Rakesh Jhunjhunwala, భారతదేశ స్టాక్ మార్కెట్‌లో అత్యంత విజయవంతమైన మరియు ప్రఖ్యాత ఇన్వెస్టర్లలో ఒకరుగా ప్రసిద్ధి చెందారు. అలాగే “Big Bull of India” అనే గొప్ప పేరు పొందాడు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఒక గొప్ప investor మరియు trader. అలాగే తన సొంత కంపెనీని మేనేజ్ చేస్తూ కూడా ఈరోజు ఎన్నో వేల కోట్లకు అధిపతి అయ్యారు.
ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ, సాధారణ స్థాయి నుండి బిలియనీర్ స్థాయికి ఎదిగిన ఆయన జీవిత ప్రయాణం కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించేవారికి ఎంతో ప్రేరణ కలిగించేలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆయన ఎప్పుడు జన్మించాడు? ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేశాడు? ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటి? ఎలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశాడు? కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు? ఇలాంటి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.
Early Life and Background:
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పూర్తి పేరు Rakesh Radheyshyam Jhunjhunwala. ఈయన 1960 జులై 5 వ తేదీన మార్వాడీ ఫ్యామిలీలో జన్మించారు. అయినప్పటికీ నివసించేది మాత్రం ముంబై లోనే. చదువు పరంగా Chartered Accountant పూర్తి చేశాడు. తన తండ్రి tax officer అవడంతో స్టాక్ మార్కెట్ గురించి వారిద్దరూ రోజూ మాట్లాడుకునేవారు. దాంతో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కి స్టాక్ మార్కెట్ పై ఆసక్తి పెరిగింది. అలా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్న తరువాత తాను ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకున్నాడు. కానీ ఆయన తండ్రి మాత్రం డబ్బులు ఇవ్వాలనుకోలేదు. అలా రాకేష్ ఝున్‌ఝున్‌వాలా చిన్నగా pocket money తో ప్రారంభించాడు.
Entry into the Stock Market:
అలా Rakesh Jhunjhunwala మొట్ట మొదటిసారి 1985 వ సంవత్సరంలో Rs 5,000 ఇన్వెస్ట్ చేసాడు. ఈయన సరైన నిర్ణయాన్ని సరైన సమయానికి తీసుకుని ఎక్కువ పొటెన్షియల్ ఉన్న పోర్టుఫోలియో నిర్మించుకున్నాడు. అందుకే 1986 వ సంవత్సరంలో చాలా లాభాలు పొందాడు. ఆయన ఇన్వెస్ట్ చేసిన మొదటి కంపెనీ Tata Tea. ఇందులో తాను ఇన్వెస్ట్ చేసిన మొత్తం ట్రిపుల్ అవ్వడం జరిగింది. దాంతో తన Portfolio మళ్లీ మార్పులు చేసి ఇంకా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేశాడు. దాంతో 1986 మరియు 1989 సంవత్సరం మధ్యలో దాదాపుగా 20-25 లక్షల లాభం పొందడం జరిగింది. కాలక్రమేణా ఆయన ఇన్వెస్ట్మెంట్స్ పెరగడంతో Rare Enterprises సంస్థ ద్వారా తన పోర్ట్‌ఫోలియోను నిర్వహించడం ప్రారంభించారు. ఇప్పుడు 2024 సంవత్సరంలో తన మొత్తం పోర్టుఫోలియో విలువ Rs 48,968 కోట్లు. ఆయన ఆస్తి ఇంత పెరగడానికి కారణం ఏంటి? తాను ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు ఏంటి? అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
Investment Philosophy:
Rakesh Jhunjhunwala’s ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ అనేది ఇండియన్ మార్కెట్ ను పూర్తిగా అర్థం చేసుకోవడం, లాంగ్ టర్మ్ లో ఎలా వృద్ధి చెందుతాయో ముందే రీసెర్చ్ చేసి గుర్తుంచుకుంటాడు.
1. Belief in India’s Growth Story : భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిరంతరం వృద్ధి చెందుతుంది కాబట్టి క్వాలిటీ బిజినెస్ లో పెట్టుబడి పెడితే భారీగా సంపద సృష్టించవచ్చు అని ఆయనకు నమ్మకం.
2. Long-Term Investing : స్టాక్స్ ని దీర్ఘకాలం పాటు హోల్డ్ చేసి పెట్టుకుంటే కాంపౌండింగ్ పవర్ వల్ల అది కాస్త డబల్ లేదా ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాకేష్ ఝున్‌ఝున్‌వాలా దీర్ఘకాల పెట్టుబడులు పై ఎక్కువ ఆసక్తి చూపించేవారు.
3. Risk and Reward : రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గారు ఏదైనా స్టాక్ లో పెట్టుబడి పెట్టే ముందు ఆ స్టాక్ గురించి పుట్టుపూర్వోత్తరాలన్నీ లోతుగా రీసెర్చ్ చేయడం జరుగుతుంది. అలాగే calculated risk తీసుకొని ఇన్వెస్ట్ చేస్తాడు. ఆయనకు ప్రధాన సిద్ధాంతాలు ఇవే.
4. Patience and Conviction : రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తరచుగా ఒక మాట చెబుతుంటారు. అదేంటంటే మార్కెట్ లో తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోదు, సహనం కూడా ఉండాలి అంటాడు. అందుకే ఆయనకు ఒక్కసారి కంపెనీపై నమ్మకం వచ్చిందంటే షార్ట్-టెర్మ్ లో ఎలాంటి మార్పులు వచ్చినా పట్టుదలతో నిలబడేవారు.
Key Investments:
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా చాలా మంచి పోర్ట్‌ఫోలియో నిర్మించుకున్నాడు. కాబట్టి ఆయన నిర్మించుకున్న భారతీయ కంపెనీస్ ఇప్పుడు మంచి లాభాల్లో ముందుకు దూసుకెళ్తున్నాయి. అందుకే అతను వేల కోట్లకు అధిపతి అయ్యాడు. అవేంటో మీరు కూడా తెలుసుకోండి. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అందరికంటే విభిన్నంగా ఆలోచించి 17 సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేసాడు.
Sector Wise Holdings : Pharmaceuticals-11%, Trading-7%, Banks(Private Sector)-7%, Miscellaneous-7%, Computes Software Training-4%, Finance General-4%, Telecommunications Service-4%, Construction & Contracting Civil-4%, Footwear-4%, Edible Oils & Solvent Extraction-4%, Auto LCVs & HCVS-4%, Hotels-4%, Hospitals & Medical Services-4%, Refractories-4%, Diversified-4%, Software-4%, Banks – Public Sector-4%
Top Stocks of Rakesh Jhunjhunwala:
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా లైఫ్ టైమ్ లో ఎక్కువగా పెరిగిన కొన్ని స్టాక్స్ ని సెక్టార్ ప్రకారం తీసుకుందాం. ఎందుకంటే ఆయనను ఇంత విజయవంతమైన ఇన్వెస్టర్స్ లో ఒకరిగా చేసింది ఇవే కాబట్టి.
1) Titan Company Limited : ఈ కంపెనీ అనేది Consumer Goods(Jewelry, Watches) సెక్టార్ కిందకు వస్తుంది. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆయనకు విపరీతమైన లాభాలు వచ్చాయి. ఎందుకంటే ఆయన భారతదేశంలో బ్రాండెడ్ జ్యువెలరీ మరియు గడియారాలకి డిమాండ్ ఏర్పడుతుందని ముందుగానే గ్రహించాడు కాబట్టి. అలాగే Titan కంపెనీ రిటైల్ మార్కెట్ లో ఆధిపత్యం సాధిస్తుందని నమ్మారు. అనుకున్నట్టే మంచి లాభాలతో ముందుకు దూసుకెళ్తుంది.
2) Star Health and Allied Insurance Company : ఈ కంపెనీ ఇన్సూరెన్స్ సెక్టార్ కి చెందినది. భవిష్యత్ లో ఇన్సూరెన్స్ విభాగం వేగంగా పెరుగుతుందని నమ్మారు. అలాగే స్టార్ హెల్త్ మార్కెట్ లో ఉన్న శక్తివంతమైన స్థానాన్ని పొందుతుందని పసిగట్టారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గారు ఈ కంపెనీ ప్రధాన వాటాదారుడు మరియు ప్రమోటర్ గా వ్యవహరించారు.
3) Tata Motors : ఈ కంపెనీ ఆటోమొబైల్ సెక్టార్ కి చెందింది. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కంపెనీ బ్రాండ్ అయిన Jaguar Land Rover కార్ విజయం సాధిస్తుందని నమ్మారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఈ కంపెనీ సామర్థ్యాన్ని గుర్తించారు. అనుకున్నట్టే లాభాలను చూపించింది.
4) Crisil Limited : ఈ కంపెనీ ప్రధానంగా Financial Services(Credit Rating) సెక్టార్ కి చెందింది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, భారత ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ రేటింగ్ ఇచ్చే ఏజెన్సీస్ అవసరం పెరుగుతుందని గ్రహించాడు. ఫైనాన్సిల్ సెక్టార్ లో ఆయన ఇన్వెస్ట్ చేసి విజయవంతమైన స్టాక్ ఇది.
Stock Market for Beginners – What is Share Market?
5) Escorts Kubota Limited : ఈ కంపెనీ Agriculture and Engineering సెక్టార్ కి చెందుతుంది. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ముఖ్య కారణం, మన భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లో వ్యవసాయ పరికరాల డిమాండ్ పెరుగుతుందని నమ్మారు. ఈ Escorts కంపెనీ ట్రాక్టర్ మరియు మెషినరీ విభాగాల్లో మంచి స్థానాన్ని కలిగి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మెషినరీ కి డిమాండ్ పెరుగుతుందని గ్రహించాడు. అనుకున్నట్టే మంచి లాభాలు పొందడం జరిగింది.
ఇంకా రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గారు Lupin Limited Stock (Pharmaceuticals Sector), Federal Bank Stock (Private Sector Bank), Canara Bank Stock (Public Sector Bank), Nazara Technologies Stock (Gaming and Technology Sector), Aptech Limited Stock (Education and Training Sector) వంటి కంపెనీలలో ఇన్వెస్ట్ చేశారు. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. కానీ మీకోసం కొన్ని ముఖ్యమైన స్టాక్స్ ని తీసుకొచ్చాము.
Achievements:
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గారు 2022 ఆగస్ట్ 14 వ తేదీన మరణించారు. అప్పటికి ఆయన మొత్తం సంపద విలువ 5 బిలియన్ డాలర్స్ పైగా ఉంది. 2024 సంవత్సరంలో ఆయన సంపద విలువ Rs 48,968 కోట్లు. భారదేశ వారెన్ బఫెట్‌గా పిలువబడిన ఆయన ఇన్వెస్టర్స్ కి ప్రేరణగా నిలిచారు. అలాగే స్టాక్ మార్కెట్ మరియు ఆర్థిక వ్యవస్థ గురించి తన అభిప్రాయాలను చాలా ఇంటర్వ్యూలలో పంచుకున్నారు.
Lessons for Investors:
Start Small : తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. కానీ సరైన మెళకువలు పాటించి నిర్ణయాలు తీసుకుంటే సంపద సృష్టించవచ్చు.
Stay Informed : ఏదైనా కంపెనీ లో ఇన్వెస్ట్ చేసేముందు పూర్తిస్థాయిలో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చేయండి
Focus on Growth : కంపెనీ యొక్క ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉండి మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉన్న వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి.
Be Patient : స్టాక్ మార్కెట్ లో సంపదను సృష్టించడం అంటే టైమ్ మరియు క్రమశిక్షణతో కూడుకున్నది.
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా విధానాన్ని మనం అనుసరిస్తే, Stock Market లో అవకాశాలను ఎలా పొందాలి? సంపదను ఎలా సృష్టించుకోవాలనేది తెలుస్తుంది. ఇన్వెస్టర్స్ కి ఈయన వారసత్వం ఇప్పటికీ ప్రేరణగా నిలుస్తుంది. ఇన్వెస్టింగ్ లో ఉన్న పవర్ ఏంటో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గురించి చదివితే తెలుస్తుంది.
గమనిక : ఇందులో చెప్పిన విషయాలు మీకు ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీకు మీరుగా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ ని సంప్రదిస్తే మీకు కావాల్సిన సమాచారం అందిస్తాడు.
8 Great Business Ideas To Start in 2025 – 8 గొప్ప వ్యాపారాలు
If you have a time, do you relly wanted to be investor, consider reading The Big Bull of Dalal Street
Join us on Telegram Group.