ఈ రోజుల్లో చాలా మంది యువత, ఉద్యోగస్తులు, మరియు గృహిణులు కూడా తక్కువ పెట్టుబడితో స్వంత వ్యాపారం చేయాలని చాలా ఆసక్తిని చూపుతున్నారు. కానీ, ఒక పెద్ద వ్యాపారం మొదలుపెట్టాలంటే లక్షల రూపాయలు అవసరమవుతుందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. అయితే నిజానికి, మీరు ₹50,000 లోపు పెట్టుబడితోనూ ఒక లాభదాయకమైన బిజినెస్ స్టార్ చేయవచ్చు. దీనికోసం మీరు ట్రెండింగ్ లో ఉన్న మార్కెట్ అవసరాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, మరియు తక్కువ ఖర్చుతో జరిగే వ్యాపార అవకాశాలపై దృష్టి పెట్టాలి. ఈ ఆర్టికల్‌లో మీ కోసం మేము తెచ్చిన best business ideas గురించి తెలుసుకుందాం – ఇవి తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, లాంగ్ టర్మ్ లో మంచి లాభాలను ఇవ్వగల ఐడియాస్.
Best Business Ideas
1. Freelancing:
దీనికి కావాల్సిన పెట్టుబడి ₹10,000 – ₹30,000 వరకు ఉంటుంది. ఈ బిజినెస్ కోసం అవసరమైనవి ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్, స్కిల్ (రైటింగ్, డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్) వంటివి ఉండాలి. Fiverr, Upwork, Freelancer, LinkedIn వంటి వెబ్ సైట్స్ లో పని చేయవచ్చు. ఫ్రీలాన్సింగ్ లో లాభం నెలకు ₹15,000 – ₹1,50,000 వరకు ఉంటుంది. మీరు టైపింగ్ చేస్తారా? లేక డిజైన్ చేయగలరా? లేదా సోషల్ మీడియా హ్యాండిల్ చేయగలరా? అయితే ఫ్రీలాన్సింగ్ మీకు ఒక బంగారు అవకాశం అని చెప్పవచ్చు. మీరు ఇంటి నుంచి ఆన్‌లైన్‌లో క్లయింట్లు పొందుతూ సేవలు ఇవ్వవచ్చు. మీకున్న టాలెంట్‌ను మీరు డబ్బుగా మార్చుకోవచ్చు. రోహిణి అనే గృహిణి Fiverrలో కంటెంట్ రైటర్‌గా పని చేస్తూ నెలకు ₹35,000 వరకు సంపాదిస్తున్నారు. కేవలం ఇది ఇంట్లో నుంచే!
2. Instagram Reselling:
ఇన్స్టాగ్రామ్ రీసెల్లింగ్ బిజినెస్ కి కావాల్సిన పెట్టుబడి ₹2,000 – ₹10,000 పెట్టాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ చేయాలంటే ఉండాల్సినవి మొబైల్ ఫోన్, WhatsApp Business, Instagram. ఎక్కడ అమ్మాలంటే Instagram, WhatsApp గ్రూప్స్ లో ప్రోడక్ట్స్ షేర్ చేస్తూ సంపాదించవచ్చు. ఇలా చేస్తూ ఒక్కో ప్రోడక్ట్‌పై లాభం ₹50 – ₹300 వరకు వస్తుంది. నెలకు మొత్తం లాభం అయితే ₹10,000 – ₹50,000 వరకు వస్తుంది. ఇతరుల వద్ద ఉన్న వస్తువులను మీరు తక్కువ ధరకే కొనుక్కొని, వాటిని మీ పర్సనల్ నెట్‌వర్క్‌లో అమ్మవచ్చు. దీనినే రీసెల్లింగ్ అంటారు. మీకు స్టాక్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. కస్టమర్ ఆర్డర్ చేస్తే, మీరు సప్లయర్ నుంచి ఆర్డర్ చేసి షిప్ చేస్తారు. ఉదాహరణకు సురేష్ అనే కాలేజీ స్టూడెంట్ నెలకు ₹25,000 వరకూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మహిళల డ్రెస్సులు అమ్ముతూ సంపాదిస్తున్నారు
3. Handmade Products Making:
Handmade products బిజినెస్ కోసం ₹5,000 – ₹20,000 వరకు పెట్టుబడి అవసరం. ఇక్కడ మనం చేయాల్సినవి రా మెటీరియల్స్ తెచ్చుకోవడం, క్రియేటివిటీ, ప్యాకేజింగ్. కాండిల్స్, జ్యువెలరీ, సబ్బులు, గిఫ్ట్ ఐటమ్స్ వంటి ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయవచ్చు. నెలకు ₹15,000 – ₹60,000 వరకు లాభం ఉంటుంది. మీరు ఇంట్లో తయారుచేసే ఉత్పత్తులు మార్కెట్‌లో ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్, Etsy, Meesho లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో మీ ప్రోడక్ట్స్ సేల్ చేయవచ్చు.
4. Youtube Videos:
యూట్యూబ్ వీడియోస్ కోసం ₹10,000 – ₹30,000 వరకు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రీగా కూడా మీకు మీరు స్వయంగా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా అవసరమైనవి స్క్రిప్ట్, వాయిస్ ఓవర్, వీడియో ఎడిటింగ్. Ad Revenue, Sponsors, Affiliate Income ద్వారా ₹5,000 – ₹1,00,000+ పైగానే లాభం ఉంటుంది. మీరు ఫేస్ చూపించకుండా వీడియోలు తయారుచేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఆదాయం పొందవచ్చు. మీకు స్క్రిప్టింగ్, వాయిస్ ఓవర్, వీడియో ఎడిటింగ్ అర్థమైతే ఫేస్ లేకుండానే విజువల్ కంటెంట్ ద్వారా ఆదాయం పొందవచ్చు.
5. Affiliate Marketing:
ఇక్కడ మనం పెట్టాల్సిన పెట్టుబడి ₹3,000 – ₹8,000 అవుతుంది. ఇందులో ఎక్కువ అవసరమైనవి, ఒక బ్లాగ్ వెబ్‌సైట్, కంటెంట్ రైటింగ్ స్కిల్. లాభం గురించి ఆలోచిస్తే రోజుకు ₹500 – ₹5000 లేదా ఎక్కువగా కూడా వస్తుంది. మీరొక బ్లాగ్ వెబ్‌సైట్ స్టార్ట్ చేసి, అందులో కంటెంట్ పోస్ట్ చేస్తూ అఫిలియేట్ లింక్‌లు ఉంచితే, ఆ లింక్ ద్వారా వచ్చిన సేల్స్ పై మీరు కమిషన్ పొందవచ్చు. మొదట ఆదాయం తక్కువగా ఉంటుంది, క్రమంగా SEO బాగా చేస్తే పెద్ద మొత్తంలో ఆదాయం పొందవచ్చు.
6. Print On Demand T-Shirt:
ఇక్కడ మనం పెట్టాల్సిన పెట్టుబడి ₹5,000 – ₹15,000 వరకు అవుతుంది. కస్టమ్ టీ-షర్ట్స్, మగ్స్, ఫోన్ కేసెస్ వంటి కస్టమర్ డిమాండ్ కి తగ్గట్టుగా ఉత్పత్తి చేసి, Printrove, Qikink, Shopify వంటి ప్లాట్ఫారం లలో సేల్ చేయవచ్చు. ఒక్కొక్క ప్రోడక్ట్ పై ₹100 – ₹300 వరకు లాభం పొందొచ్చు. మీరు గనక క్రియేటివ్ డిజైన్ చేయగలిగితే ఇది మంచి అవకాశం. మీ డిజైన్‌లను ప్రింట్ చేసి ప్రోడక్ట్స్ పై ముద్రించి అమ్మవచ్చు. సప్లయర్‌లు డెలివరీ, ప్రింటింగ్ అంతా చూసుకుంటారు.
7. Event Decoration:
ఈవెంట్ డెకరేషన్ బిజినెస్ లో పెట్టాల్సిన పెట్టుబడి ₹10,000 – ₹30,000 వరకు అవుతుంది. ఇందులో అవసరమైనవి బెలూన్‌లు, బ్యానర్లు, స్టాండ్‌లు, కిట్స్ వంటివి. ఒక్కొక్క ఈవెంట్‌కు ₹2,000 – ₹10,000 లాభం వస్తుంది. పిల్లల బర్త్‌డే, బేబీ షవర్, చిన్న పార్టీలు ఎక్కువ జరుగుతున్న నేటి కాలంలో డెకోరేషన్ చాలా డిమాండ్ పెరుగుతోంది. చిన్న బిజినెస్ గా మొదలుపెట్టి పెద్ద ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా మారవచ్చు.
8. Microgreens Urban Farming:
ఈ బిజినెస్ కు కావాల్సిన పెట్టుబడి ₹5,000 – ₹15,000 అవుతుంది. మైక్రోగ్రీన్స్ (Sunflower, Wheatgrass, Mustard) వంటివి ఉత్పత్తి చేయవచ్చు. ఇక్కడ లాభం విషయానికి వస్తే రోజుకు ₹500 – ₹1500 వరకు వస్తుంది. ఇంట్లో ఉన్న బాల్కనీ లేదా టెర్రస్ వాడుకొని హెల్తీ గ్రీన్ ప్లాంట్స్ పెంచవచ్చు. ఫిట్‌నెస్ ప్రియులకైనా లేదా హోటల్స్‌కైనా విక్రయించవచ్చు. ఇది లాంగ్‌టెర్మ్‌లో చాలా లాభదాయకం.
9. Online Tutoring:
ఆన్లైన్ ట్యూటరింగ్ కి కావాల్సిన పెట్టుబడి ₹0 – ₹5,000 అవుతుంది. ట్యూటర్ కి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. Zoom / Google Meet ద్వారా ఆన్లైన్ క్లాసెస్ బోధించవచ్చు. గంటకు ₹200 – ₹1000 వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా సబ్జెక్ట్ బాగా బోధించగలిగితే, ఇంటి నుంచే ట్యూషన్ క్లాసులు ప్రారంభించవచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ కోర్సెస్ వంటి వాటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది.
10. Whatsapp Marketing Services:
వాట్సాప్ మార్కెటింగ్ బిజినెస్ కి కావాల్సిన పెట్టుబడి ₹2,000 – ₹10,000 వరకు అవుతుంది. ఇక్కడ ఎక్కువగా అవసరమైనవి Business WhatsApp, బలమైన నెట్‌వర్క్ ఉండాలి. క్లయింట్ ఆధారంగా ₹5,000 – ₹30,000/నెల లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. చిన్న చిన్న వ్యాపారాలు తమ కస్టమర్లకు WhatsApp ద్వారా మార్కెటింగ్ చేయాలని చూస్తున్నారు. మీరే వారికి ఈ సర్వీస్ అందించి నెలసరి ఆదాయం పొందవచ్చు.
Most Profitable Business Ideas in 2025 for Future
మీ వద్ద ఉన్న ₹50,000 పెట్టుబడిని మంచి బిజినెస్ ఐడియాలో పెట్టుబడి పెట్టి, శ్రమతో, తెలివితో ముందుకెళితే మీరు నెలకు లక్ష రూపాయల ఆదాయం పొందడం అసాధ్యం కాదు. చిన్నగా మొదలై, నెమ్మదిగా ఎదుగుతూ వెళ్ళండి. ప్రతి ఐడియా వెనుక మీ ఇంట్రెస్ట్, టైమ్, మార్కెట్ ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పటివరకు చెప్పుకున్న లిస్టులో మీకు నచ్చిన బిజినెస్ ఐడియా ఏది? లేదా మీకు మరిన్ని బిజినెస్ ఐడియాస్ కావాలా? అయితే కామెంట్ చేయండి. మొత్తానికి, వ్యాపారం మొదలుపెట్టడం అనేది ఎక్కువ మొత్తంలో పెట్టుబడి లేకుండా కూడా సాధ్యమే. పైన చెప్పిన best business ideas మీలోని ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచడమే కాకుండా, ఆర్థికంగా కూడా స్వతంత్రంగా మారే దిశగా మార్గనిర్దేశం చేస్తాయి.
Join us on Telegram Group.