వ్యవసాయం అనేది మట్టిలో సంపదను కనిపెట్టే ఒక కళ. ఒకప్పుడు కేవలం పంటలను పండించడానికి పరిమితమైన వ్యవసాయం, ఇప్పుడు ఆధునిక పద్ధతులలో విస్తరించిపోయింది. పచ్చని పంటలు పండించడం మాత్రమే కాకుండా, వాటి ద్వారా వ్యాపారాన్ని రూపొందించుకునే యుగం ఇది. మీరు రైతు కావచ్చు, పట్టణ యువకుడవచ్చు లేదా ఉపాధి కోసం కొత్త మార్గాలు అన్వేషించే వ్యాపారప్రియుడవచ్చు, వ్యవసాయ రంగంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇప్పుడు మన తెలుసుకోబోతున్న Agriculture Business Ideas లో Vermicomposting, Greenhouse Farming, Agri Tourism అనేవి చాల డిమాండ్ ఉన్నవి.
ఈ ఆర్టికల్ లో మనం ఔషధ మొక్కల సాగు దగ్గర నుంచి మష్రూమ్ మరియు హైడ్రోపోనిక్ వ్యవసాయం, అలోవెరా ప్రాసెసింగ్, సూర్యకాంతి నూనె తయారీ లాంటివి, అన్నీ కూడా మార్కెట్లో డిమాండ్ ఉన్న వ్యాపారాలు. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న Money Making Agriculture Business Ideas తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఎప్పటికీ లాభం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి స్మార్ట్ మార్కెటింగ్‌తో అత్యంత గొప్ప స్థాయికి తీసుకెళ్లవచ్చు. పట్టణం నుండి పల్లె వరకు, ప్రతి ఒక్కరూ చేయగలిగే సాదాసీదా వ్యవసాయ బిజినెస్ ఐడియాలను మీరు ఈ వ్యాసంలో చదివి, తగినదాన్ని ఎంచుకుని వ్యాపార ప్రయాణం మొదలుపెట్టొచ్చు. అందుకే ఒక్క చిన్న మార్పుతో పెద్ద లాభం సాధ్యమే.
Top Agriculture Business Ideas in India
1. Vermicomposting:
Agriculture Business Ideas లో ఈ వెర్మీకంపోస్ట్ మొదటిది.వెర్మీ కంపోస్టింగ్ అనేది వానపాములను ఉపయోగించి ఆర్గానిక్ చెత్తని సేంద్రీయ ఎరువుగా మార్చేటువంటి ప్రక్రియ. దీనివల్ల మట్టికి పోషకాలు పెరగడం మాత్రమే కాకుండా, రైతులు వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇది పూర్తిగా ప్రకృతికి హానికరం లేని, పర్యావరణ హితం కలిగిన ఒక వ్యవసాయ ఆదాయ మార్గం. ఈ వ్యాపారంలో ఉన్న అవకాశాలు ఏంటంటే పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. గార్డెనింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, చిన్న రైతులు, అనేక మార్కెట్లకు వీటి డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీలు లభిస్తాయి. కాబట్టి తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇది స్టార్ట్ చేయవచ్చు.
వెర్మీ కంపోస్టింగ్ లో ఉపయోగించాల్సిన పదార్థాలు పచ్చి చెత్త (శాకాహార చెత్త, ఆకులు, పండు తొక్కలు, కూరగాయ మిగతావి), ఆవు పేడ (cow dung), పాడిపోయిన పత్రికలు, వడలు వంటివి ఉంటాయి. వానపాముల్లో ముఖ్యంగా Eisenia Fetida అనే రకానికి చెందినవి ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటి ద్వారా పదార్థాలు త్వరగా Vermicompost గా మారుతాయి. 30-45 రోజుల్లో కంపోస్ట్ తయారవుతుంది. చివరికి దాన్ని వడకట్టుకుని వెర్మీ కంపోస్ట్ ఎరువుగా ప్యాక్ చేయొచ్చు.
వ్యాపారంగా వెర్మీ కంపోస్టింగ్ ఎలా మొదలుపెట్టాలి?
వర్మీ కంపోస్ట్ ఒక చిన్న స్థలం (ఒక గదిలో కూడా చేయొచ్చు). తడి, ఎండ రెండింటినీ మేనేజ్ చేసే స్థలం కావాలి. వీటికోసం సెపరేట్ గా చేయించిన వెర్మీ బెడ్ లు ఉండాలి. నీటి సరఫరా మంచిగా ఉండాలి. అలాగే వేస్ట్ నీటిని జార్చే డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఉండాలి.
వానపాములను కొనుగోలు చేయడానికి దాదాపుగా 1 కిలో ₹300–₹500 ఖర్చవుతుంది. మొదట 5-10 కిలోలతో మొదలు పెట్టవచ్చు. వ్యవసాయ విభాగం లేదా ప్రభుత్వ శిక్షణ కేంద్రాల్లో కోర్సులు లభిస్తాయి. ఉంచితంగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు వీటి ఖర్చులు తెలుసుకుందాం. ముందుగా స్థల నిర్మాణం కోసం ₹5,000 – ₹20,000 వరకు అవుతుంది. అలాగే వానపాముల కొనుగోలు చేయడానికి ₹3,000 – ₹5,000 వరకు ఖర్చు అవుతుంది. ఇతరత్రా పరికరాల కోసం ₹5,000 – ₹10,000 ఖర్చు అవుతుంది. ప్యాకేజింగ్ కోసం ₹2,000 – ₹5,000 ఖర్చు అవుతుంది. మొత్తం పెట్టుబడి చూస్తే ₹15,000 – ₹40,000 వరకు అయ్యే అవకాశం ఉంటుంది. 1 టన్ను వెర్మీ కంపోస్ట్ ధర ₹5,000 – ₹7,000 వరకు ఉంటుంది. కాబట్టి 3 నెలల వ్యవధిలో కనీసం ₹20,000+ లాభం సాధ్యమే.
వీటిని రైతు బజార్లు, ఆర్గానిక్ స్టోర్లు, గార్డెన్ నర్సరీలు, ఇంటర్నెట్ (Amazon, Flipkart, మీ స్వంత వెబ్‌సైట్ ద్వారా) అమ్మవచ్చు. ఇంకా స్థానిక రైతులకు నేరుగా వెళ్ళి అమ్మవచ్చు. మార్కెటింగ్ కోసం కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం. 100% ఆర్గానిక్, Eco-Friendly అనే పదాలను ప్యాకింగ్ పై చూపించండి. అలాగే సోషల్ మీడియా లో వీడియోలు, ఫొటోలు ద్వారా ప్రచారం చేయండి. నగరాల్లోని terrace gardening lovers కోసం special 1 kg/2 kg ప్యాకింగ్ ప్లాన్ చేయండి. మీ ఎరువుల ఫలితాలను చూపించే Before–After ఫొటోలు షేర్ చేయండి.
2. Greenhouse Farming:
Agriculture Business Ideas లో ఈ Greenhouse Farming రెండవది.ట్రడిషనల్ వ్యవసాయంలో వర్షాలు ఎప్పుడు పడతాయో, ఎండ ఎప్పుడు కురుస్తుందో అనే అనిశ్చిత పరిస్థితులపై రైతులు ఆధారపడి ఉంటారు. కానీ ఈ రోజుల్లో కాలానుగుణంగా వ్యవసాయ రంగం కూడా టెక్నాలజీతో పటిష్టమవుతోంది. దీనిలో గ్రీన్‌హౌస్ వ్యవసాయం (Greenhouse Farming) అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. గ్రీన్‌హౌస్ అంటే – ఒక నియంత్రిత వాతావరణంలో పంటలను పెంచే ఒక నిర్మాణం. ఇది రకరకాల వాతావరణ స్థితులను కంట్రోల్ చేసి, మొక్కలకు అవసరమైన ఉష్ణోగ్రత, తేమ, వెలుతురు లాంటి అంశాలను కల్పిస్తుంది. తద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు పంటలు పండించవచ్చు.
గ్రీన్‌హౌస్ ఎలా పనిచేస్తుంది?
ఇది సాధారణంగా పారదర్శక పాలీథిన్ షీట్‌తో తయారు చేయబడిన నిర్మాణం. వెలుతురు లోపలికి వెళుతుంది కానీ వేడి బయటకు వెళ్లదు. దీని వల్ల గ్రీన్‌హౌస్ లోపల వేడి సమంగా ఉంటుంది. ఫ్యాన్స్, మిస్ట్ సిస్టమ్స్, ఉష్ణోగ్రత కంట్రోలర్లు వంటివి వాతావరణాన్ని కంట్రోల్ చేయడానికి ఇందులో ఉపయోగిస్తారు. ఈ నియంత్రిత వాతావరణంలో పంటలు వేగంగా పెరుగుతాయి, దాంతో ఎక్కువ దిగుబడులు వస్తాయి.
టమాటా, శిమ్లామిరప (Capsicum / Bell Peppers), కీరా (Cucumber), స్ట్రాబెర్రీలు, పుష్పాలు – గులాబీలు, గెర్బెరా, కర్ణాటకం పూలు, ఆరోగ్య పంటలు – లెట్యూస్, బ్రోక్కోలీ వంటివి గ్రీన్‌హౌస్ వ్యవసాయానికి అనుకూలమైన పంటలు. గ్రీన్‌హౌస్ నిర్మాణానికి ఖర్చు ఎకరానికి దాదాపుగా ₹8 లక్షలు – ₹25 లక్షలు అవుతుంది. పంట ఉత్పత్తి చేయడానికి దాదాపుగా ₹1 లక్ష – ₹3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.
సంవత్సరానికి దాదాపుగా ₹4 లక్షలు – ₹10 లక్షల (పంటపై ఆధారపడి ఉంటుంది) వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. గ్రీన్‌హౌస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు 40% నుండి 60% వరకు సబ్సిడీ అందిస్తున్నాయి. ఎందుకు గ్రీన్‌హౌస్ వ్యవసాయం ఎంచుకోవాలి? వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ పంటలు సాగు చేయవచ్చు. ఇక మార్కెట్ డిమాండ్ ఉన్న సమయంలో పంటలు అమ్ముకోవచ్చు. ఉత్పత్తి చేయడం కంట్రోల్ లో ఉంటుంది.
కాబట్టి పురుగు మందులు, రసాయనాల అవసరం తక్కువగా ఉంటుంది. గ్రీన్‌హౌస్ వ్యవసాయంలో పంటల దిగుబడి సాధారణ వ్యవసాయం కంటే 2x-3x ఎక్కువగా ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి వినియోగాన్ని 70% వరకు తగ్గించవచ్చు. అధిక నాణ్యత గల పంటలు ఎక్కువ ధరలకు అమ్మే అవకాశం కూడా ఉంటుంది. కనీసం 1000 చదరపు మీటర్ల స్థలం కావాల్సి ఉంటుంది. స్థిరమైన నీటి సరఫరా ఉండేలా చూసుకోవాలి. గ్రీన్ హౌస్ కోసం వ్యవసాయ శాఖలు, ప్రైవేట్ సంస్థలు శిక్షణ ఇస్తున్నాయి. స్థానిక మరియు నగర మార్కెట్లకు దగ్గరగా ఉండటం మంచిది. మార్కెటింగ్ విషయానికి వస్తే మీరు మీ స్వంత బ్రాండ్ ద్వారా నేరుగా వినియోగదారులకు సరఫరా చేయవచ్చు. లేదా Instagram, WhatsApp, Facebook ద్వారా స్థానికంగా అమ్ముకోవచ్చు. పెద్ద పెద్ద రిటైల్ స్టోర్స్ మరియు ఎగుమతి కంపెనీలతో టై-అప్ అయ్యి అమ్మవచ్చు. BigBasket, FreshToHome వంటి స్టార్టప్‌ల ద్వారా డైరెక్ట్ డెలివరీ చేయవచ్చు.
3. Agri Tourism:
Agriculture Business Ideas లో ఈ Agri Tourism మూడవది.అగ్రి-టూరిజం అనేది వ్యవసాయానికి కొత్త దారి, ఆదాయానికి కొత్త అవకాశం! అగ్రి-టూరిజం అనే పదం Agriculture + Tourism అనే రెండు పదాల కలయిక. అంటే పర్యాటకులకు గ్రామీణ జీవనశైలిని, రైతుల జీవన విధానాన్ని ప్రత్యక్షంగా చూపించడం. రైతుల భూములను, పంటల పొలాలను, పశుపోషణ కేంద్రాలను, గ్రామీణ ఆహారం, సంప్రదాయ కళలు, మరియు ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించే అవకాశం కల్పించటం. ఇది వ్యవసాయాన్ని కేవలం పంటల వరకే పరిమితం చేయకుండా, ఆహారం + అనుభవం + ఆదాయం అనే మూడు కోణాల్లో అభివృద్ధి చేసే పద్ధతి.
అగ్రి-టూరిజం ఎలా పనిచేస్తుంది?
రైతు లేదా వ్యవసాయ భూమి యజమాని తన భూమిని సందర్శించడానికి పర్యాటకులకు అనుమతిస్తాడు. పర్యాటకులు ఆ భూమిలో జరిగే వ్యవసాయ కార్యకలాపాలు చూడవచ్చు. పంటలు నాటడం నుంచి, కోత పనులు, పశు సంరక్షణ మొదలైనవి. పర్యాటకులకు ఆహారం, వసతి, ప్రయాణం వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తే, అదనపు ఆదాయం పొందవచ్చు.
ఎందుకు ఈ వ్యాపారం లాభదాయకం?
నగర ప్రజలకు ఇదొక కొత్త అనుభవం. చిన్నపిల్లలతో పాటు పెద్దవారు కూడా ప్రకృతిని ఆస్వాదించాలనే తపనతో గ్రామీణ ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. శనివారాలు, ఆదివారాలు, సెలవుల సమయంలో పర్యాటకుల సందర్శనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా, YouTube వ్లాగ్స్ ద్వారా అగ్రి-టూరిజం ప్రాజెక్టులు చాలా పాపులర్ అవుతున్నాయి. పంటల పతనంతో నష్టపోతున్న రైతులకు ఇది స్థిర ఆదాయ మార్గం అవుతుందని చెప్పవచ్చు. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు అగ్రి-టూరిజం కేంద్రాలకు ప్రత్యేక రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్నాయి. వ్యవసాయ భూమి కనీసం 1–2 ఎకరాలు ఉంటే బాగుంటుంది. నివాసం కోసం గెస్ట్ హౌస్‌లు, హట్స్ లేదా టెంట్స్ ఉంటే బాగుంటుంది. ఆరోగ్యకరమైన గ్రామీణ ఆహారం వడ్డిస్తే బాగుంటుంది. జానపద నాట్యం, బుల్లెట్టు కార్లు, కర్ర సమరం వంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా అదనపు ఆదాయం పొందవచ్చు. పర్యాటకులకు సమాచారం ఇవ్వడానికి గైడ్ లేదా స్టాఫ్ ఉంటే మంచిది.
పర్యాటకులకు అందించే సేవలు:
- పంట పొలాల్లో తిరుగుతూ మంచి అనుభవం ఇవ్వాలి.
- పశుపోషణ శాలలో పాలు పితకడం, మేకలు, కోళ్లు చూసే అవకాశం కల్పించాలి.
- కాసేపు బుల్లెట్టు బండిలో ప్రయాణం చేయాలి.
- వనం మధ్యలో నేచర్ వాక్ లేదా ట్రెక్కింగ్ వంటివి చేయాలి.
- సాంప్రదాయ వంటకాలతో భోజనం వడ్డించాలి.
- వేడి వేడి అన్నం ముద్ద, నాటు కోడి కూర, జొన్న రోటీ లాంటి గ్రామీణ ఆహారం వడ్డించాలి.
- ఫోటోషూట్స్, వీడియో వ్లాగ్స్ కి అనుకూలమైన స్పాట్‌లు ఏర్పరచాలి.
- విద్యార్థుల / స్కూల్ టూర్స్ కి వ్యవసాయంలో శిక్షణ ఇవ్వాలి.
పెట్టుబడి & లాభాలు (Estimates)
హట్స్ లేదా గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ₹2 – ₹5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. టాయిలెట్, నీటి సౌకర్యాల కోసం ₹50,000 – ₹1 లక్ష వరకు ఖర్చు అవుతుంది. అలాగే డెకరేషన్ & టూర్ ఏర్పాట్ల కోసం ₹1 – ₹2 లక్షల ఖర్చు అవుతుంది. వంట గదులు & వంట సామగ్రి ₹50,000 – ₹1 లక్ష ఖర్చు అవుతుంది. అక్కడ ఉండే సిబ్బంది వేతనాలు (3–4 మంది ఉంటే) నెలకు ₹30,000 – ₹50,000 మధ్య అవుతుంది. ఇక ఒక్క సందర్శకుడికి ఆదాయం – ₹500 నుండి ₹1500 వరకు ఉంటుంది. నెలకు 100 పర్యాటకులు వస్తే గనుక ₹1 లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
6 Profitable Agriculture Business Ideas You Can Start Today
కాబట్టి ఇప్పటివరకు తెలుసుకున్న Agriculture Related Business Ideas మీకు ఎంతగానో ఉపయోగపడ్డాయని అనుకుంటున్నా. ఈరోజు మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని మార్చగలదు! కాబట్టి నేడు వ్యవసాయ రంగం సాధారణమైన రైతుకి మించి ఆలోచించే ప్రతి ఒక్కరికీ మంచి మంచి అవకాశాలను అందిస్తుంది. పైన మనం తెలుసుకున్న ప్రతి ఒక్క వ్యాపార ఆలోచన వెనుక సమర్థమైన పథకం దాగి ఉంది. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో, ఎక్కువ లాభాలను గడించి, శాశ్వతమైన ఆదాయం పొందవచ్చు. నిజానికి ఇవి మీ సమయాన్ని, శ్రమను విలువైనదిగా మారుస్తాయి. మీరు గనుక గ్రామంలో నివసిస్తున్నా, పట్టణంలో ఉన్నా, ఈ వ్యాపారాలు ప్రకృతి, పరిసరాలపై ఆధారపడి, మీరు స్వంతంగా మార్గం ఏర్పాటు చేసుకునేలా చేస్తాయి.
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై ప్రజల అవగాహన పెరగడం, ఆర్గానిక్ ఉత్పత్తుల డిమాండ్ పెరగడం వల్ల వ్యవసాయ రంగం పెద్ద మార్పుకు దారితీస్తోంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, మీకు నచ్చిన వ్యాపారాన్ని ఎంచుకోండి. దాని గురించి లోలోతుల్లో విశ్లేషించండి. ఆపై చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేయండి. ఇక మార్కెటింగ్, బ్రాండింగ్ ద్వారా ప్రజల్లో విశ్వాసం ఏర్పరచుకోండి. మీ వ్యాపార ప్రయాణాన్ని విజయవంతమైన గమ్యంగా మార్చుకోండి! అప్పుడు మీరు కూడా ఆదాయదాయకమైన వ్యవసాయ శ్రేణిలో ప్రవేశించగలరు. వ్యవసాయం అనేది పాతతనానికి నిదర్శనం కాదు. ఆధునిక భారతదేశానికి పునాది వంటిది!
FAQs :
1: What is vermicompost and how is it useful in agriculture?
agriculture business ideas లో ఇది మొదటిది మరియి చాల లాభదాయకమైనది. వర్మీ కంపోస్ట్ అనేది వ్యర్థ పదార్థాల సహాయంతో తయారు చేసే సహజ ఎరువులలో ఒకటి. ఇది మట్టిలోని జీవసత్తువను పెంచి, పంటలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. కాబట్టి ఇది రసాయన ఎరువులకంటే సురక్షితం మరియు పర్యావరణానికి అనుకూలం.
2: Where can I buy a vermicompost bag and how much does it cost?
వర్మీ కంపోస్ట్ బ్యాగ్‌లు స్థానిక వ్యవసాయ మార్కెట్లలో లేదా ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. వాటి ధర బ్యాగ్ పరిమాణంపై ఆధారపడి సుమారు ₹100 నుండి ₹500 వరకు ఉంటుంది. చిన్న వ్యవసాయదారులకి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
3: What are the advantages of greenhouse farming for beginners?
Greenhouse Farming వల్ల పంటలపై వాతావరణ ప్రభావం తగ్గుతుంది. ఇది అధిక దిగుబడులకు దారితీస్తుంది, నీటి వినియోగాన్ని తగ్గిస్తుంది మరియు ఏ కాలంలోనైనా పంటలు సాగు చేయొచ్చు. ఇది కొత్తగా వ్యవసాయాన్ని ప్రారంభించే వారికి మంచి ఛాయస్.
4: How can agri tourism generate income for farmers?
Agri Tourism ద్వారా రైతులు తమ వ్యవసాయాన్ని ప్రజలకు పరిచయం చేసి, వారి అనుభవాల ద్వారా ఆదాయం పొందవచ్చు. పర్యాటకులకు రైతు జీవితం ఎలా ఉంటుంది? ఎలాంటి పంటలు పండిస్తారు? అలాగే ప్రకృతిని ఆస్వాదిస్తారు. ఇది అదనపు ఆదాయ మార్గంగా మారుతుంది.
5: Is greenhouse farming profitable in India?
అవుననే చెప్పవచ్చు, Greenhouse Farming భారతదేశంలో లాభదాయకం. పంటలకు నియంత్రిత వాతావరణం కల్పించడంతో పాటు, అధిక దిగుబడి, తక్కువ నీటి వినియోగం, మరియు ఏడాది పొడవునా సాగు చేయడంవల్ల ఇది మంచి లాభాలను ఇస్తుంది.
6: What is the market demand for vermicompost today?
ప్రస్తుతం vermicompost కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సేంద్రియ వ్యవసాయం పెరిగే కొద్దీ సహజ ఎరువుల అవసరం పెరుగుతుంది. ఇంటి తోటల నుండి పెద్ద ఫార్మింగ్ వరకు అందరూ దీనిని వినియోగిస్తున్నారు. అందుకే మంచి లాభం పొందవచ్చు.
7. What are the best agriculture business ideas in 2025?
ఇప్పటి వరకు మనం చెప్పుకున్న agriculture business ideas లో Vermicomposting, Greenhouse Farming, Agri Tourism అనేవి చాల డిమాండ్ ఉన్నవి. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి. అవన్నీ మన వెబ్సైటు లో ఉన్నయి ఒకసారి చెక్ చేయండి.
8. What are the trending agriculture business ideas for beginners?
ఇప్పటి వరకు మనం తెలుసుకున్న Vermicomposting, Greenhouse Farming, Agri Tourism అనేవి చాల డిమాండ్ ఉన్నవి. వీటిలో ఏది నచ్చినా వాటిని స్టార్ట్ చేయవచ్చు. స్టార్టింగ్ లో ఎక్కువ పెట్టుబడి పెట్టి లాస్ అవ్వకండి. ముందుగా ఆ agriculture business ideas పై పూర్తిగా రీసెర్చ్ చేయండి. ఆపై దానిని చిన్నగా మొదలుపెట్టండి. అప్పుడే మంచిగా లాభాలు పొందుతారు.
Join us on Telegram Group.