Earn Money అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలను ఈ వ్యాసంలో మీరు తెలుసుకోబోతున్నారు. ఒక మంచి వ్యాపారవేత్తలా ఆలోచించాలనుకునే ప్రతీ ఒక్కరూ, ఈ వ్యాసం తప్పనిసరిగా చదవాల్సిందే.
1. IPL Sponsors List: Understanding the Franchise Model
ఐపీఎల్‌లోని ప్రతి జట్టును ఒక ప్రైవేట్ కంపెనీ లేదా ప్రముఖ వ్యక్తి స్వంతంగా కొనుగోలు చేసి యాజమాన్యం వహిస్తారు. వీటిని ఫ్రాంచైజీలు అంటారు. ఫ్రాంచైజీ అంటే బీసీసీఐ నుంచి ఏదైనా ఒక జట్టును ఒక ఖచ్చితమైన ధరకు కొని, దాన్ని నిర్వహించే హక్కు పొందడం. ఐపీఎల్ ప్రారంభంలో (2008), మొదటి 8 జట్లను వేలం విధానంలో బీసీసీఐ అమ్మింది. అప్పుడు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఫిల్మ్ స్టార్‌లు ఈ జట్లను కొన్నారు. ఒక్కో జట్టు ఎవరి చేతిలో ఉందో చూద్దాం.
- Mumbai Indians – ముకేశ్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్)
- Chennai Super Kings – ఇండియా సిమెంట్స్ (ఎన్. శ్రీనివాసన్)
- Royal Challengers Bangalore – షారుక్ ఖాన్, జూహీ చావ్లా (రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్)
- Kolkata Knight Riders – డయాజియో కంపెనీ
- Lucknow Super Gaints – ఆర్పీజీ గ్రూప్ (సంజీవ్ గోయాంకా)
- Gujarat Titans – సీవీసీ క్యాపిటల్
ఈ జట్లను కొన్న యజమానులు బీసీసీఐకి ఒక ఫిక్స్‌డ్ ఫీజు చెల్లిస్తారు. ప్రతి సంవత్సరం లాభం వస్తే, అది వారి సంపదను పెంచుతుంది. వారు కేవలం క్రికెట్ ప్రేమికులే కాదు – వ్యాపారవేత్తలు కూడా. అంటే, తమ జట్టు బాగా ఆడితే అభిమానులు పెరుగుతారు, బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది, దాంతో ఆదాయం కూడా పెరుగుతుంది.
2. Primary Revenue Sources for IPL Team Owners
ఐపీఎల్ టీం యజమానులు డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఒక్కో మార్గాన్ని సింపుల్‌గా చూద్దాం.
A). Central Revenue Pool (Media Rights + Sponsorships) : ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌ను టీవీ, మొబైల్‌లో ప్రసారం చేయడానికి పెద్ద పెద్ద కంపెనీలు బీసీసీఐకి వేల కోట్ల డబ్బు చెల్లిస్తాయి. ఇది ప్రధాన ఆదాయ మార్గం. బీసీసీఐ టీవీ, డిజిటల్ ప్రసార రైట్స్ స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాకు అమ్ముతుంది. డ్రీమ్11, టాటా వంటి సంస్థలు స్పాన్సర్‌లుగా వ్యవహరిస్తాయి. బీసీసీఐ దాంతో వచ్చే డబ్బులో 50% మొత్తాన్ని అన్ని జట్లతో షేర్ చేస్తుంది. ఉదాహరణకు 2023లో మీడియా హక్కుల ద్వారా రూ.9500 కోట్లకు పైగా వచ్చిన ఆదాయంలో 50% జట్లకు పంపిణీ చేశారు.
B). Team Sponsorships and Branding Deals : ప్రతి జట్టుకి టైటిల్ స్పాన్సర్, ఫ్రంట్ జెర్సీ స్పాన్సర్, క్యాప్ స్పాన్సర్, వెనుకవైపు బ్రాండ్‌లు ఉంటాయి. వీటికి కంపెనీలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు చెల్లిస్తాయి. ఉదాహరణకు ముంబై IPL Team Jersey పై Slice, Reliance అనీ, అలాగే చెన్నై జెర్సీపై TVS, India Cements అని వేస్తారు. అంటే జెర్సీపై బ్రాండ్ పేరు పెట్టిస్తే, బంపర్ ఆదాయం వస్తుంది.
C). Ticket Sales and Gate Revenue : ప్రతి హోం మ్యాచ్‌కు టికెట్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో ఓ జట్టు వాటా పొందుతుంది. పెద్ద స్టేడియం, విశ్వాసపాత్రమైన అభిమానులు ఉంటే ఆదాయం ఎక్కువ. దీంట్లో వచ్చిన ఆదాయంతో కొంచెం స్టేడియం కి, మరి కొంచెం జట్టుకి వస్తుంది. అంటే స్టేడియం ఫుల్ అయితే = ఎక్కువ డబ్బు.
D). Merchandise and Licensing : జట్టు అభిమానులు తమ IPL Team Jersey, క్యాప్, బ్యాగ్, కీచెయిన్ వంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. వీటిని కంపెనీలు జట్టుతో లైసెన్స్ ఒప్పందం చేసుకొని అమ్ముతాయి. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది.
E). Prize Money : ఐపీఎల్‌లో విజేత, రన్నరప్, ప్లేయర్ ఆఫ్ ది సీజన్ లాంటి బహుమతులు ఉంటాయి. ఇవి కూడా జట్టు ఆదాయంలో భాగం అవుతాయి.
F). Player Transfers and Retention Strategies : ప్రస్తుతం ఇది తక్కువగా కనిపిస్తున్నా, భవిష్యత్తులో మంచి ఆదాయ మార్గం అవుతుంది.
ఒక జట్టు మంచి పేరు తెచ్చుకుంటే, వారి బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఆ తర్వాత వాళ్లు మరిన్ని డీల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ బ్రాండ్ విలువ దాదాపు ₹700 కోట్లకు పైగా. ఇవి అన్నీ కలిపితే ఐపీఎల్ టీం యజమానులు కోట్లలో డబ్బు సంపాదించగలరు. కానీ, ఖర్చులు కూడా ఎక్కువే అది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
3. Strategic Brand Building: Long-Term Wealth Creation
ఐపీఎల్ జట్టుతో డబ్బు సంపాదించడం సులువు కాదు. ఎంతగా ఆదాయం వస్తుందో, అంతే ఖర్చులు కూడా ఉంటాయి. అయితే యజమానులు ఎక్కడ ఖర్చుపెడతారో, ఎక్కడ లాభం వస్తుందో, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లారో చూద్దాం.
1. ప్రధాన ఖర్చులు : అందులో మొదటిది ప్లేయర్స్ జీతాలు. ప్రతి సంవత్సరం ప్లేయర్స్ ను వేలం (Auction) ద్వారా కొనుగోలు చేస్తారు. ఒక్కో స్టార్ ప్లేయర్‌కు ₹10 నుంచి ₹18 కోట్ల వరకు జీతం ఇవ్వాలి. ఉదాహరణకి రోహిత్ శర్మ ₹16 కోట్లకు, ధోని ₹12 కోట్లకు వేలం ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత సపోర్ట్ స్టాఫ్ జీతాలు (Coaches, Analysts) ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫిట్‌నెస్ ట్రైనర్, స్ట్రాటజీ అనలిస్ట్ వీరందరికీ జీతాలు ఇవ్వాలి. ఇక తర్వాత ట్రావెలింగ్ & హోటల్ ఖర్చులు. టీం ఒక సిటీ నుంచి మరొక సిటీకి విమానాలు, బస్సులు, హోటల్ బుకింగులు ఉంటాయి. ఇవన్నీ ఖర్చే కదా! ఆ తర్వాత స్టేడియం రెంట్, మేనేజ్మెంట్ ఖర్చులు లాంటివి ఉంటాయి. ఎలా అంటే హోమ్ గ్రౌండ్ నిర్వహించడానికి స్టేడియానికి అద్దె చెల్లించాలి. ఇక ప్రమోషన్ & అడ్వర్టైజింగ్ ఖర్చులు చూస్తే, మీడియాలో ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి డబ్బు ఖర్చవుతుంది.
2. లాభం ఎలా వస్తుంది : ఇవి చూసిన తర్వాత ఒకటి స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే, బిజినెస్ అంటే ప్లాన్‌తో ముందుకు వెళ్ళాలని. ఐపీఎల్ యజమానులు ప్రధానంగా ఈ క్రింద అంశాలపై ఫోకస్ పెడతారు. మొదటగా బ్రాండ్ బిల్డింగ్. తమ జట్టును అభిమానులకు దగ్గర చేయాలి. దీనికోసం మెమరబుల్ లోగో, ట్యాగ్‌లైన్, సోషల్ మీడియా presence ఉండాలి. తర్వాత డిజిటల్ స్ట్రాటజీ. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లో ఎంగేజ్‌మెంట్ పెంచడం ద్వారా అభిమానులు ఎక్కువవుతారు. దాంతో అభిమానులు పెరిగితే = మెర్చండైజ్, స్పాన్సర్ డీల్స్ పెరుగుతాయి. ఇక తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. వీరు ఒక్క సీజన్ లాభాన్ని మాత్రమే కాదు, రాబోయే 5–10 ఏళ్లలో బ్రాండ్ విలువ ఎలా పెంచుకోవాలో చూస్తారు. ఆ తర్వాత మంచి ఆటగాళ్లు, గేమ్ స్ట్రాటజీని వాడుతారు. జట్టు బాగా ఆడితే మాత్రమే అభిమానుల మద్దతు వస్తుంది. అది తమ ఆదాయానికి గేట్‌వే అవుతుంది.
3. బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వస్తుంది : ఒక జట్టు మొదట 2–3 సంవత్సరాలు ఎక్కువ ఖర్చులతో నడుస్తుంది. కానీ, మంచి ప్లానింగ్‌తో 4వ సంవత్సరం నుంచి లాభాలు రావడం మొదలవుతుంది. ముంబై, చెన్నై లాంటి జట్లు ఇప్పటికే దశాబ్ద కాలంగా లాభాల్లో ఉన్నాయి. కొత్త జట్లు (లక్నో, గుజరాత్) బ్రాండ్ బిల్డింగ్‌కి ఫోకస్ చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఐపీఎల్ జట్టు వ్యాపారం, పెద్ద వ్యాపారమే. ప్లేయర్ ఎంపికల నుంచి పబ్లిసిటీ వరకూ ప్రతి స్టెప్ వ్యూహాత్మకంగా ఉండాలి. IPL Team Owners ప్రతి సీజన్‌ను వ్యాపార అవకాశంగా మలుచుకుంటారు. బ్రాండ్ విలువ పెరిగితే స్పాన్సర్లు కూడా ఎక్కువగా చెల్లిస్తారు. కొన్ని జట్లు విదేశాల్లో కూడా టీంలను ప్రారంభించాయి.ఉదాహరణకు ముంబై ఇండియన్స్ బ్రాండ్ విలువ 2023లో $83 మిలియన్ పైగా ఉంది.
4. Tapping into Digital Media and Social Influence
ఐపీఎల్ జట్టు యజమానులు కేవలం మైదానంలో మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా భారీగా ఆదాయం సంపాదిస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి జట్టు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో యాక్టివ్‌గా ఉంటున్నాయి. ప్రతి మ్యాచ్‌కు ముందు మరియు తర్వాత, ప్లేయర్స్ బిహైండ్ ది సీన్స్ వీడియోలు, డ్రెస్సింగ్ రూమ్ క్లిప్స్, స్పెషల్ ఫ్యాన్ కాంటెంట్ అప్లోడ్ చేస్తారు. ఈ వీడియోలకు లక్షల వ్యూస్ వస్తాయి. దాంతో యూట్యూబ్ & ఫేస్‌బుక్ నుంచి ఆడ్ రివెన్యూ వస్తుంది. సోషల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల స్పాన్సర్లు ఎక్కువ చెల్లించేందుకు రెడీగా ఉంటారు. ఇంకా బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఉదాహరణకి ముంబై ఇండియన్స్ యూట్యూబ్ ఛానల్‌కి మిలియన్లలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వారు పోస్టు చేసే ఒక్కో వీడియోకి లక్షల వ్యూస్ వస్తాయి. వీటన్నీ జట్టుకు అదనపు ఆదాయంగా మారతాయి. ఇది చిన్న విషయం కాదు, ఇదొక సరికొత్త బిజినెస్ మోడల్!
5. International League Expansion: Multi-Team Ownership Model
IPL యజమానులు ఇప్పుడు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. వీళ్ళు గ్లోబల్ లీగ్‌లలోకి కూడా అడుగుపెడుతున్నారు. ముంబై ఇండియన్స్ – న్యూయార్క్‌లో, చెన్నై సూపర్ కింగ్స్ – సౌత్ ఆఫ్రికాలో, కోల్కతా నైట్ రైడర్స్ – యుఎస్, వెస్టిండీస్ లీగ్‌లలో జట్లు నడుపుతున్నాయి. ఇది ఎందుకు చేస్తున్నారంటే,
- బ్రాండ్ విలువ పెంచుకోవడం కోసం.
- వెరైటీ ఆదాయ మార్గాలు పొందడం కోసం.
- ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షించడం కోసం.
- స్వంత ఆటగాళ్లను ట్రైన్ చేసి, IPLకి తక్కువ ధరలో తీసుకోవడం కోసం ఉండవచ్చు.
Nature of Business Easy Path to Great Results
దీనినే మల్టీ-టీం ఓనర్షిప్ అంటారు. ఇదొక సరికొత్త వ్యాపార మోడల్. ఒక్కో యజమాని పలు దేశాల్లో జట్లు నడపడం. ఈ స్ట్రాటజీ వల్ల సంపద వేగంగా పెరుగుతోంది.
6. Future of IPL Franchise Ownership: New Trends
నేడు ఈ IPL యజమానులు డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. అందులో మొదటిది గ్లోబల్ లీగ్‌ల్లో విస్తరించండం. ఎలా అంటే ముంబై, చెన్నై, కోల్కతా లాంటి జట్లు దక్షిణాఫ్రికా, అమెరికాలో తమ జట్లను ప్రారంభించాయి. ఇది బ్రాండ్‌ను ఇంటర్నేషనల్ లెవెల్ లో పెంచుతోంది. అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు సోషియల్ మీడియా, యూట్యూబ్, ఫ్యాన్ కంటెంట్ వల్ల ప్రత్యక్ష డిజిటల్ ఆదాయం పెరుగుతోంది. కొన్ని జట్లు మెటావర్స్‌లో తన బ్రాండ్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఫ్యాన్ టోకెన్లు, NFTలు ద్వారా డిజిటల్ అసెట్లు అమ్ముతున్నారు. తర్వాత Direct-to-Consumer అన్నట్టు జెర్సీలు, క్యాపులు లాంటి మెర్చండైజ్‌ను ప్రత్యక్షంగా అభిమానులకు విక్రయిస్తున్నారు. ఫాంటసీ లీగ్ తో భాగస్వామ్యం చేసుకోవడం. Dream11, MPL లాంటి ఫాంటసీ లీగ్‌లతో కలిసి కొత్త ఆదాయం పొందుతున్నారు. ఐపీఎల్ యజమాన్య ఫ్యూచర్ లో క్రికెట్ పైన మాత్రమే కాకుండా డిజిటల్, గ్లోబల్, టెక్నాలజీ ఆధారితంగా ఉంటుంది. ఇది ఆటతో పాటు ఆదాయాన్ని కూడా కొత్త స్థాయికి తీసుకెళ్తోంది.
IPL Ownership is a Game of Strategy and Vision
ఐపీఎల్ యాజమాన్యం అంటే కేవలం క్రికెట్ ప్రేమికుడు కావడం కాదు. మంచి స్ట్రాటజీ, దూరదృష్టి, బ్రాండ్ బిల్డింగ్ మీద నమ్మకంతో ముందుకెళ్ళే ప్రయాణం. జట్టు ఎంపిక నుంచి స్పాన్సర్ డీల్స్ వరకూ ప్రతి అడుగు వ్యాపార బోధతో నిండి ఉంటుంది. టికెట్ అమ్మకాలు, టీవీ హక్కులు, మెర్చండైజింగ్, డిజిటల్ మార్కెటింగ్. ఇవన్నీ కలిపి ఓ భారీ ఆర్థిక వ్యవస్థను తయారుచేస్తాయి. ఐపీఎల్ యాజమానులు క్రికెట్‌ను వ్యాపారంగా మార్చి, అభిమానులను బ్రాండ్‌లో మిళితం చేసి సంపదను సృష్టిస్తున్నారు. ఈ ఆర్టికల్ ద్వారా మీకు స్పష్టంగా అర్థం అయిందనుకుంటున్నాం.
Join us on Telegram Group.