ప్రతి నెలా మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడంలేదా? పొదుపు చేయడం కష్టంగా అనిపిస్తుందా? మీకు మాత్రమే అలా అనిపిస్తుందా లేక అందరికీ అలాగే ఉంటుందా? దీనికి పరిష్కారం చాలా సింపుల్ మీ యొక్క వ్యక్తిగత నెలవారీ బడ్జెట్ ప్లాన్ ను వేసుకోవాలి. ఇప్పుడు మీరు మీ యొక్క నెలవారీ ఆదాయం, ఖర్చులు, మరియు పొదుపు లక్ష్యాలను సులభంగా ట్రాక్ చేయడానికి కావాల్సిన Personal Monthly Budget స్టెప్-బై-స్టెప్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా చదివిన తర్వాత ఆచరణలో పెట్టండి. అప్పుడే డబ్బు అనేది మన నియంత్రణలో ఉంటుంది.
Why You Need a Monthly Budget
నెలవారీ బడ్జెట్ అనేది ఖర్చును ఆపేయడం కాదు. ఇది మీరు మీ డబ్బుని కంట్రోల్ చేయడానికి, భవిష్యత్తును నిర్మించడానికీ ఉపయోగపడుతుంది. బడ్జెట్ ప్లాన్ తో మీరు ఏం చేయగలరంటే, ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చవుతుందో తెలుసుకోవచ్చు. అలాగే అప్పుల నుండి దూరంగా ఉండవచ్చు. మీరు మీ డ్రీమ్ కోసం పొదుపు చేయవచ్చు. అలాగే ఆర్థిక భద్రతను ఏర్పరుచుకోవచ్చు. ఇంకా టెన్షన్ లేకుండా జీవించవచ్చు.
What is a Personal Monthly Budget?
వ్యక్తిగత నెలవారీ బడ్జెట్ అనేది మీ లక్ష్యం కు అనుగుణంగా మీ ఆదాయాన్ని ఖర్చులు, పొదుపుగా విభజించే ప్రణాళిక. దీనివల్ల మీరు ప్రతి నెలా ఎక్కడ ఎంత ఖర్చవుతోంది అనేది క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు.
Step-by-Step: How to Create Your Personal Monthly Budget
Step 1: Know Your Total Monthly Income
మీ నెలవారీ ఆదాయం ఎంత అనేది పూర్తిగా తెలుసుకోండి. అలాగే ఎన్ని రకాలుగా వస్తుందో తెలుసుకోండి. మీకు తెలియకపోతే క్రింద కొన్ని ఆదాయ మార్గాలను ఇవ్వడం జరిగింది.
- జీతం (హ్యాండ్లో వచ్చే మొత్తం)
- ఫ్రీలాన్స్/సైడ్ ఇన్‌కమ్
- ఇతర ఆదాయాలు (ఇంటి అద్దె, చిన్న వ్యాపారాలు)
- మీ యొక్క ఆదాయం నెల నెలా జీతం ద్వారా వస్తుందా? లేక ఫ్రీలాన్స్ ద్వారా వస్తుందా? అదీ కాకపోతే ఇంటి అద్దె ద్వారా వస్తుందా? లేక బిసినెస్ వల్ల వస్తుందా? అనేది క్లియర్ గా తెలుసుకోండి. జీతం అనేది ట్యాక్సెస్ తీసేసిన తరువాత వచ్చే మొత్తం మాత్రమే లెక్కించండి.
Step 2: List All Fixed Expenses
ప్రతి నెల ఎంత ఖర్చులు అవుతాయి? అవి ఎక్కడెక్కడ ఖర్చు అవుతాయో పూర్తిగా అర్థం చేసుకోండి. ప్రతి నెలా ఒకేలా వచ్చే ఖర్చులు ఇప్పుడు తెలుసుకుందాం.
- అద్దె లేదా హోమ్ లోన్ EMI
- కరెంట్, నీరు, గ్యాస్ బిల్లు
- ఇంటర్నెట్, మొబైల్ బిల్లు
- ఇన్సూరెన్స్ ప్రీమియం
- OTT/జిమ్ సబ్‌స్క్రిప్షన్లు
Step 3: Estimate Expenses
ప్రతి నెల ఖర్చులు ఎక్కడెక్కడ మారుతాయి? ప్రతి నెలా మారే ఖర్చులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- కూరగాయలు, తినే పదార్థాలు
- ట్రావెల్, పెట్రోల్
- షాపింగ్, ఎంటర్టైన్‌మెంట్
- ఇతర చిన్నచిన్న ఖర్చులు
Step 4: Set Monthly Savings Goals
ప్రతి నెల వచ్చే ఆదాయంలో ఫ్యూచర్ కోసం ఎంత పొదుపు చేస్తున్నారు? అవి ఎక్కడెక్కడ పొదుపు చేస్తున్నారు? మీ ఆదాయంలో కనీసం 20% పొదుపు చేయాలని లక్ష్యం పెట్టుకోండి. ఎక్కడెక్కడ పొదుపు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఎమర్జెన్సీ ఫండ్
- SIPs, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్
- షార్ట్ టర్మ్ గోల్స్ (ఫోన్, ట్రిప్)
- లాంగ్ టర్మ్ గోల్స్ (ఇల్లు, పెన్షన్)
Step 5: Use a Budgeting Template
నెలవారీ బడ్జెట్ ప్లాన్ సులభంగా చేయడానికి క్రింద ఇచ్చిన పద్దతులను ఉపయోగించండి.
- గూగుల్ షీట్ (ఆటో కెలిక్యులేషన్‌తో)
- నెలవారీ ఖర్చుల ట్రాకింగ్
- పొదుపు గ్రాఫ్
- ప్రింటబుల్ PDF
ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ తో గూగుల్ షీట్ లో ఎంట్రీ చేసి, ఆటో కెలిక్యులేషన్ చేయండి. ఇంకా క్లియర్ గా అర్థం కావడానికి పొదుపు గ్రాఫ్ ఉపయోగించండి. మొత్తం పూర్తిగా నోట్ చేసిన తర్వాత ప్రింటబుల్ PDF కూడా తీసుకోవచ్చు. దాంతో ఎప్పటికప్పుడు మీ ఆదాయం, ఖర్చులు అనేవి తెలుస్థాయి.
Step 6: Monitor, Review & Improve
ఇందాక బడ్జెట్ ప్లాన్ టెంప్లేట్ ఫ్రీగా తయారుచేసుకోవడం ఎలాగో తెలుసుకున్నాం కదా. ఆ టెంప్లేట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేది తెలియాలంటే, క్రింద ఇచ్చిన క్యూషన్స్ మీకు మీరుగా ప్రశ్నించండి.
- ఖర్చులు తగ్గించగలిగామా?
- అవసరములేని ఖర్చు ఏవైనా చేశామా?
- పొదుపు మెరుగుపరచగలమా?
ఇప్పుడు ఈ క్యూషన్స్ వల్ల మీకైమైనా తెలిసిందా? చాలానే అర్థం అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఆదాయాన్ని, ఖర్చులను సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఇలా మీరు అలవాటు చేసుకుంటే, మీ బడ్జెట్ అనేది పూర్తిగా మీ కంట్రోల్ లో ఉంటుంది.
Comprehensive Financial Management for Wealth Building – 10 Steps for You
Common Budgeting Mistakes to Avoid
- స్నాక్స్ వంటి చిన్న చిన్న ఖర్చులను లెక్కలో పెట్టకపోవడం
- ఆదాయాన్ని ఎక్కువగా అంచనా వేయడం
- గిఫ్ట్స్, కార్ సర్వీసింగ్ వంటి అప్పుడప్పుడు వచ్చే ఖర్చులను మర్చిపోవడం
- రియలిస్టిక్ గోల్స్ లేకపోవడం
- నెల నెల ఖర్చులను రివ్యూ చేయకుండా ఉండటం
కాబట్టి ఇలాంటి తప్పులను సరిచేసుకోవడం చాలా అవసరం. డబ్బులు విచ్చలవిడిగా మీకు తెలియకుండా ఖర్చయితే, క్రింద ఇచ్చిన పాయింట్స్ ఫాలో అవ్వండి. మీకే ఒక క్లారిటీ వస్తుంది.
5 Tips to Stick to Your Budget
1. డిజిటల్ పేమెంట్స్ ఉపయోగించండి (UPI, కార్డ్)
2. పొదుపును ఆటోమేట్ చేయండి (SIP, RD)
3. రోజువారీ ఖర్చులు ట్రాక్ చేయండి (యాప్స్ ఉపయోగించండి)
4. నగదు ఎన్‌వెలప్ పద్ధతి ట్రై చేయండి
5. ఫ్యామిలీతో డిస్కస్ చేయండి (లేదా పార్ట్నర్‌తో)
బడ్జెట్ అనేది డబ్బుని నియంత్రించడం కాదు. మీ డబ్బును మీరు కంట్రోల్ చేయడం. కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో కాదు ముఖ్యం. ఎలా ఖర్చు చేస్తున్నారనేది కీలకం. కాబట్టి పైన చెప్పిన ఫ్రీ ఇన్ఫర్మేషన్ తో మీ ఆదాయ ఖర్చులను 30 నిమిషాల్లో ప్లాన్ చేసుకోండి. పైన చెప్పిన Personal Monthly Budget ను పూర్తిగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. మీకు ఈ ఆర్టికల్ ఉపయోగపడిందని అనిపిస్తే, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, మరియు ఆర్థిక నియంత్రణలోకి అడుగుపెట్టండి!
Join us on Telegram Group.
Leave a Reply