నాకు తెలిసింది ఒక్కటే, బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకోవడం. ఎలాంటి టెన్షన్ లేకుండా సెటిల్ అవ్వడం. అంతేనా జీవితం అంటే? నేనైతే కాదంటా! ఎందుకంటే జాబ్ చేయడం అనేది ప్రస్తుతానికి మాత్రమే సరిపోతుంది. భవిష్యత్ లో అస్సలు సరిపోవు. జీవితాంతం జాబ్ చేయడం వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చుచేయడం వల్ల ఏంటి ఉపయోగం? అందుకే జీవితాంతం జాబ్ చేయడం కాకుండా కొన్ని రోజులు ఏదైనా పని చేసి ఆ వచ్చిన డబ్బే డబ్బుని సంపాదించేలా చేయాలి. అలాగే FInancial Freedom ఎలా పొందాలనేది వివరించడం జరిగింది. అదెలాగో Robert Kiyosaki చెప్పిన Rich Dad Poor Dad పుస్తకం చదివితే పూర్తిగా అర్థం అవుతుంది. ఆ పుస్తకం చదవలేం అనుకుంటే ఇప్పుడు చెప్పే అన్ని పాయింట్స్ పూర్తిగా చదివేయండి.
Rich Dad Poor Dad:
ధనవంతులకు మరియు మధ్యతరగతి వారికి గల వ్యత్యాసాన్ని వివరించేదే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం. రాబర్ట్ కియోసాకి రాసిన ఈ పుస్తకం కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు ఆర్థిక స్వేచ్ఛ కోసం లక్షలాది మందికి దిశానిర్దేశం చేసే ఆయుధం. అలాగే డబ్బు ఎలా పనిచేస్తుందో పూర్తి మెళకువలు అందిస్తుంది.
Rich Dad Poor Dad Key Lessons for Financial Freedom:
Two Dads Contrasting Mindsets : ఈ పుస్తకం అనేది రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఇద్దరు తండ్రుల మధ్య ఆలోచనలు ఏ విధంగా ఉంటాయనేది వివరిస్తుంది. వారిలో
Rich Dad : సంపద సృష్టించడానికి అందరు వెళ్లే దారులలో కాకుండా కొత్త దారులలో కొంచెం డిఫరెంట్ గా ఆలోచించేవాడు.
Poor Dad : కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి. అందరిలాగే ఆర్థిక కష్టాల వంటి Rat Race లో ఇరుక్కున్నాడు.
ఇక్కడ ఇద్దరు నాన్నలు ఎలాంటి ఆలోచనా విధానం కలిగివున్నారో ఈజీగా తెసులుకోవచ్చు. ఎందుకంటే ఫైనాన్సియల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో రిచ్ డాడ్ మాదిరి డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారా? లేక పూర్ డాడ్ మాదిరి అందరిలాగే ఆలోచించి Rat Race లో ఇరుక్కుంటున్నారా? అనేది వీళ్ళ ద్వారా తెసులుకోవచ్చు.
Importance of Financial Education:
స్కూల్ లో మనం ఎలా ఉద్యోగం తెచ్చుకోవాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇలాంటివి అన్నీ చెప్తారు కానీ, డబ్బు ఎలా సంపాదించాలి? దానిని ఎలా మేనేజ్ చేయాలనేది చాలా తక్కువ చెప్పేది. ధనవంతులు ఆస్తులను నిర్మించుకుంటారు. కానీ పేదవారు మరియు మధ్యతరగతి వాళ్ళు సంపాదించడం, ఆ వెంటనే ఖర్చు పెట్టేయడం చేస్తారు. అందుకే మీరందరూ డబ్బు కోసం పనిచేయడం ఆపేసి, డబ్బే మీ కోసం పనిచేసేలా చెయ్యండి.
Assets vs Liabilities:
ఆస్తులను సృష్టించుకోవడం వల్ల అవి మీ జేబులోకి డబ్బులు తెచ్చిపెడతాయి. అలాగే అప్పులు మీ జేబులోంచి డబ్బుని తీసుకుపోతాయి. ఉదాహరణకు చాలామంది కార్లు కొనుక్కోవడం లాంటివి ఆస్తులను సంపాదించినట్టు భావిస్తారు. కానీ నిజానికి అవి ఆస్తులు కావు. అవి అప్పులు. కాబట్టి రియల్ ఎస్టేట్, స్టాక్స్ వంటి నగదు ప్రవహించే వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందవచ్చు.
Power of Passive Income:
ఒకే విధమైన ఆదాయం పై ఆధారపడకుండా, వివిధ రకాల passive income వచ్చే దారులు సృష్టించుకోండి. ఎందుకంటే పని చేస్తేనే డబ్బు వచ్చే ఆదాయం(Active income) కాకుండా, పని చేయకపోయినా డబ్బు వచ్చే ఆదాయం(Passive income) పై దృష్టిపెట్టండి. ఆక్టివ్ ఇన్కమ్ కంటే ప్యాసివ్ ఇన్కమే మీకు ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. ఉదాహరణకు ఇంటి అద్దె, డివిడెండ్స్, రాయల్టీస్ లేదా వ్యాపారం చేయడం. వీటి వల్ల passive income వస్తుంది కాబట్టి.
Overcome Fear and Doubt:
ఫెయిల్ అవుతాం అనే భయం వల్ల రిస్క్ తీసుకోవడానికి కూడా బయపడుతాం. కాబట్టి ఫెయిల్ అయ్యావంటే దానిని మన విజయానికి తొలి మెట్టుగా భావించాలి. భయం అనేది మన ఫైనాన్సియల్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయకుండా ఆపుతుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటపడేందుకు మీకు తగిన రిస్క్ ను తీసుకోండి.
How to Escape Rat Race:
Rat Race అనేది సంపాదించడం, ఖర్చుపెట్టడం మరియు అప్పులు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రిచ్ డాడ్ ఏం చెప్తాదంటే, Rat Race లోంచి బయటపడటానికి ఒక ప్రణాళిక వేసుకోండి. ఎలా అంటే జాగ్రత్తగా ఖర్చు పెట్టడం మరియు పొదుపు చేయడం జరుగుతుంది. ఇంకా మంచి మెళకువలు పాటించి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. దాంతో మీ డబ్బు ఆదా అవ్వడమే కాకుండా పెరిగే అవకషన్ ఉంటుంది.
Rich Dad Poor Dad Value of Entrepreneurship:
పూర్ డాడ్ లా ఉద్యోగం తెచ్చుకుని సెక్యూర్ గా జీవితం గడపడం కాకుండా. రిచ్ డాడ్ మాదిరి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి. Entrepreneurship అనేది మీ ఆదాయాన్ని మేనేజ్ చేయడంతో పాటు లాంగ్ టర్మ్ లో ఎక్కువ ఆదాయం సృష్టించబడుతుంది. అలాగే మీరు కట్టే టాక్స్ లను కూడా తగ్గిస్తుంది. ఫైనాన్సియల్ ఫ్రీడమ్ పొందడానికి చిన్న వ్యాపారం లేదా side hustle ను ప్రారంభించండి.
Rich Dad Poor Dad Summary:
నిత్యావసర ధరలు అన్నీ పెరిగిపోయిన నేటి రోజుల్లో ఆర్థికంగా వెనకబడటం చాలా బాధాకరం. అందుకే ఆర్థిక స్వేచ్ఛ కోసం ఇప్పుడే దారులు సృష్టించుకోండి. ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం మనం ఎలాంటి ఫైనాన్సియల్ నిర్ణయాలు తీసుకోవాలనేది చెప్తుంది. ఇప్పుడు మీకోక ప్రశ్న వేస్తున్నా చెప్పండి. మీరు డబ్బు కోసం పనిచేస్తున్నారా? లేక డబ్బే మీకోసం పనిచేస్తుందా? ఇది మీకు అర్థం అయినట్లయితే Financial Freedom కి దగ్గరైనట్టే. ఇప్పుడే మీరు మీ ఖర్చులను లెక్కవేయండి. అప్పులను తగ్గించి, సంపదను పెంచే ఆస్తులపై investment చేయడం ప్రారంభించండి.
Join us on Telegram Group.