ప్రపంచం చాలా వేగంగా వృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో, కెరీర్ ని ఎంపిక చేసుకునేటప్పుడు కేవలం ఇంటరెస్ట్ మాత్రమే ఉంటే సరిపోదు, ఫ్యూచర్ కు సిద్ధంగా ఉండడం అవసరం. టెక్నాలజీ, ఆటోమేషన్, మరియు రిమోట్ వర్క్ వృద్ధి చెందుతున్న ఈ యుగంలో, 2025 సంవత్సరంలో డిమాండ్ మరియు, మంచి జీతభత్యాలు ఉన్న, సెక్యూర్ గా ఉండే కెరీర్ చాలా అవసరం. మీరు విద్యార్థి అయినా, ఉద్యోగి అయినా, కెరీర్ లో మార్పు కోసం చూస్తున్నా – ఇది మీ కోసమే. 5 Career Paths with Fastest Growth in 2025 లో మీకు నచ్చినదానిని కెరీర్ గా ఎంచుకోండి.
5 Career Paths with Fastest Growth in 2025
1. Data Science & AI Specialist
ఎందుకు వేగంగా వృద్ధి చెందుతుంది అంటే? ప్రతి ఒక్క వ్యాపారం ఇప్పుడు డేటాపైనే ఆధారపడుతోంది. చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ దాకా ప్రతి కంపెనీకి స్మార్ట్ డేసిషన్స్ తీసుకోవడానికి డేటా అవసరం. డేటా సైన్స్ ఒక కెరీర్ మాత్రమే కాదు – ఇది ఒక శక్తివంతమైన పవర్. ఇందులో ముఖ్యమైన స్కిల్స్ ఏంటంటే Python, SQL, Machine Learning డేటా విజువలైజేషన్ (Tableau, Power BI) ఉంటాయి. ఇక్కడ ఉపయోగించే టూల్స్ TensorFlow, Jupyter, Scikit-learn. జీతం విషయానికి వస్తే సంవత్సరానికి ₹8L – ₹25L ఉంటుంది. కెరీర్ స్కోప్ ఎలా ఉంటుందంటే, డేటా అనలిస్ట్ → డేటా సైంటిస్ట్ → ఏఐ ఆర్కిటెక్ట్ అలాగే రిమోట్ వర్క్ మరియు ఫ్రీలాన్సింగ్ అవకాశాలు ఉంటాయి. Google Data Analytics Course మనకు Coursera ప్లాట్ఫారం లో ఫ్రీగా లభిస్తుంది. కాబట్టి మీరు ఈ కోర్స్ ఫ్రీగా నేర్చుకోవచ్చు.
2. Cybersecurity Analyst
ఎందుకు వేగంగా వృద్ధి చెందుతుంది అంటే? డిజిటల్ ఫ్రాడ్, డేటా లీక్ వంటివి పెరుగుతున్న సమయంలో, సైబర్ సెక్యూరిటీ చాలా కీలకం. ఇందులో మనకు ముఖ్యమైన స్కిల్స్ నెట్‌వర్కింగ్, ఎథికల్ హాకింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ ఉంటాయి. అలాగే ఎక్కువగా ఉపయోగించే టూల్స్ Wireshark, Nessus ఉంటాయి. మనం పూర్తి చేయాల్సిన ముఖ్యమైన సర్టిఫికేషన్స్ CEH, CompTIA Security+, CISSP. జీతం విషయానికి వస్తే మాత్రం ₹6L – ₹20L+ ఉంటుంది. కెరీర్ స్కోప్ ఎలా ఉంటుందంటే, సెక్యూరిటీ అనలిస్ట్ → పెనెట్రేషన్ టెస్టర్ → సెక్యూరిటీ ఆర్కిటెక్ట్. ఇక్కడ మనం ఇంటర్నేషనల్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ లేదా రిమోట్ వర్క్ చేసుకోవచ్చు.
3. Digital Marketing Strategist
ఎందుకు వేగంగా వృద్ధి చెందుతుంది అంటే?
డిజిటల్ ప్రాధాన్యం పెరుగుతోన్న ఈ రోజుల్లో ప్రతి వ్యాపారానికీ డిజిటల్ విజిబిలిటీ అవసరం. ఇందులో ప్రధానంగా SEO, కంటెంట్ మార్కెటింగ్, ఇమెయిల్ మార్కెటింగ్, గూగుల్/మెటా అడ్స్, అనలిటిక్స్ వంటి స్కిల్స్ ఉంటాయి. అలాగే డిజిటల్ మార్కెటింగ్ లో ఉపయోగించే టూల్స్ SEMrush, Canva, Google Ads, ChatGPT. జీతం విషయానికి వస్తే ₹4L – ₹15L+ ఉంటుంది. ఇక్కడ కెరీర్ స్కోప్ ఎలా ఉంటుందంటే కంటెంట్ మేనేజర్ → డిజిటల్ స్ట్రాటజిస్ట్ → మార్కెటింగ్ హెడ్, మరియు ఫ్రీలాన్స్, రిమోట్ వర్క్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. Google Digital Garage, HubSpot Academy, Meta Blueprint వంటి ప్లాట్ఫారం లలో ఫ్రీగా ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవచ్చు.
4. Full Stack Developer
ఎందుకు వేగంగా వృద్ధి చెందుతుంది అంటే? అప్లికేషన్లను రూపొందించడంలో, బిజినెస్ ఆటోమేషన్‌లో డెవలపర్లు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ చాలా అవసరం. ఇందులో ప్రధానంగా HTML, CSS, JavaScript, React, Node.js, MongoDB, Git, API integration వంటి స్కిల్స్ ఉంటాయి. ఫుల్ స్టాక్ డెవలపర్ జీతం సంవత్సరానికి ₹6L – ₹22L వరకు ఉంటుంది. ఇందులో కెరీర్ స్కోప్ జూనియర్ డెవలపర్ → ఫుల్ స్టాక్ ఇంజినీర్ → టెక్ లీడ్. స్టార్టప్‌లు, SaaS కంపెనీస్, రిమోట్ టెక్ కంపెనీస్ ఎక్కువగా హైరింగ్ చేస్తుంటాయి.
5. Career Coach / HR Tech Specialist
ఎందుకు వేగంగా వృద్ధి చెందుతుంది అంటే? కరోనా తర్వాత, ఉద్యోగంలో చాలా మార్పులు వచ్చాయి. కాబట్టి ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఏ కెరీర్ నుంచి ఎలా స్విచ్ అవ్వాలో తెలీక ప్రజలు చాలా కన్ఫ్యూషన్ లో ఉన్నారు. అందుకే కెరీర్ గైడెన్స్ మరియు HR టెక్ చాలా కీలకమవుతున్నాయి. ఇందులో ముఖ్యమైన స్కిల్స్ కమ్యూనికేషన్, కోచింగ్, HR సాఫ్ట్‌వేర్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. LinkedIn మరియు Upwork వంటి ప్లాట్ఫారంలలో చాలా మంచి డిమాండ్ ఉంది. ఇందులో జీతం సంవత్సరానికి ₹3L – ₹12L ఉంటుంది. కన్సల్టింగ్ లో జీతం ₹1000 – ₹5000 / గంట ఉంటుంది.
Comprehensive Financial Management for Wealth Building – 10 Steps for You
Bonus List :
- UI/UX Designer
- Fintech Analyst
- Blockchain Developer
- Climate Tech Specialist
- Content Creator / Influencer
How to Choose the Right Career Path in 2025
మీకు సరిపోయే కెరీర్‌ను ఎలా ఎంచుకోవాలి? నచ్చిన అంశాలు ఏమిటి? ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలనుకుంటున్నారా? లేక ఆఫ్ లైన్ లో నేర్చుకోవాలనుకుంటున్నారా? స్థిరమైన ఉద్యోగం కావాలనుకుంటున్నారా లేక స్వేచ్ఛ కావాలనుకుంటున్నారా? అలాగే మీరు ఆశించే జీతం ఎంత?. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని ఒక మంచి కెరీర్ ని ఎన్నుకోండి. ట్రెండ్ కి అనుగుణంగా మీ కెరీర్ ని నిర్ణయించుకోండి. మీ ఇంటరెస్ట్ + ఫ్యూచర్ అవకాశాలు కలిసే కెరీర్‌ను ఎంచుకోండి. 2025 సంవత్సరంలో కెరీర్ అంటే ఒకే ఉద్యోగం కాదు. స్కిల్స్ నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవడం. పైన మీరు తెలుసుకున్న టాప్ 5 కెరీర్ మార్గాలు మీకు మంచి శాలరీ, సెక్యూర్ మరియు ఫ్యూచర్ కు అవసరమైన స్కిల్స్‌ను అందిస్తాయి.
FAQs
Q. డిగ్రీ లేకుండా ఈ కెరీర్‌లకు ఎంచుకోవచ్చా? అవును. చాలా కెరీర్‌లకు ప్రాక్టికల్ నైపుణ్యాలు, ప్రాజెక్ట్‌లు మరియు ఆన్‌లైన్ కోర్సులు అవసరం.
Q. ఫ్రీగా స్టార్ట్ చేయాలంటే? Google Garage, Coursera, YouTube, HubSpot వంటివి ఉచితంగా లభిస్తాయి.
Q. ట్రెండ్స్‌కి అనుగుణంగా ఎలా అప్‌డేట్ అవ్వాలి? LinkedInలో ఇండస్ట్రీ లీడర్లను ఫాలో అవ్వండి, Telegram/Discord కమ్యూనిటీల్లో చేరండి. అలాగే మన ఈ వెబ్సైట్ ను డైలీ ఫాలో అయితే మీకు ఇంకా మంచి అప్డేటెడ్ కంటెంట్ వస్తుంది. 5 Career Paths with Fastest Growth in 2025 లో అత్యధిక డిమాండ్ ఉన్న కెరీర్ దారులను ఇప్పుడు తెలుసుకున్నారు కదా. అయితే వీటిలో మీకు నచ్చినవాటిని ఎంచుకొని నేర్చుకోండి.
Join us on Telegram Group.
Leave a Reply